న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎవరూ సంబరాలు చేసుకోవద్దు.. ప్రపంచకప్‌కు ఇంకా సమయం ఉంది: రోహిత్

Dont Go Out On Streets, World Cup Is Still Some Time Away: Rohit Sharma Urges People To Stay Indoors


ముంబై:
ప్ర‌పంచ‌వ్యాప్తంగా మహమ్మారి క‌రోనా వైర‌స్ పంజా విజృంభిస్తున్న సంగ‌తి తెలిసిందే. భారత్‌లోనూ కరోనా వేగంగా విస్త‌రిస్తోంది. ఈ నేపథ్యంలో భార‌త ప్ర‌భుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్ర‌కటించించింది. గ‌త‌నెలలోనే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ క‌రోనా వైర‌స్‌పై పోరాటం చేసే వారికి సంఘీభావం ప్ర‌క‌టించాల‌ని కోరారు. తాజాగా ఆదివారం రాత్రి 9 గంటల నుంచి తొమ్మిది నిమిషాల‌ పాటు లైట్ల‌ను ఆపివేసి, కొవ్వ‌త్తులు, దీపాల‌తో వెలుగు పంచాల‌ని కోరిన సంగ‌తి తెలిసిందే. మోదీ పిలుపు మేరకు క్రీడాకారులు దీపాలతో మద్దతు తెలిపారు.

2011 ప్రపంచకప్‌ ఫైనల్లో ధోనీని ముందు వెళ్లమని సూచించా: సచిన్2011 ప్రపంచకప్‌ ఫైనల్లో ధోనీని ముందు వెళ్లమని సూచించా: సచిన్

ఇదొక టెస్టు మ్యాచ్‌:

ఇదొక టెస్టు మ్యాచ్‌:

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి మద్దతిస్తూ ఆదివారం టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఒక ట్వీట్‌ చేశాడు. 'దేశంలోని ప్రజలు అంతా కూడా ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపులో భాగంగా దీప ప్రజ్వలనకు మద్దతుగా నిలబడాలి. ఇదొక టెస్టు మ్యాచ్‌. ఈ టెస్టు మ్యాచ్‌ను గెలవడంపై మన జీవితాలు ఆధారపడి ఉన్నాయి. మీ సంఘీ భావాన్ని ఘనంగా చాటండి' అని రోహిత్ ట్వీట్ చేసాడు. ఆదివారం రాత్రి 9 గంటలకు కుటుంబంతో క‌లిసి దీపాల‌ను వెలిగిస్తున్న ఫొటోల‌ను రోహిత్ అభిమానులతో పంచుకున్నాడు.

ప్రపంచకప్‌కు ఇంకా సమయం ఉంది:

ప్రపంచకప్‌కు ఇంకా సమయం ఉంది:

అనంతరం రోహిత్ శర్మ మరొక ట్వీట్‌ చేస్తూ.. ఎవరూ బయటకు వెళ్లి సంబరాలు చేసుకోవద్దన్నాడు. 'మీరు భారత్‌లోని ఇళ్లల్లోనే ఉండండి. ఎవరూ కూడా బయటకు వెళ్లి సంబరాలు చేసుకోవద్దు. ప్రపంచకప్‌కు ఇంకా సమయం ఉంది' అని సరదాగా పేర్కొన్నాడు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలందరూ ఇళ్లలోనే ఉండి ఆరోగ్యంగా ఉండాలని సూచించాడు. తాజాగా ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో రోహిత్ పాల్గొన్న విషయం తెలిసిందే.

ప్రతిరోజు దీపాన్ని వెలిగిస్తున్నా:

ప్రతిరోజు దీపాన్ని వెలిగిస్తున్నా:

జ్యోతి ప్రజ్వలన చేయాలన్న ప్రధాని పిలుపును​ కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీసమేతంగా పాటించాడు. కోహ్లీ, అనుష్క శర్మ ఇంట్లో దీపాలు వెలిగించి మహమ్మారిపై పోరాటానికి సంఘీభావం తెలిపారు. 'నేను చాలా ఏళ్ల నుంచి ప్రతిరోజు దీపాన్ని వెలిగిస్తున్నా. నాలోని చీకటిని పారద్రోలి దిశానిర్దేశం చేయమని అడుగుతున్నా. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ప్రపంచంలో బాధలు పడుతున్న వారందరి కోసం దేవుడిని ప్రార్థించా. వారి కష్టాలను తొలగించాలని కోరుకున్నా' అని కోహ్లీ ట్వీట్ చేసాడు.

దేశంతో మొత్తంతో కలిసి దీపాన్ని వెలిగించా:

దేశంతో మొత్తంతో కలిసి దీపాన్ని వెలిగించా:

'కుటుంబ సభ్యులు పక్కన లేకుండానే ఎంతో ప్రాణాలను కోల్పోతున్నారు. కనీస అవసరాలు తీర్చుకోలేక ఎంతో మంది దీనస్థితిలో ఉన్నారు. వారి కోసం నేను ప్రార్థిస్తున్నా. అలాగే ప్రజల ప్రాణాలను కాపాడేందుకు వైద్య సిబ్బంది ఎంతో ధైర్యంగా, నిరంతరాయంగా పని చేస్తున్నారు. కొందరి భవిష్యత్తు, ఉద్యోగాలు అయోమయస్థితిలో పడ్డాయి. అందుకే ఈ రోజు రాత్రి అందరి కోసం మరింత ఎక్కువగా దేవుడిని ప్రార్థించా. భారత దేశంతో మొత్తంతో కలిసి దీపాన్ని వెలిగించా. ఒకరి కోసం ఒకరం ప్రార్థించుకున్నాం. ఈ ప్రార్థనలు వృథా కావు' అని కోహ్లీ భావోద్వేగ ట్వీట్ చేసాడు.

Story first published: Monday, April 6, 2020, 11:22 [IST]
Other articles published on Apr 6, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X