న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

DC vs KXIP match 2: సూపర్ ఓవర్‌కు దారితీసిన మ్యాచ్.. రఫ్ఫాడించిన రబడా.. ఢిల్లీ అద్భుత విజయం!

DC vs KXIP match 2: Delhi Capitals beat Kings XI Punjab in Super Over

దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఆద్యాంతం ఉత్కంఠగా సాగింది. విజయం ఇరు జట్లను దోబుచులాడి ఉక్కిరి బిక్కిరి చేసింది. సూపర్ ఓవర్‌కు దారితీసిన ఈ మ్యాచ్‌లో కగిసో రబడా రఫ్ఫాడించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయాన్నందుకుంది. సూపర్ ఓవర్‌లో పంజాబ్ రెండు పరుగులే చేసి రెండు వికెట్లు కోల్పోయింది. సూపర్ ఓవర్ నిబంధనల ప్రకారం రెండు వికెట్లు కోల్పోతే ఆలౌటైనట్టే. తొలి బంతికి రాహుల్ రెండు పరుగులు తీసి ఆ మరుసటి బంతికి క్యాచ్ ఔటయ్యాడు. ఆ వెంటనే నికోలస్ పూరన్ క్లీన్ బౌల్డ్ కావడంతో పంజాబ్ సూపర్ ఓవర్ ఇన్నింగ్స్ ముగిసింది.

అనంతరం మూడు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్.. రెండు బంతుల్లోనే ముగించింది. అయితే రిషభ్ పంత్ తొలి బంతి వదిలేసి టెన్షన్ పెట్టాడు. ఇక రెండో బంతిని షమీ వైడ్ వేయగా.. మూడో బంతిని ఫైన్ లెగ్ మీదుగా ఆడిన పంత్.. రెండు పరుగులు తీయడంతో ఢిల్లీ విజయం లాంఛనమైంది. ఐపీఎల్ చరిత్రలోనే లోయెస్ట్ సూపర్ ఓవర్ స్కోర్ చేసిన జట్టుగా పంజాబ్ అప్రతిష్టను మూటగట్టుకుంది.

అంతకుముందు ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులు చేసింది. స్టోయినిస్( 21 బంతుల్లో 7ఫోర్లు, 3 సిక్స్‌లతో 53 ) సూపర్ ఫిఫ్టీతో మెరుపులు మెరిపించాడు. అనంతరం లక్ష్య చేధనకు దిగిన కింగ్స్ పంజాబ్.. మయాంక్ అగర్వాల్(60 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 89) వీరోచిత ఇన్నింగ్స్‌తో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 157రన్స్ చేయడంతో మ్యాచ్ టై అయి సూపర్ ఓవర్‌కు దారి తీసింది.

దెబ్బ తీసిన అశ్విన్..

దెబ్బ తీసిన అశ్విన్..

అంతకు ముందు 157 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన కింగ్స్ పంజాబ్‌ కేఎల్ రాహుల్ సూపర్ బ్యాటింగ్‌తో ధాటిగానే ప్రారంభించింది. 2 ఫోర్లు, 1 సిక్స్‌తో క్రీజులో కుదురుకున్న రాహుల్‌ను మోహిత్ శర్మ అద్భుత ఇన్‌స్వింగర్‌తో క్లీన్ బౌల్డ్ చేసి ఢిల్లీకి శుభారంభాన్నిచ్చాడు. ఆ మరుసటి ఓవర్‌ వేసిన రవిచంద్రన్ అశ్విన్.. కరన్ నాయర్(1), నికోలస్ పూరన్‌(0)ను పెవిలియన్ చేర్చి కోలుకోలేని దెబ్బతీశాడు. కరన్ క్యాచ్ ఔట్‌ కాగా పూరన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక అశ్విన్ స్పిన్‌కు పూరన్ బిత్తరపోయాడు. అయితే ఈ ఓవర్ చివరి బంతికి తీవ్రంగా గాయపడ్డ అశ్విన్ మైదానాన్ని వీడాడు.

5 పరుగులు..4 వికెట్లు..

5 పరుగులు..4 వికెట్లు..

ఆ వెంటనే ఎన్నో అంచనాలు పెట్టుకున్న విధ్వంసకర వీరుడు గ్లేన్ మ్యాక్స్‌వెల్(1) కూడా నిరాశపరిచాడు. రబడా బౌలింగ్‌లో అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో పంజాబ్ 35 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 5 పరుగుల వ్యవధిలోనే ఆ జట్టు నాలుగు వికెట్లు కోల్పోవడం గమనార్హం. ఈ స్థితిలో క్రీజులోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్(12)తో మయాంక్ అగర్వాల్ నిదానంగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ అక్షర్ పటేల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన సర్ఫరాజ్ లాంగాన్‌లో పృథ్వీషాకు చిక్కి భారంగా పెవిలియన్ చేరాడు.

మయాంక్ ఒంటరి పోరాటం..

మయాంక్ ఒంటరి పోరాటం..

ఇక ఓ వైపు వికెట్లు పడుతున్నా మరోవైపు మయాంక్ అగర్వాల్ ఒంటరి పోరాటం చేశాడు. స్టోయినిస్ బౌలింగ్‌లో మిడ్ వికెట్ దిశగా భారీ సిక్సర్ కొట్టిన మయాంక్... నోర్జ్ బౌలింగ్‌లో మరో రెండు బౌండరీలు తరలించి బ్యాటింగ్ వేగం పెంచాడు. ఈ క్రమంలోనే 45 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం మరింత ధాటిగా ఆడిన మయాంక్ జట్టును విజయం దిశగా నడిపించాడు.

 స్టోయినిస్ సూపర్ బౌలింగ్..

స్టోయినిస్ సూపర్ బౌలింగ్..

ఆఖరి ఓవర్‌లో పంజాబ్ విజయానికి 6 బంతుల్లో 13 పరుగులు కావాల్సి ఉండగా స్టోయినిస్ వేసిన తొలి బంతిని సిక్స్ కొట్టిన మయాంక్.. అనంతరం డబుల్ తీసి మరుసటి బంతిని బౌండరీకి తరలించాడు. దీంతో స్కోర్‌లు సమం అయ్యాయి. అయితే ఈ పరిస్థితుల్లో పంజాబ్‌ విజయం ఖాయమనిపించింది. కానీ నాలుగో బంతిని డాట్ చేసిన మయాంక్.. ఐదో బంతికి భారీ షాట్ ఆడబోయి ఔటయ్యాడు. ఇక ఆఖరి బంతికి జోర్డాన్ ఔటవ్వడంతో మ్యాచ్ టై అయింది. అనూహ్య మలుపులు తిరిగిన ఈ మ్యాచ్ అభిమానులను ఊపిరి పీల్చుకోకుండా ఉక్కిరిబిక్కిరి చేేసింది. అసలు సిసలు మజాను అందించింది.

Story first published: Monday, September 21, 2020, 7:49 [IST]
Other articles published on Sep 21, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X