న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Do not follow first half of my innings: యువ ఆటగాళ్లకు విరాట్ కోహ్లీ హితవు

Do not follow first half of my innings: Kohlis advice to youngsters after Hyderabad epic

హైదరాబాద్: తన ఇన్నింగ్స్‌లో తొలి అర్ధభాగాన్ని యువ ఆటగాళ్లు అనుసరించవద్దని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. హైదరాబాద్ వేదికగా శుక్రవారం వెస్టిండిస్‌తో జరిగిన తొలి టీ20లో విరాట్ కోహ్లీ 6 సిక్సులు, 6 ఫోర్ల సాయంతో అజేయంగా 94 పరుగులతో నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ "మ్యాచ్‌ చూసే యువ బ్యాట్స్‌మెన్‌కు నా ఇన్నింగ్స్ తొలి అర్ధభాగాన్ని అనుసరించొద్దు. ఎందుకంటే నేను ఆ సమయంలో చాలా నిదానంగా ఆడాను. భారీ షాట్లు ఆడటానికి ప్రయత్నించినప్పటికీ అది సాధ్యపడలేదు. కేఎల్‌ రాహుల్‌పై ఒత్తిడి తీసుకురావద్దని అలా ఆడా" అని చెప్పాడు.

టీ20ల్లో 1000 పరుగులు: ఫించ్ రికార్డుని సమం చేసిన కేఎల్ రాహుల్టీ20ల్లో 1000 పరుగులు: ఫించ్ రికార్డుని సమం చేసిన కేఎల్ రాహుల్

"అదృష్టవశాత్తూ జాసన్ హోల్డర్ వేసిన ఓవర్‌తో పరిస్థితి తారుమారైంది. ఆపై నేను ఎందుకు తప్పు చేస్తున్నానో విశ్లేషించడం ప్రారంభించాను. దీంతో తొలి అర్ధభాగంలో ఎలా ఆడానో అర్థమైంది. టైమర్‌ను గ్రహించి ఆ తర్వాత నాట ఆట శైలిని మార్చాను" అని విరాట్ కోహ్లీ వెల్లడించాడు.

బంతిని గాల్లోకి పంపి

బంతిని గాల్లోకి పంపి

"టీ20ల్లో బంతిని గాల్లోకి పంపి అభిమానులను అలరించే రకం నాది కాదు. స్లామ్ బ్యాంగ్ క్రికెట్ ఆడటం లక్ష్యం కాదు. ఈ జట్టులో రోహిత్ లేదా నేను ఎవరో ఒకరు ఆడాలి. నేను ఆడే ప్రతి జట్టులో నా పాత్ర ఉండాలని కోరుకుంటా. టీ20ల కోసం నా ఆటను ఎక్కువగా మార్చడం నాకు ఇష్టం లేదు. నేను ఆల్ ఫార్మాట్ ప్లేయర్" అని కోహ్లీ చెప్పాడు.

ప్రతి ఆటలోనూ

ప్రతి ఆటలోనూ

"నేను ప్రతి ఆటలోనూ పరుగులు చేయాలని అనుకుంటాను. పని పూర్తిచేయడంపైనే నా దృష్టి ఉంటుంది. భారీ లక్ష్యాలను చేధిస్తున్నప్పుడు ఆందోళన ఉంటుంది. స్కోరుబోర్డు వలె. కానీ 4-5 డాట్ బంతుల తర్వాత ఆట మిమ్మల్ని మీ జోన్‌లోనే ఉంచుతుంది. ఎందుకంటే మీకు వేరే మార్గం ఉండదు కాబట్టి" అని కోహ్లీ అన్నాడు.

వెస్టిండీస్‌ పర్యటనలో

వెస్టిండీస్‌ పర్యటనలో

"వెస్టిండీస్‌ పర్యటనలో విలియమ్స్‌ నన్ను ఔట్‌ చేసినప్పుడు బుక్ తీసినట్లు చూపిస్తూ టిక్‌ కొట్టి కవ్వించాడు. అది దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఇలా చేశాను. మ్యాచ్‌ మధ్యలో కవ్వించుకుంటాం. అంతిమంగా నవ్వుతూ పలకరించుకుంటాం. షేక్‌ హ్యాండ్స్‌, హైఫై చేసుకుంటాం. క్రికెట్‌లోని గొప్పదనం ఇదే. కసిగా ఆడాలి, అలాగే ప్రత్యర్థులను గౌరవించాలి" అని కోహ్లీ చెప్పాడు.

6 వికెట్ల తేడాతో

6 వికెట్ల తేడాతో

తొలి టీ20లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్‌ చేసిన విండిస్ ఐదు వికెట్లకు 207 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 18.4 ఓవర్లలో మరో ఎనిమిది బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా మూడు వన్డేల సిరీస్‌లో భారత్‌ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో టీ20 ఆదివారం తిరువనంతపురంలో జరగనుంది.

Story first published: Saturday, December 7, 2019, 16:53 [IST]
Other articles published on Dec 7, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X