షాక్: టెస్ట్ క్రికెట్‌కు జేపీ డుమిని గుడ్ బై, ఇంగ్లాండ్ టూర్ ఎఫెక్టే?

జోహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా క్రికెటర్‌ జీన్ పాల్(జేపీ) డుమిని టెస్టు, ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఇప్పటి వరకు 46 టెస్టులాడిన డుమిని 74 ఇన్నింగ్స్‌ల్లో 2,103 పరుగులు సాధించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌పై ఎక్కువ దృష్టి పెట్టేందుకే టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పినట్లు ఈ 33ఏళ్ల ఆటగాడు స్పష్టం చేశాడు.

ఇంగ్లాండ్ టూరే కారణం

ఇంగ్లాండ్ టూరే కారణం

కాగా, ఇటీవల ఇంగ్లాండ్‌-దక్షిణాఫ్రికా మధ్య ముగిసిన టెస్టు సిరీసే డుమిని వీడ్కోలుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ ఏడాది ఛాంపియన్స్‌ ట్రోఫీ అనంతరం ఇంగ్లాండ్‌-దక్షిణాఫ్రికా మధ్య 4 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ జరిగింది. తొలి టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ 211 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది.

ఘోరంగా విఫలం

ఘోరంగా విఫలం

ఈ మ్యాచ్‌ రెండు ఇన్నింగ్స్‌లో కలిపి డుమిని 17 పరుగులు మాత్రమే చేశాడు. దీని ఫలితంగా తదుపరి మ్యాచ్‌లకు దూరమయ్యాడు. దీంతో టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిందుకు ఇదే సరైన సమయమని డుమిని భావించినట్లు తెలుస్తోంది. శనివారం అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌తో పాటు ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పినట్లు ప్రకటించాడు.

సంతోషంగానే...

సంతోషంగానే...

టెస్టు క్రికెట్‌ని ఎంతో ఎంజాయ్‌ చేశానని, దేశం తరఫున ప్రాతినిధ్యం వహించడం ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా డుమిని తెలిపాడు. 2008లో ఆస్ట్రేలియాపై డుమిని టెస్టుల్లో అడుగుపెట్టాడు. టెస్టుల్లో అతని వ్యక్తిగత అత్యధిక స్కోరు 166 పరుగులను ఆసీస్‌పైనే సాధించాడు.

ఐపీఎల్ జట్లలో..

ఐపీఎల్ జట్లలో..

108 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లాడిన డుమిని 6,774 పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్‌లో డెక్కన్‌ ఛార్జర్స్‌, ముంబై ఇండియన్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం డుమిని ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ జట్టులో కొనసాగుతున్నాడు.

Story first published: Saturday, September 16, 2017, 16:52 [IST]
Other articles published on Sep 16, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి