న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అల్లరి కూతుళ్ల ఫోటోను షేర్‌ చేసిన వార్నర్.. ఎలా ఉన్నారో చూడండి!!

David Warner posts raiding picture of her daughters

సిడ్నీ: కరోనా వైరస్ మహమ్మారి లాక్​డౌన్ కాలంలో తన డ్యాన్స్​లు, సరదా వీడియోలతో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్, సన్​రైజర్స్ హైదరాబాద్​ కెప్టె​న్ డేవిడ్ వార్నర్ సోషల్ మీడియా స్టార్ అయ్యాడు. తెలుగు, తమిళ్, హిందీ పాటలకు భార్య, కూతుళ్లతో కలిసి డ్యాన్స్​లు చేసి భారత అభిమానులను ఆకట్టుకున్నాడు. టిక్‌టాక్‌లో సతీమణి క్యాండిస్‌ వార్నర్‌తో కలిసి బుట్టబొమ్మ, రాములో రాములా, బ్యాంగ్‌బ్యాంగ్‌ వంటి పాటలకు వార్నర్ స్టెప్పులేశాడు. ఇప్పుడు భారత్‌లో టిక్‌టాక్‌ను నిషేధించారు. అయినప్పటికీ.. వార్నర్‌ ఇతర సోషల్‌మీడియా వేదికల ద్వారా అభిమానులకు టచ్‌లోనే ఉంటున్నాడు.

డేవిడ్ వార్నర్ తాజాగా తన కుమార్తెలు ఇండి రే, ఇవీ మేలు చేసిన అల్లరి ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు. ఈ ఫోటోలో ఆయన కూతుళ్లిద్దరూ పెద్దవాళ్ల డ్రస్సులు, కాప్స్ పెట్టుకుని ఉన్నారు. అవి వార్నర్, క్యాండిస్‌లకు సంబందించినవి. ఒకరు టీ షర్ట్ వేసుకోగా.. మరొకరు షర్ట్ ధరించారు. ఈ ఫొటోకు వార్నర్ ఓ కాప్షన్ కూడా రాసుకొచ్చాడు. 'ఒక రోజు మీ పిల్లల్ని ఇంట్లో ఒంటరిగా వదిలేయండి. అప్పుడు మీ ఇంట్లోని వార్డ్రోబ్ ఎలా చేస్తారో చూడండి' అని రాసుకొచ్చాడు. ఈ ఫోటోకు ఆయన అభిమానులు చాలా మంది కామెంట్‌ చేస్తున్నారు.

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. దాంతో మరికొన్ని రోజుల వరకు అక్కడ క్రికెట్‌ మొదలయ్యే సూచనలు కనిపించడం లేదు. ఇక ఆస్ట్రేలియాలో ఈ ఏడాది జరగాల్సిన టీ20 ప్రపంచకప్ వాయిదా పడింది. ఇక దుబాయ్‌లో జరిగే ఐపీఎల్‌ 2020లో డేవిడ్‌ వార్నర్‌ ఆడనున్నాడు. దాని కంటే ముందు టీ20, మూడు వన్డే సిరీస్‌ల కోసం ఇంగ్లండ్ వెళ్లనున్నాడు. అక్కడినుండి నేరుగా యూఏఈ చేరుకుంటాడు.

డేవిడ్ వార్నర్ నేతృత్వంలోని సన్​రైజర్స్ హైదరాబాద్ 2016 ఐపీఎల్ టైటిల్​ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే 2018లో బాల్​ ట్యాంపరింగ్ వివాదంతో నిషేధానికి గురయ్యాక.. వార్నర్​ సన్​రైజర్స్ కెప్టెన్సీ కూడా కోల్పోయాడు. దీంతో న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమ్సన్ జట్టును నడిపించాడు. గతేడాది మళ్లీ వార్నర్ ఐపీఎల్​లో పునరాగమనం చేసి 697 పరుగులతో అదరగొట్టాడు. అయితే ఈ ఏడాది సీజన్ కోసం సన్​రైజర్స్ హైదరాబాద్​ యాజమాన్యం వార్నర్​ను మరోసారి కెప్టెన్​గా నియమించింది. సన్​రైజర్స్​ జట్టుకు మళ్లీ సారథిగా ఎంపికవడాన్ని గౌరవంగా భావిస్తున్నానని, కెప్టెన్సీని తిరిగి పొందాననుకోవట్లేదని ​వార్నర్ అన్నాడు. ఈ సీజన్​లో జట్టుకు మరో టైటిల్​ను అందించడమే లక్ష్యంగా ముందుకుసాగుతామన్నాడు.

'లక్ష్మణ్, ద్రవిడ్‌‌ కలిసి.. 4వేల ఓవర్లు వేసిన నన్నే బిత్తరపోయాలా చేశారు''లక్ష్మణ్, ద్రవిడ్‌‌ కలిసి.. 4వేల ఓవర్లు వేసిన నన్నే బిత్తరపోయాలా చేశారు'

Story first published: Monday, August 24, 2020, 20:55 [IST]
Other articles published on Aug 24, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X