క్రికెట్‌కు శాశ్వతంగా దూరం: క్షమించమంటూ వార్నర్ కన్నీటి పర్యంతం (వీడియో)

Posted By:
క్రికెట్‌కు వార్నర్ శాశ్వతంగా దూరం
David Warner apologises for role in cricket ball-tampering scandal

హైదరాబాద్: భవిష్యత్తులో ఆస్ట్రేలియా తరుపున క్రికెట్ ఆడబోనని బాల్ టాంపరింగ్ వివాదంలో ప్రధాన సూత్రధారి అయిన డేవిడ్ వార్నర్ వెల్లడించాడు. శనివారం మీడియా ముందుకు వచ్చిన డేవిడ్ వార్నర్ కళ్లలో పశ్చాత్తాపం.. తప్పు చేశాననే బాధ.. దానిని ఎన్నటికీ దిద్దుకోలేననే మానసిక క్షోభ.. అన్నీ కలసి డేవిడ్‌ వార్నర్‌ను శాశ్వతంగా క్రికెట్‌ నుంచి తప్పుకునేలా చేశాయి.

సిడ్నీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డేవిడ్ వార్నర్ మాట్లాడుతూ 'క్రికెట్‌ను అమితంగా ప్రేమించే అభిమానులకు క్షమాపణలు తెలియజేస్తున్నా. క్రికెటర్‌గా నన్ను ఎంతగానో ప్రోత్సహించి నాకు మద్దతుగా నిలిచిన మీ అందరి నమ్మకాన్ని వమ్ము చేశాను. నన్ను క్షమించండి' అని అన్నాడు.

'మీరు తలదించుకునేలా ప్రవర్తించాను. నాకు కాస్త సమయం కావాలి. చేసిన తప్పుని సరిదిద్దుకునేందుకు, మీ నమ్మకాన్ని తిరిగి సంపాదించేందుకు. తమ నిర్ణయం పట్ల ప్రజాగ్రహం ఇంతగా ఉంటుందని అనుకోలేదు' అంటూ ఉబికి వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ క్రికెట్‌ ఆస్ట్రేలియాకు తన రాజీనామా లేఖను పంపినట్లు వార్నర్ చెప్పాడు.

'మేము దేశం తలదించుకునేలా ప్రవర్తించాం. మేము తప్పుడు నిర్ణయం తీసుకున్నాం. అందులో నా పాత్ర కూడా ఉంది. మళ్లీ ఆస్ట్రేలియా ప్రజల మనసు చూరగొనేందుకు ఎంతో సమయం పడుతుంది. తర్వాత ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. ప్రస్తుతానికి నా కుటుంబానికి తోడుగా ఉంటా' అని పేర్కొన్నాడు.

'ఈరోజు నేను ఇక్కడ ఎందుకు ఉన్నానంటే... కేప్ టౌన్‌లో ఏ తప్పు అయితే జరిగిందో దానిని అంగీకరించేదుకే. అది క్షమించారని తప్పు. నేను మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నా. ఆస్ట్రేలియా పబ్లిక్ గౌరవాన్ని తిరిగి పొందేందుకు ఏం చేయడానికి నేను సిద్ధమే' అని వార్నర్ కన్నీటి పర్యంతమయ్యాడు.

బాల్ టాంపరింగ్ వివాదం అనంతరం స్టీవ్‌స్మిత్‌తో ఏమైనా విబేధాలు వచ్చాయా? అన్న ప్రశ్నకు గాను 'మేమిద్దం సహచరులం. ఇద్దరం కలిసే పెరిగాం. ఎన్నో ఏళ్లగా క్రికెట్ ఆడుతున్నాం. ఏడాది పాటు నిషేధంతో క్రికెట్ దూరమవ్వడం అనేది ఎంతో బాధను కలిగిస్తోంది. నాతో పాటు స్టీవ్ స్మిత్, కామెరూన్‌కు కూడా' అని వార్నర్ భావోద్వేగానికి గురయ్యాడు.

