న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎక్కువ మాంసం తినండి: బంగ్లా క్రికెటర్లకు సఫారీ బ్యాట్స్‌మన్‌ సలహా!

‘Eat more meat’: South Africa batsman has interesting advice for Bangladesh cricketers

హైదరాబాద్: బంగ్లాదేశ్‌లో జరుగుతున్న బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌(బీపీఎల్‌)లో ఆ దేశ ఆటగాళ్లు ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో దక్షిణాఫ్రికా క్రికెటర్‌ కామెరూన్‌ డెల్‌పోర్ట్‌ ఓ ఆసక్తికరమైన సలహా ఇచ్చాడు. బంగ్లాదేశ్ క్రికెటర్లను ఎక్కువ మాంసం తినాల్సిందిగా సూచించాడు.

బంగ్లా క్రికెటర్లు భారీ షాట్లు ఆడలేకపోవడానికి తగినంత మాంసాహారాన్ని తీసుకోకపోవడమేనని అన్నాడు. దీంతో బంగ్లాదేశ్‌ క్రికెటర్లు ఎక్కువ మాంసాహారం తింటే హిట్టింగ్‌ చేయడంతో పాటు ఎక్కువ చెమటోడ్చేందుకు వీలు కలుగుతుందని కామెరూన్‌ డెల్‌పోర్ట్‌ చెప్పుకొచ్చాడు.

<strong>'ఉపఖండంలో ఆధిపత్యం ఎక్కువ.. సొంతగడ్డపై భారత్‌ను ఓడించే సత్తా మాకు ఉంది'</strong>'ఉపఖండంలో ఆధిపత్యం ఎక్కువ.. సొంతగడ్డపై భారత్‌ను ఓడించే సత్తా మాకు ఉంది'

ఎక్కువ మాంసాహారం తినండి

ఎక్కువ మాంసాహారం తినండి

బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌లో కామెరూన్‌ డెల్‌పోర్ట్‌ రంగ్‌పూర్‌ రేంజర్స్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. తాజాగా ఓ క్రికెట్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో కామెరూన్ డెల్‌పోర్ట్ మాట్లాడుతూ "ఎక్కువ మాంసాహారం తినండి(బౌండరీ లైన్‌ పైనుంచి బంతిని హిట్‌ చేయాలంటే)" అని అన్నాడు.

నేను ఫిట్‌గా ఉండటానికి కారణం

నేను ఫిట్‌గా ఉండటానికి కారణం

"నేను ఫిట్‌గా ఉండటమే కాకుండా బలంగా షాట్లు కొడుతున్నానంటే అందుకు మాంసాహారమే కారణం. క్రికెట్‌లో మరింత శ్రమించి ఫలితాలు రాబట్టాలంటే మీరు కష్టపడి పని చేయాలి ఆ తర్వాత ఫలితం అదే వస్తుంది. బంగ్లాదేశ్‌లో బంతి ఎక్కువ బౌన్స్‌ కాదు. తక్కువ ఎత్తులోనే వస్తుంది. అదే దక్షిణాఫ్రికాలో అయితే కచ్చితమైన బౌన్స్‌ ఉంటుంది" అని అన్నాడు.

నిజమైన బౌన్స్ కారణంగానే

నిజమైన బౌన్స్ కారణంగానే

"మా దక్షిణాఫ్రికా క్రికెటర్లు హిట్టర్లు కావడానికి మా ట్రూ బౌన్సే ఒక కారణం. నిజమైన బౌన్స్ కారణంగానే దక్షిణాఫ్రికాలో హిట్టర్లు ఉన్నారు. మరి బౌన్స్‌లేని బంగ్లాదేశ్‌లో భారీ హిట్లు చేయాలంటే కండరాలకు మరింత శక్తి కావాలి. అది మాంసాహారం వల్లే వస్తుంది. కాబట్టి, మాంసం ఎక్కువగా తినండి" అంటూ బంగ్లాదేశ్‌ క్రికెటర్లకు హితవు పలికాడు.

Story first published: Thursday, January 9, 2020, 16:55 [IST]
Other articles published on Jan 9, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X