
న్యూజిలాండ్ పాజిటివ్స్
ఇకపోతే న్యూజిలాండ్ జట్టుకు అతి పెద్ద సానుకూలాంశం ఏంటంటే ఆ జట్టు బ్యాటర్ డారిల్ మిచెల్ అద్భుత ఫామ్‌లో ఉండడం. ఇప్పటికే ఈ సిరీస్లో అతను రెండు సెంచరీలతో చెలరేగాడు. మూడో టెస్ట్‌లోనూ తన ఢిఫెన్సివ్ ఆటతో బరిలోకి దిగాలని చూస్తున్నాడు. ట్రెంట్ బ్రిడ్జ్ టెస్టులో డబుల్ సెంచరీకి పది పరుగుల దూరంలో ఔటయ్యాడు. అలాగే వికెట్ కీపర్-బ్యాటర్ టామ్ బ్లండెల్, విల్ యంగ్, డెవాన్ కాన్వేలతో సహా మరికొందరు బ్యాటర్లు కూడా బ్యాట్‌తో కొన్ని కీలకమైన నాక్స్ ఆడారు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ తిరిగి జట్టులోకి చేరే అవకాశముంది. ఇటీవల న్యూజిలాండ్ ఆటగాళ్లు బ్రేస్ వెల్, డెవాన్ కాన్వే కరోనా బారిన పడి కోలుకున్నారు.

పిచ్ ఎలా ఉండబోతుందంటే..
హెడింగ్లీలో వికెట్ ఆరంభంలో పేసర్లకు ఉపయుక్తంగా ఉంటుందని తెలుస్తోంది. కొత్త బంతిని ఎదుర్కొనేటప్పుడు బ్యాటర్లు చాలా జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకోవచ్చు. ఆట సాగుతున్న కొద్దీ పిచ్ బ్యాటింగ్‌కు మెరుగ్గా మారొచ్చు.

అండర్సన్‌కు రెస్ట్, జేమీ ఓవర్‌టన్‌కు తొలి టెస్ట్
ఇక ఇంగ్లాండ్ స్టార్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ మూడో టెస్ట్ మ్యాచ్‌కు రెస్ట్ తీసుకోవడంతో అతని స్థానంలో దేశవాళీ క్రికెట్లో బాగా రాణించిన జేమీ ఓవర్‌టన్ అరంగేట్రం చేయనున్నాడు. ఇక ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం తన ప్లేయింగ్ 11ను ఇంగ్లాండ్ ప్రకటించింది. ఇక న్యూజిలాండ్ మాత్రం మ్యాచ్‌కు ముందు ప్రకటించనుంది. హెడ్ టు హెడ్ చూసుకుంటే ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 109 టెస్ట్‌లు జరగ్గా అందులో ఇంగ్లాండ్ 50 టెస్టులు గెలిచింది. న్యూజిలాండ్ 12 గెలిచింది. మిగతావి డ్రా అయ్యాయి. ఇక ఈ మ్యాచ్ రేపు ఇండియన్ టైం ప్రకారం.. మధ్యాహ్నం 3:30కు సోనీ సిక్స్ మరియు సోనీ లివ్ యాప్‌లో లైవ్ ప్రసారమవుతుంది.

జట్లు :
ఇంగ్లాండ్ ప్లేయింగ్ XI - అలెక్స్ లీస్, జాక్ క్రాలే, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), జామీ ఓవర్‌టన్, స్టువర్ట్ బ్రాడ్, మాట్ పాట్స్, జాక్ లీచ్.
న్యూజిలాండ్ ప్రాబబుల్ ప్లేయింగ్ XI - టామ్ లాథమ్, విల్ యంగ్, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), మైఖేల్ బ్రేస్‌వెల్, టిమ్ సౌతీ, మాట్ హెన్రీ, నీల్ వాగ్నర్, ట్రెంట్ బౌల్ట్