న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తప్పులున్నాయి.. అంపైర్లకు జరిమానా విధించకండి: ధోనీ

Dont want to get fined: Dhoni takes roundabout dig at umpires

దుబాయి: కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా.. జట్టులో మహేంద్రసింగ్ ధోనీ అవసరం చాలానే కనిపిస్తూ ఉంటుంది. కెప్టెన్లు సైతం అతని నుంచి సలహాలు తీసుకునే కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అనూహ్య రీతిలో మరోసారి ధోనీ కెప్టెన్‌గా వ్యవహరించాల్సి వచ్చింది. కెప్టెన్‌గా ధోనీకి ఇది 200వ వన్డే అయిన ఈ మ్యాచ్‌ చివరికి టై అయింది. అయితే అంపైర్ల తప్పిదాల కారణంగా ఓ దశలో భారత్ ఓడిపోతుందేమోనన్న అనుమానాలు రేకెత్తాయి.

<strong>అఫ్గాన్‌పై గెలుపు దక్కకపోవడంతో కన్నీరుగార్చిన చిన్నారి</strong>అఫ్గాన్‌పై గెలుపు దక్కకపోవడంతో కన్నీరుగార్చిన చిన్నారి

అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌లో విజయం ఖాయం అనుకున్నా.. మ్యాచ్‌ అనూహ్యంగా టైగా ముగిసింది. రాయుడు, రాహుల్‌ మెరిసినా 253 పరుగుల ఛేదనలో భారత్‌ 49.5 ఓవర్లలో 252 పరుగులకే ఆలౌటైంది. మొదట బ్యాటింగ్‌ చేసిన అఫ్గాన్‌ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లకు 252 పరుగులు చేసింది. ఆల్ రౌండర్ జడేజా ఇన్నింగ్స్‌ను విజయం అంచులదాకా తీసుకెళ్లాడు. మరో బంతి ఉండగానే జడేజా క్యాచ్ ఇచ్చి ఔట్ కావడంతో అఫ్గాన్ సంబరాలు చేసుకుంది.

బంతి ప్యాడ్లకు తగిలినా.. ధోనీ అవుట్

బంతి ప్యాడ్లకు తగిలినా.. ధోనీ అవుట్

ఓపెనర్లు ఔటైన తర్వాత దినేశ్ కార్తీక్‌తో కలిసి ధోనీ ఇన్నింగ్స్ నిర్మిస్తున్న క్రమంలో అంపైర్ తప్పిదానికి ఔటయ్యాడు. అఫ్గాన్ బౌలర్ జావెద్ అహ్మదీ వేసిన ఇన్నింగ్స్ 26వ ఓవర్ 5వ బంతిని ధోనీ డిఫెన్స్ ఆడగా బంతి ప్యాడ్లకు తాకింది. బౌలర్ అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ గ్రెగరీ బ్రాత్‌వైట్ (వెస్టిండీస్) ఏమాత్రం ఆలోచించకుండా ఔటిచ్చారు. బంతి స్టంప్స్‌ను తాకలేదని రీప్లేలో స్పష్టంగా కనిపించింది.

మరోసారి దినేశ్ కార్తీక్‌ను ఇలానే

మరోసారి దినేశ్ కార్తీక్‌ను ఇలానే

నబీ వేసిన ఇన్నింగ్స్ 40 ఓవర్ నాలుగో బంతిని దినేష్ కార్తీక్ (44) ఆడేందుకు చూడగా బంతి ప్యాడ్లను తాకింది. నబీ అప్పీల్ చేయగానే అంపైర్ అనిసర్ రహమాన్ (బంగ్లాదేశ్) ఔట్‌గా ప్రకటించాడు. కేఎల్ రాహుల్ ఔట్ విషయంలో భారత్ రివ్యూను కోల్పోవడంతో ధోనీకిగానీ, కార్తీక్‌కుగానీ రివ్యూకు వెళ్లే అవకాశం లేక పెవిలియన్ బాట పట్టారు.

బ్యాట్ ఇరుక్కోవడంతో కుల్దీప్, కేదార్ జాదవ్ ఔట్

బ్యాట్ ఇరుక్కోవడంతో కుల్దీప్, కేదార్ జాదవ్ ఔట్

మరోవైపు ఫీల్డ్ సహకరించని కారణంగా క్రీజుకు వెలుపల బ్యాట్ ఇరుక్కుపోవడంతో కుల్దీప్, కేదార్ జాదవ్ ఔట్ కావడం భారత అభిమానులను నిరాశకు గురిచేసింది. ఒకవేళ అఫ్గాన్ చేతిలో భారత్ ఓటమిపాలై ఉంటే మాత్రం ఫీల్డ్ అంపైర్లు గ్రెగరీ బ్రాత్‌వైట్, అనిసర్ రెహమాన్‌లు టీమిండియా ఫ్యాన్స్ ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వచ్చేది. అయితే అంపైర్లు తప్పిదాలు చేశారనీ, అయితే వారికి ఎలాంటి జరిమానా లాంటివి విధించకూడదని ధోనీ కోరుకున్నాడు.

అంపైర్లకు జరిమానా వద్దని కోరుకుంటున్నా.

అంపైర్లకు జరిమానా వద్దని కోరుకుంటున్నా.

మ్యాచ్ ముగిసిన అనంతరం కెప్టెన్ ధోనీ మీడియాతో మాట్లాడుతూ.. 'మ్యాచ్‌లో మా తప్పిదాలు కూడా ఉన్నాయి. కొందరు ఆటగాళ్లు రనౌట్ అయ్యారు. కేవలం అంపైర్లనే తప్పుపట్టడం సమంజసం కాదు. వారి వల్లే జట్టుకు కఠిన పరిస్థితులు ఎదురు కాలేదు. కనుక అంపైర్లకు ఎలాంటి జరిమానా విధించవద్దని కోరుకుంటున్నా. మేం చాలా మంది ఆటగాళ్లకు ఈ మ్యాచ్‌లో విశ్రాంతి ఇచ్చాం. మ్యాచ్ టైగా ముగిసింది తప్ప.. మాకు చెడు జరగలేదు. పరిస్థితులు మరింత ప్రతికూలంగా మారితే మ్యాచ్ కోల్పోయేవాళ్లం. అఫ్గాన్ అన్ని విభాగాల్లో సమష్టిగా రాణించింది. వారి పోరాటం అమోఘమంటూ' కొనియాడాడు.

Story first published: Wednesday, September 26, 2018, 16:49 [IST]
Other articles published on Sep 26, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X