న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జేసన్ రాయ్ అర్ధ శతకం.. కోలుకున్న ఇంగ్లండ్

England vs Ireland: Jack Leach, Jason Roy strike fifties, England lead of 181 runs

లండన్ : లార్డ్స్‌ మైదానంలో ఐర్లాండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో ఇంగ్లండ్ కోలుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 85 పరుగులకే ఆలౌట్ అయిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసింది. 122 పరుగుల లోటుతో గురువారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ జట్టుకు జాక్ లీచ్ (92), జేసన్ రాయ్ ( 72) విజృంభించడంతో 9 వికెట్లు కోల్పోయి 303 పరుగులు చేసింది. ఇదే సమయంలో వర్షం పడడంతో రెండో రోజు ఆట ముగిసింది. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 181 పరుగుల ఆధిక్యంలో ఉంది.

ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-7 ప్రత్యేక వార్తల కోసం

బర్న్స్ మరోసారి:

బర్న్స్ మరోసారి:

బుధవారం ఒకే ఓవర్ ఆడిన ఇంగ్లండ్.. గురువారం రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించింది. ఓపెనర్ రోరీ బర్న్స్ (6) మరోసారి నిరాశపరిచాడు. మరో ఓపెనర్ లీచ్.. రాయ్ సహాయంతో వికెట్లను అడ్డుకున్నాడు. ఇద్దరూ బౌండరీలు బాదుతూ ఐర్లాండ్ బౌలర్లపై ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలోనే అర్ధ సెంచరీలు చేసి రెండో వికెట్‌కు 145 పరుగులు జోడించారు.

రూట్ పోరాడినా:

రూట్ పోరాడినా:

దూకుడు మీదున్న రాయ్‌ని బౌలర్ థాంమ్సన్ బౌల్డ్ చేశాడు. కొంత సమయానికి ముర్తా బౌలింగ్‌లో లీచ్ కూడా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత డెన్లీ (10), బెయిర్‌స్టో (0)లు మరోసారి విఫలమవడంతో ఇంగ్లండ్ 194 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత వచ్చిన మొయిన్ అలీ (9) కూడా త్వరగానే పెవిలియన్ చేరాడు. కెప్టెన్ రూట్ (31) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసినా.. ఆదిర్ బౌలింగ్‌లో ఔటైపోయాడు. ప్రస్తుతం క్రీజులో బ్రాడ్ (20), స్టోన్స్ (0) ఉన్నారు.

85 పరుగులకే ఆలౌట్‌:

85 పరుగులకే ఆలౌట్‌:

బుధవారం ప్రారంభమైన నాలుగు రోజుల టెస్ట్‌లో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 23.4 ఓవర్లలో 85 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఐర్లాండ్‌ పేస్ బౌలర్ టిమ్ ముర్టాగ్ ఐదు వికెట్లతో విజృంభించడంతో ఇంగ్లండ్‌ కకలావికలం అయింది. అనంతరం ఐర్లాండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించి నిలకడగా ఆడింది. ఓపెనర్లు పోర్టర్‌ ఫీల్డ్ (14), జేమ్స్ మెక్‌కల్లమ్ (19) 19 ఓవర్లలోపే ఔట్ అయ్యారు. ఆ తర్వాత బాల్బిర్నీ (55) అర్ధ శతకంతో ఆదుకున్నాడు. ఇక స్టిర్లింగ్ (36), ఓబ్రెయిన్ (28) కూడా కాసేపు క్రీజులో నిలిచారు. చివరలో మెక్‌బ్రెయిన్ (11), ముర్టాగ్ (16) పోరాడంతో 207 పరుగులు చేసి ఆలౌటైంది.

Story first published: Friday, July 26, 2019, 10:18 [IST]
Other articles published on Jul 26, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X