న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Eng vs Nz 2nd test : ఆట ఇప్పుడే మొదలైంది.. చివరి రోజు ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌ను ఊరిస్తున్న గెలుపు

Eng vs Nz 2nd Test: Final Day is Interesting, Either England or Newzealand win if NZ all out shortly

నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్‌లో ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. గత నాలుగు రోజులుగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్ హోరాహోరీగా ఆడుతున్నాయి. తొలుత కివీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 553‌పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఇక ఇంగ్లాండ్ టఫ్ పోటీ ఇస్తుందా ఇవ్వదా అనే డౌట్లు వచ్చాయి. అయితే ఇంగ్లాండ్ బ్యాటర్లలో ఆలీ పోప్, జో రూట్ సెంచరీలతో చెలరేగి మూడో వికెట్‌కు 187పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి గట్టిపోటీలోకి ఇంగ్లాండ్‌ను తీసుకొచ్చారు.

జో రూట్, పోప్ పట్టుదలతో..

వీరి బ్యాటింగ్ చూస్తుంటే ఒకానొక దశలో ఇంగ్లాండ్ మళ్లీ ఆధిక్యంలోకి రావొచ్చేమో అనిపించింది. జో రూట్ (176), ఆలీ పోప్ (145), కెప్టెన్ బెన్ స్టోక్స్ (46), బెన్ ఫోక్స్ (56) పరుగులు చేయడంతో ఇంగ్లాండ్ 539పరుగులు చేయగలిగింది. ఇక న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 14పరుగుల స్వల్ప ఆధిక్యం మాత్రమే సాధించగలిగింది. ఇక నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు వెటరన్ ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ ఆదిలోనే షాకిచ్చాడు. కెప్టెన్ టామ లాథమ్‌ను తొలి ఓవర్లోనే 4పరుగులకు బౌల్డ్ చేశాడు. తద్వారా తన 650వ టెస్ట్ వికెట్‌ను ఆండర్సన్ సాధించాడు.

నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి..

అయితే తర్వాత విల్ యంగ్, డెవాన్ కాన్వే రెండో వికెట్ స్టాండ్‌కు 100పరుగులు జోడించారు. కాన్వే 52 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. అయినప్పటికీ, యంగ్ మరో ఎండ్ నుండి గొప్ప ప్రతిఘటనను ప్రదర్శించాడు. ఆ తర్వాత యంగ్ సైతం 56పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. ఇక టామ్ బ్లండెల్ (24), మైఖేల్ బ్రేస్‌వెల్ 25 పరుగులతో కాస్త పోరాటాన్ని ప్రదర్శించారు. వీరిద్దరు ఔటయ్యాక టిమ్ సౌథీ గోల్డెన్ డక్‌‌గా రనౌట్ అయ్యాడు. ఇకపోతే క్రీజులో ఫామ్‌లో ఉన్న బ్యాటర్ డారిల్ మిచెల్ (32 నాటౌట్), మాట్ హెన్రీ (8 నాటౌట్) ఉన్నారు. నాలుగో రోజు ఆట ముగిసే టైంకి న్యూజిలాండ్ 7వికెట్లు కోల్పోయి 224పరుగులు చేసింది. తద్వారా 238 పరుగుల ఆధిక్యంలో న్యూజిలాండ్ ఉంది.

300లోపు ఆధిక్యం ఉంటే..

ఇక చివరి రోజు ఆట రసవత్తరంగా ఉండనుంది. ఒకవేళ న్యూజిలాండ్ త్వరత్వరగా వికెట్లు కోల్పోయి 300లోపు ఆధిక్యం మాత్రమే ఇస్తే.. ఇంగ్లాండ్ గెలిచేందుకు వీలుంటుంది. అలాకాకుండా 300కు మించి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తే.. డ్రా అవడం ఖాయం. ఒకవేళ 250లోపే ఆధిక్యం ఉంటే.. ఇంగ్లాండ్ లేదా న్యూజిలాండ్‌లో ఏదో ఒక జట్టు గెలవడం దాదాపు ఖాయం. ఒకవేళ న్యూజిలాండ్ బౌలర్లు చెలరేగుతే ఇంగ్లాండ్ ఓడిపోవచ్చు.. ఇంగ్లాండ్ బ్యాటర్లు చెలరేగితే న్యూజిలాండ్ ఓడిపోవచ్చు. ఇక చివరి రోజు ఏదైనా జరగొచ్చు.

Story first published: Tuesday, June 14, 2022, 12:20 [IST]
Other articles published on Jun 14, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X