న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఢిల్లీకి మరో దెబ్బ: ఈ సీజన్ మొత్తానికి హర్షల్‌ పటేల్‌ దూరం

Delhi Capitals Harshal Patel Ruled Out For Rest Of IPL Season

హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే ఆ జట్టు యువ బ్యాట్స్‌మన్ మన్‌జ్యోత్ కార్లా ఫిట్‌నెస్ పరంగా ఆటకు దూరం కాగా... తాజాగా ఆ జట్టు మీడియం పేసర్ హర్షల్‌ పటేల్‌ కూడా ఈ సీజన్‌కు దూరమయ్యాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

కుడిచేయి విరగడంతో హర్షల్ పటేల్ ఈ సీజన్‌లో మిగితా మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని ఆ జట్టు హెడ్ కోచ్‌ రికీ పాంటింగ్‌ చెప్పాడు. టోర్నీలో భాగంగా శుక్రవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో రికీ పాంటింగ్ మీడియాతో మాట్లాడాడు.

"కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో మ్యాచ్‌ సందర్భంగా హర్షల్‌ పటేల్‌ కుడి చేయికి గాయమైంది. ఎక్స్‌రేలో అతని చేయి విరిగినట్లు వైద్యులు చెప్పారు. అతను కోలుకోవడానికి మూడు, నాలుగు వారాలు పడుతుంది. అతని స్థానంలో ఎవరిని భర్తీ చేయాలో ఆలోచిస్తున్నాం" అని పాంటింగ్ చెప్పాడు.

ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో రెండు మ్యాచ్‌లాడిన హర్షల్‌ పటేల్ రెండు వికెట్లు తీసి 40 పరుగులు చేశాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన సూపర్‌ ఓవర్లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచిన మ్యాచ్‌లోనూ హర్షల్ పటేల్ ఆడాడు.

మరోవైపు ఈ సీజన్‌లో ఢిల్లీ తరుపున ఒక్క మ్యాచ్ కూడా ఆడని కార్లా శుక్రవారం పూర్తిస్థాయి ఫిట్‌నెస్ టెస్ట్‌కు హాజరుకానున్నట్లు తెలిపాడు. శుక్రవారం కోల్‌కతాతో మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో మన్‌జ్యోత్ కార్లా నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాడు. ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి.

ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లాడిన ఢిల్లీ క్యాపిటల్స్ మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన మూడ మ్యాచ్‌ల్లో ఓడింది. 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది.

Story first published: Friday, April 12, 2019, 17:22 [IST]
Other articles published on Apr 12, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X