న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హాంకాంగ్ డ్రెస్సింగ్ రూంలో టీమిండియా.. ఏం జరిగింది?(వీడియో)

Asia Cup 2018 : Indian Players Visit Hong Kong Dressing Room
Dressing Room: Team India’s heartwarming gesture.

దుబాయ్: ఆసియా కప్‌లో భాగంగా జరిగిన భారత్ తొలి మ్యాచ్‌లో స్వల్ప ఆధిక్యంతో హాంకాంగ్‌పై గెలుపొందింది. ఐసీసీ టీం వన్డే ర్యాంకింగ్‌లో టాప్ పొజిషన్‌లో ఉన్న టీమిండియాను ఓడించడం మామూలు విషయం కాదు. అలాంటిది భారత్‌ను ఓడించేందుకు తీవ్రంగా శ్రమించింది హాంకాంగ్. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ నాలుగు పరుగుల దూరంలో ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయిన హాంకాంగ్ ఫలితాలను మార్చుకునేందుకు ప్రయత్నించింది.

ఈ మ్యాచ్ గెలవడం ద్వారా టోర్నీలో కొనసాగేందుకు మరో అవకాశం ఉంటుందని తలంచింది. ఈ క్రమంలో భారత్ మాత్రం సునాయాసంగా విజయాన్ని పొందేయొచ్చునుకుంది. ఇరు జట్ల తీవ్రమైన పట్టుదలతో పోరాడడంతో ఆసియా కప్‌లో భారత్ మొదటి మ్యాచ్‌యే ఉత్కంఠభరితంగా సాగింది. దాయాది జట్ల మధ్య బుధవారం జరగనుండటంతో అందరూ పాక్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్‌కు తీవ్రమైన పోటీ ఉంటుందని భావించారు.

కానీ, అగ్ర జట్టును కూడా ముప్పుతిప్పలు పెట్టించింది హాంకాంగ్. బహుశా ఈ విజయానికి ఇంప్రెస్ అయ్యాడో... ఏమో. టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ హాంకాంగ్ డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లి మరీ హాంకాంగ్ జట్టును కలుసుకున్నాడు. అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లందరికీ షేక్ హ్యాండ్ ఇస్తూ తమ అభినందనలు తెలిపాడు. టీమిండియా ఆటగాళ్లైన భువనేశ్వర్ కుమార్, రోహిత్ శర్మ, ఇంకొందరు కలిసి కాసేపు ముచ్చటించారు.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. శిఖర్‌ ధావన్‌ (120 బంతుల్లో 127; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) కెరీర్‌లో 14వ సెంచరీతో చెలరేగగా, అంబటి రాయుడు (70 బంతుల్లో 60; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీతో రాణించారు. అనంతరం 286 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హాంకాంగ్ 240/3తో దాదాపు ఛేదించేసేలా కనిపించింది. కానీ చివర్లో భారత బౌలర్లు పుంజుకుని ఆ జట్టుని 259/8కి పరిమితం చేయడంతో 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సెంచరీతో రాణించిన ధావన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.

Story first published: Wednesday, September 19, 2018, 16:05 [IST]
Other articles published on Sep 19, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X