న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్‌లో వార్నర్ 37వ హాఫ్ సెంచరీ: రోహిత్ శర్మ రికార్డు బద్దలు

రోహిత్ శర్మ రికార్డు బద్దలు IPLలో వార్నర్ 37వ హాఫ్ సెంచరీ
David Warner’s 37th IPL half-century: Twitter reactions on Warner’s comeback vs KKR

హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మాజీ సారథి, ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ రీఎంట్రీ అదిరింది. టోర్నీలో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో డేవిడ్‌ వార్నర్‌ 53 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 85 పరుగులతో రాణించడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 182 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఇది వార‍్నర్‌కు ఐపీఎల్‌లో 37వ హాఫ్‌ సెంచరీ. దీంతో ఐపీఎల్‌ అత్యధిక హాఫ్‌ సెంచరీలు సాధించిన క్రికెటర్‌గా వార‍్నర్‌ చరిత్ర సృష్టించాడు. అంతేకాదు కోల్‌కతాపై అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో డేవిడ్ వార‍్నర్‌ అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో రోహిత్‌ శర్మ (757) అత్యధిక పరుగుల రికార్డుని బద్దలు కొట్టాడు.

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన సన్‌రైజర్స్‌కు ఓపెనర్లు శుబారంభాన్ని అందించారు. తొలుత నెమ్మదిగా ఆడిన వార్నర్‌.. ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ క్రమంలో ఈ సీజన్‌లో తొలి హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ఆ తర్వాత భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో రస్సెల్‌ బౌలింగ్‌లో వార్నర్‌(85) ఔటయ్యాడు.

ఐపీఎల్‌లో 40వ హాఫ్ సెంచరీ

ఐపీఎల్‌లో 40వ హాఫ్ సెంచరీ

ఏడాది తర్వాత ఐపీఎల్‌లోకి పునరాగమనం చేసిన వార్నర్ తొలి వికెట్‌కి జానీ బెయిర్‌స్టో (39: 35 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్)తో కలిసి 118 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విజయ్ శంకర్ (40 నాటౌట్: 24 బంతుల్లో 2 పోర్లు, 2 సిక్సులు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.

భువనేశ్వర్‌కు పగ్గాలు

భువనేశ్వర్‌కు పగ్గాలు

మరోవైపు సన్‌రైజర్స్ హిట్టర్ యూసఫ్ పఠాన్ (1: 4 బంతుల్లో) నిరాశపరచగా.. మనీశ్ పాండే (8 నాటౌట్) చివర్లో ఫరవాలేదనిపించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టన్ దినేశ్ కార్తీక్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బంగ్లాదేశ్‌తో ఇటీవల టెస్టు మ్యాచ్‌లో గాయపడిన కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ ఫిట్‌నెస్‌ సాధించకపోవడంతో అతడి స్థానంలో భువనేశ్వర్‌కు పగ్గాలు అప్పజెప్పారు.

Story first published: Sunday, March 24, 2019, 19:02 [IST]
Other articles published on Mar 24, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X