న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వీడియో వైరల్: ఫీల్డర్‌ని మార్చమన్న కుల్దీప్‌కు ధోని కౌంటర్

ASIA CUP 2018 : Mahendra Sing Dhoni Trolls Kuldeep Yadav
Dhoni Had a Thug Life Moment When He Schooled Kuldeep Yadav Over Field Change

హైదరాబాద్: ధోని కెప్టెన్సీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ బౌలర్‌కు ఎలా ఫీల్డింగ్ సెట్ చేయాలో అందరికీ తెలుసు. అలాంటి ధోనికే ఫీల్డర్‌ను మార్చాల్సిందిగా సలహా ఇచ్చాడు చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. దీనిపై ధోని కాస్తంత ఘాటుగానే స్పందించాడు.

ఆసియా కప్: భారత్ Vs ఆప్ఘనిస్థాన్ మ్యాచ్‌పై బెస్ట్ మీమ్స్ ఇవే!ఆసియా కప్: భారత్ Vs ఆప్ఘనిస్థాన్ మ్యాచ్‌పై బెస్ట్ మీమ్స్ ఇవే!

అంతేకాదు "బౌలింగ్ చేస్తావా.. లేక బౌలర్‌నే మార్చమంటావా?" అంటూ కుల్దీప్‌‌పై గట్టిగా అరిచాడు. ఆసియా కప్ టోర్నీలో భాగంగా సూపర్-4లో మంగళవారం ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఫీల్డర్‌ను మార్చాల్సిందిగా కుల్దీప్ పదే పదే అడుగుతుండటం.. అందుకు ధోని ఇచ్చిన సమాధానం స్టంప్ మైక్రోఫోన్‌లో నమోదైంది.

సోషల్ మీడియాలో వీడియో వైరల్

ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. మైదానంలో ధోని ఎంతో కూల్‌గా కనిపించే ధోని.. ఆటగాళ్ల విషయంలో మాత్రం కాస్త కఠినంగానే ఉంటాడు. ఒక్కసారి ఫీల్డింగ్ సెట్ చేశాక ఏ బౌలర్ ఏం చెప్పినా ధోని వినడు. గతంలో ఒసారి శ్రీశాంత్‌కు ధోని ఇలాగే వార్నింగ్ ఇచ్చాడు.

టైగా ముగిసిన మ్యాచ్

ఓయ్ శ్రీ అక్కడ నీ గర్ల్‌ఫ్రెండ్ లేదు.. కొంచెం ఇక్కడికి రా.. అంటూ ధోని అనడం అప్పట్లో అభిమానులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఆసియా కప్‌లో ఈమ్యాచ్‌ సంచలన రీతిలో ముగిసింది. ఈ మ్యాచ్‌లో అఫ్ఘానిస్థాన్‌ అద్భుతంగా పోరాడి భారత్‌తో మ్యాచ్‌ను టైగా ముగించింది.

చివర్లో వరుసగా వికెట్లను కోల్పోయి భారత్‌

చివర్లో వరుసగా వికెట్లను కోల్పోయి భారత్‌

కేఎల్ రాహుల్‌ (60), అంబటి రాయుడు (57) మెరుపు హాఫ్ సెంచరీలో రాణించినా చివర్లో వరుసగా వికెట్లను కోల్పోయి భారత్‌ తడబడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆప్ఘనిస్థాన్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 252 పరుగులు చేసింది. ఓపెనర్ షెహజాద్‌ (116 బంతుల్లో 124) సెంచరీతో మెరవగా, మహ్మద్‌ నబీ (64) హాఫ్ సెంచరీతో రాణించాడు.

షెహజాద్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు

షెహజాద్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు

భారత బౌలర్లలో రవీంద్ర జడేజాకు మూడు, కుల్దీప్ యాదవ్‌ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం 253 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. దీంతో మ్యాచ్ టైగా ముగిసింది. వన్డేల్లో భారత్‌పై సెంచరీ చేసిన షెహజాద్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది.

Story first published: Wednesday, September 26, 2018, 13:56 [IST]
Other articles published on Sep 26, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X