'క్రికెట్ నుంచి రిటైర్ కానని, కానీ మళ్లీ ఆస్ట్రేలియా ప్రజల విశ్వాసాలను గెలుచుకునేందుకు ప్రయత్నిస్తా. తన మైండ్‌లో ఓ చిన్న ఆశ ఉందని, దేశానికి మళ్లీ ఆడే అవకాశం వస్తుందని ఆశిస్తున్నానని, కానీ అలాంటి పరిస్థితి రాదన్న వాస్తవం తనకు తెలుసు' అని భావోద్వేంగా వార్నర్ తెలిపాడు.

రిటైర్మెంట్ గురించి జర్నలిస్టులు ప్రశ్నలు అడగ్గా.. దానికి బదులు ఇచ్చేందుకు వార్నర్ నిరాకరించాడు. భవిష్యత్తు ప్రణాళికలు ఇప్పుడే చెప్పలేనని అన్నాడు. అయితే, కుటుంబంతో చర్చించిన అనంతరం క్రికెట్‌ నుంచి శాశ్వతంగా తప్పుకోవాలనే అంశంపై కూడా నిర్ణయం తీసుకుంటానని వార్నర్ ఈ సందర్భంగా వెల్లడించాడు. అంతేకాదు తన ప్రవర్తన సరిగా లేదని దీనిపై నిపుణుల సాయం కూడా తీసుకుంటానని వార్నర్ అన్నాడు.

త్వరలో కుటుంబంతో చర్చించిన అనంతరం క్రికెట్‌ నుంచి శాశ్వతంగా తప్పుకోవాలనే అంశంపై కూడా నిర్ణయం తీసుకుంటానని వార్నర్ ఈ సందర్భంగా వెల్లడించాడు. అంతేకాదు తన ప్రవర్తన సరిగా లేదని దీనిపై నిపుణుల సాయం కూడా తీసుకుంటానని వార్నర్ అన్నాడు.

కేప్ టౌన్ వేదికగా జరిగిన మూడో టెస్టులో బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన స్మిత్, వార్నర్, బాన్‌క్రాప్ట్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా కఠిన చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. స్మిత్, వార్నర్‌పై ఏడాది పాటు నిషేధం విధించగా... బాన్‌క్రాప్ట్‌పై 9 నెలల పాటు నిషేధం విధించింది. దీంతో పాటు వంద గంటల పాటు స్వచ్ఛంద సేవ చేయాలని సూచించింది.

ఈ వివాదానికి సూత్రధారి అయిన డేవిడ్‌ వార్నర్‌ ఎన్నటికీ ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్‌ కాలేడని సీఏ స్పష్టం చేసింది. అయితే, కెప్టెన్సీ విషయంలో స్మిత్‌, బాన్‌క్రాఫ్ట్‌కు ఒకింత ఊరటనిచ్చింది. ఆస్ట్రేలియా కెప్టెన్సీని చేపట్టకుండా స్మిత్‌పై రెండేళ్ల నిషేధం విధించింది. ఈ రెండేళ్ల కాలంలో దేశీయ, అంతర్జాతీయ మ్యాచుల్లో వీరు కెప్టెన్సీ చేపట్టరాదని పేర్కొంది.

అయితే, ఆ తర్వాత క్రికెట్‌ అభిమానుల నుంచి, అధికారుల నుంచి అనుమతి, ఆమోదం ఉంటే జట్టు కెప్టెన్సీ పగ్గాలు చేపట్టవచ్చునని పేర్కొంది. క్రికెట్‌తో సంబంధాలు పూర్తిగా తెగిపోకుండా వీరు క్లబ్‌ క్రికెట్‌ ఆడుకునేందుకు అనుమతించింది. మరోవైపు బాల్ టాంపరింగ్ వివాదంలో హెడ్ కోచ్ డారెన్ లీమన్ పాత్ర లేదని క్రికెట్ ఆస్ట్రేలియా క్లీన్‌చిట్ ఇచ్చినప్పటికీ, కోచ్ పదవికి డారెన్ లీమన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Saturday, March 31, 2018, 9:22 [IST]
Other articles published on Mar 31, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి