న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆగమాగం ఆడిస్తే ఇలాగే అయితది.. బుమ్రా ఇంజూరీ విషయమై బీసీసీఐని, వైద్యబృందాన్ని ఏకిపారేసిన డానిష్ కనేరియా

Danish Kanerial Slams BCCI and Team Medical Staff for Inproper Management Of Bumrah Back Injury

ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో గాయం నుంచి కోలుకుని జస్ప్రీత్ బుమ్రా పునరాగమనం చేసిన సంగతి తెలిసిందే. అయితే భారత వైద్య బృందం, మేనేజ్‌మెంట్ హడావిడిగా అతన్ని ఆసీస్‌తో సిరీస్లో ఆడించిందని, బుమ్రా విషయంలో ఆగమాగం చేయడం సరికాదని పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా విమర్శించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టీ20కి ముందు గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్‌లో బుమ్రా బ్యాక్ స్ట్రెస్ ఫ్రాక్చర్‌కు గురయ్యాడు.

ఇకపోతే ఈ నొప్పి గురించి అతను ఫిర్యాదు చేయగా.. వైద్య బృందం పరిశీలించి బుమ్రా పూర్తిగా కోలుకోవడానికి నాలుగు నుంచి ఆరు నెలల టైం అవసరమని వెల్లడించింది. దీంతో టీ20 ప్రపంచకప్ ముందు భారత జట్టుకు పెద్ద దెబ్బ తగిలింది. ఇప్పటికే గాయం కారణంగా రవీంద్ర జడేజా జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. బుమ్రా లేకపోవడం బౌలింగ్ అటాక్‌లో పెద్ద లోటు తెచ్చిపెట్టొచ్చు. ఈ విషయమై కనేరియా మాట్లాడుతూ.. ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఈవెంట్ వరకు బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డాడు.

అతను హర్షల్ పటేల్ లాంటి బౌలర్ కాదు

అతను హర్షల్ పటేల్ లాంటి బౌలర్ కాదు

జస్ప్రీత్ బుమ్రా.. హర్షల్ పటేల్ లాంటి బౌలర్ కాదని కనేరియా పేర్కొన్నాడు. బుమ్రా తన రిథమ్ కనుగొనడానికి పెద్దగా టైం తీసుకోవాల్సిన అవసరం లేదని కూడా కనేరియా పేర్కొన్నాడు. టీ20 ప్రపంచ‌కప్‌కు నేరుగా వచ్చి ఉంటే సరిపోయేదన్నాడు. ఎందుకంటే అతని అనుభవం వల్ల రిథమ్ అందుకోవడానికి పెద్ద టైం పట్టదని కనేరియా అన్నాడు. ఐపీఎల్‌లో బుమ్రా గాయాలతో ఎలాగోలా నెట్టుకొచ్చాడు. అది ఇప్పుడు ఎఫెక్ట్ చూపిస్తుందన్నట్లు కనేరియా పేర్కొన్నాడు.

వర్క్‌లోడ్ విషయంలో బీసీసీఐ విధానమిదేనా?

వర్క్‌లోడ్ విషయంలో బీసీసీఐ విధానమిదేనా?

బుమ్రా వర్క్ లోడ్ విషయంలో బీసీసీఐ వ్యవహరిస్తున్న విధానాన్ని పూర్తిగా ఎండగట్టాడు. బుమ్రా మళ్లీ గాయపడే విషయంలో వైద్యబృందం పాత్రను కూడా ప్రశ్నించాడు. పూర్తిగా కోలుకోకుండానే బుమ్రాను తిరిగి జట్టులోకి ఎలా రానిచ్చారో అంటూ ఆశ్చర్యపోయాడు. '2022 టీ20ప్రపంచకప్‌ టైంకు అతను నేరుగా జట్టులోకి వచ్చి ఉంటే బాగుండేది. అతను తిరిగి లయలోకి రావడానికి ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడేవాడు. అతను హర్షల్ పటేల్ లేదా మరే ఇతర బౌలర్ లాంటివాడు కాదు. తిరిగి గాడిలో పడడానికి టైం తీసుకోవడానికి' అని కనేరియా తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నాడు.

వెన్నెముక ఫ్రాక్చర్‌కు సర్జరీ..

వెన్నెముక ఫ్రాక్చర్‌కు సర్జరీ..

బుమ్రా వెన్నెముక ఫ్రాక్చర్‌కు సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. సర్జరీ చేయించుకుంటే మాత్రం బెడ్ రెస్ట్ తప్పక అవసరమౌతుంది. కనీసం ఆరు నెలల పాటు అతను క్రికెట్‌కు దూరం కావాల్సిన పరిస్థితి రావొచ్చు. ఈ ఆరు నెలల వ్యవధిలో జరిగే ఏ సిరీస్‌కు కూడా ఈ స్టార్ పేస్ బౌలర్ అందుబాటులో ఉండే అవకాశాలు ఎంత మాత్రం లేవు. స్వదేశంలో జరిగే ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్‌కు కూడా అతను అందుబాటులో ఉండటం అనుమానమే.

Story first published: Friday, September 30, 2022, 16:28 [IST]
Other articles published on Sep 30, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X