న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మూణ్నాలుగు వారాలే: క్రికెట్‌‌కు పూర్తిస్థాయి వీడ్కోలు పలకనున్న పీటర్సన్

By Nageshwara Rao
England batsman Kevin Pietersen to end cricket career after upcoming PSL

హైదరాబాద్: ఇంగ్లాండ్‌ మాజీ స్టార్ బ్యాట్స్‌మన్‌ కెవిన్‌ పీటర్సన్‌ త్వరలోనే తన క్రికెట్ కెరీర్‌కు పూర్తిగా వీడ్కోలు పలకనున్నాడు. ఆరేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతోన్న అనేక లీగ్‌ల్లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే.

అయితే గురువారం నుంచి దుబాయిలో ఆరంభమయ్యే పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌)లో ఆడిన అనంతరం ప్రొఫెషనల్ క్రికెట్‌ నుంచి పూర్తిస్థాయిలో నిష్క్రమించనున్నాడు. ఈ మేరకు తన ఇనిస్టాగ్రామ్ ఖాతాలో అధికారిక ప్రకటన చేశాడు.

'ఒక క్రికెటర్‌గా నేను నా భార్య జెస్సికా టేలర్‌తో పాటు పిల్లలకు ఎన్నోసార్లు గుడ్‌బై చెప్పాను. అయితే ఈ సాయంత్రమే వారికి చివరి గుడ్‌బై చెప్పాను. ఇంకో మూడు లేదా నాలుగు వారాల తర్వాత నా ప్రొఫెషనల్‌ క్రికెట్ కెరీర్‌ ముగుస్తుంది. ఆ తర్వాత నా సమయాన్ని పూర్తిగా ఫ్యామిలికే కేటాయిస్తా' అని పీటర్సన్‌ చెప్పాడు.

పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో కెవిన్ పీటర్సన్ క్వెట్టా గ్లాడియేటర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. గత రెండు సీజన్లలో క్వెట్టా గ్లాడియేటర్స్ జట్టు ఫైనల్‌కు అర్హత సాధించడంలో పీటర్సన్ కీలకపాత్ర పోషించాడు. అయితే రెండో సీజన్‌లో భద్రతా కారణాల దృష్ట్యా ఫైనల్ ఆడలేకపోయాడు.

ఎందుకంటే పీఎస్ఎల్ రెండో సీజన్ ఫైనల్స్ లాహార్‌లో జరగడమే ఇందుకు కారణం. మూడో సీజన్‌లో కూడా రెండు ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు లాహోర్, కరాచీ వేదికగా వచ్చే నెలలో జరగనున్నాయి. ఈ రెండు మ్యాచ్‌లకు తాను ఆడలేనని క్వెట్టా గ్లాడియేటర్స్ యజమాని నదీమ్ ఒమర్‌కు పీటర్సన్ ఇప్పటికే తెలిపాడు.

అయితే నదీమ్ ఒమర్ మాత్రం పీటర్సన్‌ను ఒప్పించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంగ్లాండ్ తరుపున పీటర్సన్ 104 టెస్టులు, 136 వన్డేలు, 37 టీ20లు ఆడాడు. 2014లో జట్టు మేనేజ్‌మెంట్‌తో విభేధాలు తలెత్తడంతో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు పీటర్సన్‌ను జట్టు నుంచి తప్పించింది.

Story first published: Wednesday, February 21, 2018, 10:27 [IST]
Other articles published on Feb 21, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X