న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంగ్లండ్ క్రికెటర్ల మంచి మనసు.. కరోనా కోసం భారీ మొత్తంలో విరాళం!!

England men contracted players donate 5 lakh pound and women volunteer salary reductions

లండన్: ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ (కోవిడ్-19) మహమ్మారిపై పోరాటానికి ఇంగ్లండ్ క్రికెటర్లు (పురుషులు, మహిళలు) భారీ విరాళాన్ని ఇవ్వడానికి ముందుకొచ్చారు. స్వచ్ఛందంగా తమ జీతాల్లో(మూడు నెలలు) 20 శాతాన్ని విరాళంగా ప్రకటించారు. ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) ఈ ప్రతిపాదన చేయగా.. ఆటగాళ్లు అందుకు అంగీకరించారు. అంత‌కుముందు ఈసీబీ.. ఆట‌గాళ్ల జీతాల్లో 20 శాతం కోత విధిస్తామ‌ని ప్రొఫెష‌న‌ల్ క్రికెట‌ర్స్ అసోసియేష‌న్ (పీసీఏ)కు స‌మాచార‌మిచ్చింది. ప్ర‌స్తుతమిది చ‌ర్చ‌ల ద‌శలో ఉండ‌గానే.. ఇంగ్లండ్ పురుష క్రికెట‌ర్లు విరాళమిచ్చారు.

రోహిత్, వార్నర్ అత్యుత్తమ ఓపెనర్లు: మూడీరోహిత్, వార్నర్ అత్యుత్తమ ఓపెనర్లు: మూడీ

మహిళా క్రికెటర్లు సైతం:

మహిళా క్రికెటర్లు సైతం:

ఇంగ్లండ్ పురుషుల మూడు నెలల జీతాల్లో 20 శాతం అంటే.. దాదాపు 5లక్షల పౌండ్లతో సమానం. ఇక మహిళా క్రికెటర్లు సైతం ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో తమ జీతాల నుంచి విరాళం ఇవ్వడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. మ‌రోవైపు క‌రోనా వైర‌స్‌పై పోరాటానికి త‌మ వంతు సాయం చేస్తామ‌ని కొందరు క్రికెటర్లు బోర్డుకు తెలిపారు. ఇప్ప‌టికే ఇంగ్లాండ్ వికెట్‌కీప‌ర్ జోస్ బ‌ట్ల‌ర్ గ‌తేడాది వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో తాను ధ‌రించిన జెర్సీని వేలానికి ఉంచాడు. ఇక మహిళా జట్టు సారథి హెథర్‌నైట్‌ జాతీయ ఆరోగ్య సర్వీస్‌తో కలిసి వాలంటీర్‌గా పనిచేస్తోంది.

సమష్టిగా సహకరిస్తాం:

సమష్టిగా సహకరిస్తాం:

'ఛారిటబుల్‌ డొనేషన్‌కు సంబంధించిన వివరాలపై ఇంకో వారంలో నిర్ణయం తీసుకుంటాం. ఈ విరాళం మొత్తం ఇంగ్లండ్ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ఆటగాళ్ల మూడు నెలల జీతంలో 20 శాతంతో సమానం. ఇంగ్లండ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఈసీబీతో చర్చలు కొనసాగిస్తాం. ఇక్కడ క్రికెట్‌ కార్యకలాపాలతో పాటు బయటి పరిస్థితులు మెరుగయ్యేందుకు అవసరమైన విధంగా సమష్టిగా సహకరిస్తాం' అని క్రికెటర్లు వెల్లడించారు.

టామ్ హారిసన్ కూడా:

టామ్ హారిసన్ కూడా:

వైరస్ వ్యాప్తి క్రికెట్‌పై కూడా తీవ్రస్థాయిలో ప్రభావం చూపిస్తోంది. వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని ప్రతిష్టాత్మక క్రికెట్ టోర్నమెంట్లు రద్దయ్యాయి. ఈ క్రమంలో ఆర్థిక సంక్షోభం కూడా ఏర్పడింది. ఈ ఆర్థిక సంక్షోభాన్ని తీర్చేందుకు ఇంగ్లండ్ బోర్డు కాంట్రాక్ట్ క్రికెటర్లు ముందుకొచ్చారు. ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ టామ్ హారిసన్ తన వేతనం నుంచి స్వచ్ఛందంగా 25 శాతాన్ని కోత విధించుకున్న విషయం తెలిసిందే.

మే 28 వరకు రద్దు:

మే 28 వరకు రద్దు:

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా మే 28 వరకూ ఇంగ్లండ్‌లో జరగాల్సిన అన్ని టోర్నమెంట్లు రద్దయ్యాయి. ఆ తర్వాత జరగాల్సిన వెస్టిండీస్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్ పర్యటనలపై కూడా అనుమానాలు ఉన్నాయి. అయితే కరోనా సెలవులను ఇంగ్లండ్ క్రికెటర్లు ఇంటివద్ద ఎంజాయ్ చేస్తున్నారు.

Story first published: Saturday, April 4, 2020, 19:10 [IST]
Other articles published on Apr 4, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X