న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దిగ్గజ క్రికెటర్‌ను అవమానపరుస్తారా.. బీసీసీఐపై గవాస్కర్‌ ఫైర్!!

Don’t insult the great man: Gavaskar slams BCCI for insensitive comment over Syed Mushtaq Ali Trophy

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)ను మరో సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలా మార్చలేమన్న భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) అధికారి వ్యాఖ్యలపై భారత దిగ్గజం సునీల్ గవాస్కర్‌ మండిపడ్డారు.ఐపీఎల్‌ ట్రోఫీ పేరుతో దిగ్గజ క్రికెటర్‌ను అవమానపరుస్తారా అని ఫైర్ అయ్యారు. మొదట షెడ్యూల్‌ ప్రకారం ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్‌-13ను జరుపుదామని బీసీసీఐ ప్రయత్నించినా.. విదేశీ ఆటగాళ్లుంటేనే బాగుంటుందనే ఆలోచనతో ఏప్రిల్ 15 వరకు లీగ్‌ వాయిదా పడిన విషయం తెలిసిందే.

కరోనా వైరస్‌పై పోరాటం టెస్టు క్రికెట్‌ లాంటిదే: సచిన్కరోనా వైరస్‌పై పోరాటం టెస్టు క్రికెట్‌ లాంటిదే: సచిన్

ఆ అధికారి వ్యాఖ్యలు బాధాకరం:

ఆ అధికారి వ్యాఖ్యలు బాధాకరం:

ఐపీఎల్‌ వాయిదా పడిన సందర్భంగా ఓ ఉన్నతాధికారి దేశవాళీ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీ ప్రస్తావన తెచ్చారు. ఐపీఎల్‌ను తక్కువ నాణ్యత కలిగిన టోర్నీగా ప్రదర్శించలేమన్నారు. దీనిపై గవాస్కర్ స్పందించారు. 'ఐపీఎల్‌ను తక్కువ నాణ్యత కలిగిన టోర్నీగా ప్రదర్శించలేమని చెబుతూ, మరో ముస్తాక్‌ అలీ టోర్నీ అవసరం లేదన్న ఆ అధికారి వ్యాఖ్యలు బాధాకరం. ఎందుకంటే.. వారు ఓ దిగ్గజాన్ని అవమానపరిచారు. ఆ తర్వాత దాన్ని పేలవ టోర్నీగా పేర్కొన్నారు. మరి సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీని ఎందుకు నిర్వహిస్తున్నారు' అని ప్రశ్నించారు.

గ్రేట్‌ మ్యాన్‌ను అగౌరవపరిచారు:

గ్రేట్‌ మ్యాన్‌ను అగౌరవపరిచారు:

'ముస్తాక్‌ అలీ టోర్నీ పేరు చెప్పి ఓ గ్రేట్‌ మ్యాన్‌ను అగౌరవపరిచారు. ఆ తర్వాత పేలవమైన టోర్నమెంట్‌ అనే అర్థం వచ్చేలా మాట్లాడారు. ఆ టోర్నీ ఎందుకు పేలవంగా మారింది. ఆ టోర్నీలో అంతర్జాతీయ ఆటగాళ్లు ఉండరు అనే విషయం తెలుసు కదా. అది దేశవాళీ టోర్నీ. అంతర్జాతీయి స్థాయిలో ఆడే భారత ఆటగాళ్లు లేకపోవడం వల్లే అది పేలవంగా మారింది. బీసీసీఐ బిజీ షెడ్యూల్‌ కారణంగా ముస్తాక్‌ అలీ టోర్నీకి ఆదరణ తగ్గింది. దీనిపై బీసీసీఐ దృష్టి సారించాలి. ఆ టోర్నీని మెరుగుపరిచే అంశంపై ఫోకస్‌ చేయాలి' అని గావస్కర్‌ సూచించారు. .

ఇప్పుడు చాలా కష్టం:

ఇప్పుడు చాలా కష్టం:

సునీల్‌ గవాస్కర్‌ తాజాగా వార్తా దినపత్రిక డైనిక్ జాగ్రాన్‌తో మాట్లాడుతూ... 'వ్యక్తిగతంగా టీ20 ప్రపంచకప్‌‌ జట్టులో ఎంఎస్ ధోనీ ఉండాలని కోరుకుంటున్నా. కానీ అదే జరిగే అవకాశం లేదు. జట్టులోకి ధోనీ ఎంపిక ఇప్పుడు చాలా కష్టంగా మారింది. ఇప్పటికే ధోనీని పక్కనపెట్టి టీమిండియా చాలా ముందుకు వెళ్లిపోయింది. ఇక ధోనీ తన వీడ్కోలుని ఘనంగా ఆశించకపోవచ్చు. ఎలాంటి హడావుడి లేకుండా క్రికెట్‌ నుంచి తప్పుకునే అవకాశం ఉంది' అని గవాస్కర్ అన్నారు.

Story first published: Saturday, March 21, 2020, 13:49 [IST]
Other articles published on Mar 21, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X