న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ముంబై ఇండియన్స్ చెత్త రికార్డు, కెప్టెన్‌గా రోహిత్ జట్టుకు..?

DRS makes its mark in Indian Premier League

హైదరాబాద్: భారీ అంచనాలతో మొదలైన తొలి మ్యాచ్‌లో తడబడ్డాడు ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మన్. ఓపెనర్‌గా దిగిన ఎవిన్ లూయిస్ పరుగులేమీ చేయకుండానే రెండు బంతుల్లోనే అవుట్ అయి పెవిలియన్‌కు చేరాడు. దీంతో అతను ఈ సీజన్‌‌ను చెత్త రికార్డుతో మొదలుపెట్టాడు.

అసలెలా జరిగింది:

మొత్తం ఐపీఎల్ లీగ్‌లోనే లూయీస్‌ డకౌట్‌గా వెనుదిరిగి ఆ అపప్రథను రికార్డును సొంతం చేసుకున్న 58వ ఆటగాడిగా నిలిచాడు. శనివారం చెన్నైతో మ్యాచ్‌లో లూయిస్‌..చాహర్‌ బౌలింగ్‌లో పరుగులేమీ చేయకుండా ఎల్బీగా పెవిలియన్‌ చేరాడు.

2008 ఐపీఎల్‌లో బాలచంద్ర అఖిల్‌ అరంగేట్రం మ్యాచ్‌లో అవుటైన తొలి ఆటగాడు కాగా, 2017లో శామ్యూల్‌ బద్రి ఇదే తరహాలో పెవిలియన్‌ చేరిన 57వ ఆటగాడు. ముందు చెప్పినట్లుగా రోహిత్ శర్మ జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌లో ఏడో ఆటగాడిగా ఆడతానని చెప్పినా ఓపెనర్‌గానే దిగాల్సి వచ్చింది.

మరో ఓపెనర్‌గా దిగిన రోహిత్ అంతగా రాణించలేకపోయాడు. కేవలం 15 పరుగులు చేసి అవుటయ్యాడు. జట్టు స్కోరు 20 పరుగుల వద్ద ఉండగానే ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్‌.. వాట్సన్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి అంబటి రాయుడికి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

Story first published: Monday, April 9, 2018, 16:46 [IST]
Other articles published on Apr 9, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X