న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నిన్న బంగ్లా... నేడు విదర్భ: 3 రోజుల వ్యవధిలో దీపక్ చాహర్ రెండో హ్యాట్రిక్

Deepak Chahar Bags 2nd Hat-trick In 3 Days || Oneindia Telugu
Deepak Chahar Gets 2nd Hat-trick in 3 Days; This One Against Vidarbha For Rajasthan in Syed Mushtaq Ali Trophy

హైదరాబాద్: మూడో రోజుల వ్యవధిలోనే టీమిండియా పేసర్ దీపక్ చాహర్ రెండో హ్యాట్రిక్‌ను సాధించాడు. నాగ్‌పూర్ వేదికగా గత ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20లో దీపక్ చాహర్ హ్యాట్రిక్ సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా, మంగళవారం ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో భాగంగా విదర్భతో జరిగిన మ్యాచ్‌లో దీపక్ చాహర్ హ్యాట్రిక్ సాధించాడు.

ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో భాగంగా మంగళవారం త్రివేండ్రం వేదికగా విధర్భ-రాజస్థాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో విదర్భ ఇన్నింగ్స్‌లో 12వ ఓవర్ వేసిన దీపక్ చాహర్ దర్శన్ నల్కండే, శ్రీకాంత్ వాగ్(13), అక్షయ్ వాడ్కర్‌లను వరుస బంతుల్లో పెవిలియన్‌కు చేర్చడం ద్వారా ఈ ఘనత సాధించాడు.

India vs Bangladesh: 3వ టీ20లో చెత్త రికార్డు నమోదు చేసిన రోహిత్ శర్మIndia vs Bangladesh: 3వ టీ20లో చెత్త రికార్డు నమోదు చేసిన రోహిత్ శర్మ

చివరి మూడు బంతుల్లో హ్యాట్రిక్

చివరి మూడు బంతుల్లో హ్యాట్రిక్

దర్శన్ నల్కండే, అక్షయ్ వాడ్కర్‌లు డకౌట్‌గా వెనుదిరిగారు. ఈ మ్యాచ్‌లో దీపక్ చాహర్(4/18)తో చెలరేగడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ జట్టు నిర్ణీత 13 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది. కాగా, నాగ్‌పూర్ వేదికగా ముగిసిన మూడో టీ20లో దీపక్‌ చాహర్‌ తన కోటా (3.2) పూర్తికాకముందే 6 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

నాగ్‌పూర్ టీ20లో ఇలా

నాగ్‌పూర్ టీ20లో ఇలా

తొలి ఓవర్లో 2 వికెట్లు తీసి కేవలం 1 పరుగు మాత్రమే ఇచ్చిన దీపక్‌.. తర్వాత ఓవర్లో వికెట్‌ తీయడంతో పాటు 4 పరుగులు ఇచ్చాడు. 18వ ఓవర్‌ చివరి బంతికి షఫీయుల్‌ వికెట్‌ను దీపక్ తీసాడు. ఇక 20వ ఓవర్‌ తొలి రెండు బంతులకు ముస్తఫిజుర్, అమీనుల్‌లను అవుట్‌ చేసి 'హ్యాట్రిక్‌'తో పాటు ప్రపంచ రికార్డును నమోదు చేసిన సంగతి తెలిసిందే.

టీ20ల్లో 'హ్యాట్రిక్‌' తీసిన తొలి బౌలర్‌గా

టీ20ల్లో 'హ్యాట్రిక్‌' తీసిన తొలి బౌలర్‌గా

భారత్‌ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో 'హ్యాట్రిక్‌' తీసిన తొలి బౌలర్‌గా దీపక్‌ చహర్‌ రికార్డుల్లోకి ఎక్కాడు. అయితే మొత్తంగా ఈ ఘనత సాధించిన 11వ బౌలర్‌ దీపక్‌. మలింగ (శ్రీలంక) రెండుసార్లు 'హ్యాట్రిక్‌' తీయగా.. బ్రెట్‌ లీ (ఆస్ట్రేలియా), ఓరమ్, సౌతీ (న్యూజిలాండ్‌), తిసారా పెరీరా (శ్రీలంక), అష్రఫ్‌ (పాకిస్తాన్‌), రషీద్‌ ఖాన్‌ (అఫ్గానిస్తాన్‌), హస్నయిన్‌ (పాకిస్తాన్‌), ఖవర్‌ అలీ (ఒమన్‌), వనువా (పపువా న్యూగినియా) తలొసారి హ్యాట్రిక్‌ తీశారు.

Story first published: Tuesday, November 12, 2019, 17:00 [IST]
Other articles published on Nov 12, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X