న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Wasim Akram: ఆ భారత బౌలర్ బౌలింగ్ ఉత్తదే..! ఆస్ట్రేలియాలో మంచి పేస్ లేకుంటే ఈజీగా పరుగులొస్తాయి

Due to Lack Of Pace Bhuvneshwar Kumar isnt Worthy At Australia Conditions Says Wasim Akram

భారత పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు ఆస్ట్రేలియాలో స్ట్రగుల్స్ తప్పవని పాకిస్థాన్ దిగ్గజ మాజీ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ అభిప్రాయపడ్డాడు. టీమిండియా ఇప్పటికే ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా లేకుండానే బరిలోకి దిగబోతుంది. ఇప్పుడు ఆస్ట్రేలియా పరిస్థితులలో భువీ లీడ్ బౌలర్‌గా మారనున్నాడు. ఈ నేపథ్యంలో భువీ పేస్ పట్ల వసీం అక్రమ్ పలు సందేహాలు రేకెత్తించాడు. ఆసీస్‌లో టీ20 ప్రపంచ‌కప్‌ జరగనున్న నేపథ్యంలో టీమిండియాకు బౌలింగ్ లైనప్ విషయంలో ఇంకా పక్కా లైనప్ సెట్ కాలేదు. ఈ విషయంపై ఖలీజ్ టైమ్స్‌తో వసీం అక్రమ్ మాట్లాడుతూ.. నైపుణ్యాలు ఉన్నప్పటికీ భువనేశ్వర్ కుమార్ పేస్ లేకపోవడం వల్ల ఇబ్బంది పడవచ్చని అన్నాడు.

'టీమిండియాలో భువనేశ్వర్ కుమార్ ప్రధాన బౌలర్‌గా ఉన్నాడు. అతను కొత్త బంతితో చాలా బాగా ప్రదర్శన కనబర్చగలడు. కానీ అతని పేస్ మాత్రం అంత గొప్పగా ఏం లేదు. బంతి గనుక స్వింగ్ కాకపోతే.. అతని బౌలింగ్లో బ్యాటర్లు ఈజీగా పరుగులు రాబడతారు. కానీ అతను చాలా మంచి బౌలర్.. అందులో ఎలాంటి డౌటే లేదు. అతను రెండు వైపులా స్వింగ్ చేయగలడు. యార్కర్లు కూడా వేయగలడు. కానీ ఆస్ట్రేలియా పిచ్‌లలో పేస్ చాలా అవసరం' అని వసీం అక్రమ్ ఖలీజ్ టైమ్స్‌తో పేర్కొన్నాడు.

ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ జరగడం ఆ జట్టుకు చాలా లక్కీ. ఆస్ట్రేలియన్లు వాళ్ల పిచ్‌లలో అదరగొడతారు. వారికి మంచి బౌలింగ్ అటాక్ ఉంది, వారికి ఆ పిచ్‌లలో ఎలా ఆడాలో తెలుసు అని వసీం అక్రమ్ చెప్పాడు. భారత్ తమ టీ20 ప్రపంచ‌కప్ ప్రచారాన్ని పాకిస్తాన్‌తో అక్టోబర్ 23న ప్రారంభించనుంది. రోహిత్‌శర్మ నేతృత్వంలోని టీమిండియా ఆసియా కప్ 2022 టోర్నీలో ఫైనల్ చేరకుండానే ఇంటి బాట పట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా మెగా టోర్నీల్లో ఎలాంటి తప్పులు చేయకుండా అన్ని లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరముంది. అయితే ఇటీవల ఆసీస్, దక్షిణాఫ్రికాతో జరిగిన ద్వైపాక్షిక సిరీస్లలో విజయాలు సాధించిన టీమిండియా విజయోత్సాహంతో టీ20 ప్రపంచ‌కప్‌లోకి బరిలోకి దిగుతుంది. ఇక గాయం కారణంగా జట్టుకు దూరమైన బుమ్రా స్థానంలో ఇప్పటికీ ఎవరి పేరును ఖరారు చేయలేదు. మహమ్మద్ షమీ లేదా మహ్మద్ సిరాజ్‌లలో ఎవరో ఒకరు జట్టులోకి రావొచ్చు. ఇకపోతే భారత్‌కు మంచి బ్యాటింగ్ లైనప్ ఉందని, బౌలింగ్ పరంగానే కొంత ఇబ్బంది ఉందని, వారు ఇప్పటికీ బుమ్రా స్థానంలో ఎవరినీ తీసుకోలేదని అక్రమ్ అన్నాడు.

Story first published: Thursday, October 13, 2022, 9:21 [IST]
Other articles published on Oct 13, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X