న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

DC vs KKR: చెలరేగిన కుల్దీప్.. చేతులెత్తేసిన కేకేఆర్! ఢిల్లీ ఘన విజయం

 DC vs KKR: Kuldeep Yadavs four-for blows away Kolkata Knight Riders; Delhi Capitals win by 44 runs

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మరో అద్భుత విజయాన్నందుకుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించి 44 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 215 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్(45 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 61), పృథ్వీ షా(29 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 51) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా.. రిషభ్ పంత్(14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 27), అక్షర్ పటేల్(14 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 22 నాటౌట్), శార్దూల్ ఠాకూర్(11 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 29 నాటౌట్) మెరుపులు మెరిపించారు. కేకేఆర్ బౌలర్లలో నరైన్ 2 వికెట్లు తీయగా.. ఉమేశ్ యాదవ్, రస్సెల్, వరుణ్ తలో వికెట్ పడగొట్టారు.

అనంతరం కేకేఆర్ 19.4 ఓవర్లలో 171 పరుగులకు కుప్పకూలింది. శ్రేయస్ అయ్యర్(33 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 54), నితీశ్ రాణా(20 బంతుల్లో 3 సిక్స్‌లతో 30) రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లతో చెలరేగగా..శార్దూల్ ఠాకూర్ రెండు, ఖలీల్ అహ్మద్ మూడు వికెట్లు తీశారు. లలిత్ యాదవ్‌కు ఓ వికెట్ దక్కింది.

 ఓపెనర్లు విఫలం..

ఓపెనర్లు విఫలం..

216 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఓపెనర్లు శుభారంభం అందించలేదు. ఖలీల్ అహ్మద్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లోనే వెంకటేశ్ అయ్యర్(8 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 18) క్యాచ్ ఔటవ్వగా.. ఆ కొద్ది సేపటికే అజింక్యా రహానే(8) కూడా వెనుదిరిగాడు. 38 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, నితీశ్ రాణా ఆదుకున్నారు. ఢిల్లీ బౌలర్లపై భారీ బౌండరీలతో విరుచుకుపడ్డారు. దాంతో కేకేఆర్ 10 ఓవర్లలోనే 91 పరుగులు చేసింది.

 శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీ..

శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీ..

లలిత్ యాదవ్ వేసిన 12 వ ఓవర్‌లో భారీ సిక్సర్ బాదిన రాణా(30) అదే జోరు‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. కుల్దీప్ వేసిన 13వ ఓవర్‌లో భారీ సిక్సర్ కొట్టి అయ్యర్.. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ ఆ మరుసటి బంతికే కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన సామ్ బిల్లింగ్స్ సిక్స్, ఫోర్‌తో జోరు కనబర్చగా.. అతన్ని ఖలీల్ ఔట్ చేశాడు. గత మ్యాచ్‌లో సంచలన బ్యాటింగ్‌తో చెలరేగిన ప్యాట్ కమిన్స్(4).. కుల్దీప్ యాదవ్ సూపర్ బాల్‌కు ఎల్బీగా వెనుదిరిగాడు.

తిప్పేసిన కుల్దీప్..

తిప్పేసిన కుల్దీప్..

అదే ఓవర్‌లో నరైన్(4), ఉమేశ్ యాదవ్(0) కూడా ఔటవ్వడంతో కేకేఆర్ పీకల్లోతు కష్టాల్లో పడింది. 18వ ఓవర్‌లో డేంజరస్ రస్సెల్ ఇచ్చిన క్యాచ్‌ను పంత్ నేలపాలు చేయగా.. అతను బౌండరీలతో భయపెట్టాడు. కానీ చేయాల్సి పరుగులు ఎక్కువ ఉండటంతో ఢిల్లీ విజయం లాంఛనమైంది. చివరి ఓవర్‌లో కేకేఆర్ విజయానికి 50 పరుగులు అవసరమవ్వగా.. ఠాకూర్ రస్సెల్‌ను ఔట్ చేయడంతో పాటు మరో వికెట్ తీసి విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.

Story first published: Sunday, April 10, 2022, 19:53 [IST]
Other articles published on Apr 10, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X