న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Danish Kaneria: బాబర్ ఆజామ్‌కు ఇదే లాస్ట్ ఛాన్స్.. లేకపోతే కెప్టెన్సీ హుష్‌కాకి

Danish Kaneria Feels that T20 World cup is the Last Chance for Babar Azam to Retain His captaincy

ఆస్ట్రేలియాలో జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టు రాణించలేకపోతే బాబర్ ఆజామ్ తన కెప్టెన్సీని కోల్పోవచ్చని పాకిస్థాన్ మాజీ లెగ్ స్పిన్నర్ డానిష్ కనేరియా అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇటీవల ముగిసిన ఆసియా కప్‌ టోర్నీలో ఆజామ్ 6మ్యాచుల్లో కేవలం 68పరుగులు మాత్రమే చేశాడు. బ్యాటింగ్లో ధాటిగా ఆడలేకపోయాడు. అతను కాస్త ఫామ్‌ కోల్పోయినట్లు కన్పించాడు. ఈ టోర్నీలో పాకిస్థాన్ ఫైనల్‌లో శ్రీలంక చేతిలో ఓటమి పాలు కావడంతో ఆజామ్ వ్యక్తిగత ప్రదర్శనతో పాటు కెప్టెన్సీ పట్ల తీవ్ర విమర్శలు వచ్చాయి.

ఈ క్రమంలో బాబర్ తన కెప్టెన్సీని కొనసాగించాలంటే టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ తప్పకుండా మెరుగైన ప్రదర్శన కనబరిచేలా చూడాలని కనేరియా సూచించాడు.
'బాబర్ ఆజామ్ ఫామ్‌లో లేడు. అతని కెప్టెన్సీపై కూడా చాలా సందేహాలు ఉన్నాయి. టీ20 ప్రపంచకప్ అతనికి చివరి అవకాశమని నేను భావిస్తున్నాను. అతను విపరీతమైన ఒత్తిడిలోకి నెట్టివేయబడతాడు. ఎందుకంటే పాక్ జట్టు బాగా రాణించకపోతే.. తప్పకుండా అది కెప్టెన్సీ మార్పుకు దారి తీస్తుంది' అని కనేరియా తన యూట్యూబ్ ఛానెల్‌లో ప్రస్తావించాడు.

సరైన ప్లేయర్లతో బరిలోకి దిగాలి

సరైన ప్లేయర్లతో బరిలోకి దిగాలి

రాబోయే టి20 ప్రపంచ‌కప్‌కు తుది జట్టు ఎంపికలో ఆజామ్‌కు పెద్దపాత్ర ఉందని.. అతను సరైన ప్లేయర్ల కూర్పుతో బరిలోకి దిగాల్సిన అవసరం ఉందని కనేరియా చెప్పాడు. 'బాబర్ నిస్సందేహంగా గొప్ప ప్లేయరే. కాకపోతే అతను జట్టు ఎంపిక విషయంలో సరిగ్గా వ్యవహరించడం లేదనిపిస్తుంది. అతను సరైన తుది జట్టుకు మద్దతు ఇస్తున్నట్లు నేను భావించడం లేదు' అని కనేరియా తెలిపాడు. ఆసియా కప్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఆజామ్ పేలవ ప్రదర్శన వల్ల అతని పట్ల విమర్శలు తీవ్రమయ్యాయి. అతను 107.93 స్ట్రైక్ రేట్‌తో 6మ్యాచ్‌ల్లో కేవలం 68పరుగులు మాత్రమే చేయడం ఆందోళన రేకెత్తించింది.

ఆందోళనకరంగా వారిద్దరి స్టైక్‌రేట్‌లు

ఆందోళనకరంగా వారిద్దరి స్టైక్‌రేట్‌లు

'జట్టులో ఓపెనర్లుగా బరిలోకి దిగుతున్న మహమ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజామ్‌ల స్ట్రైక్‌రేట్‌ తీవ్రంగా ఆందోళన కలిగిస్తోంది. వారు పవర్ ప్లేలో ఫీల్డ్ పరిమితులను ప్రారంభంలో ఉపయోగించుకోలేకపోతున్నారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగే బ్యాటర్లకు సరైన స్టాండ్ ఏర్పాటు చేయడంలో విఫలమవుతున్నారు.' అని కనేరియా చెప్పాడు. ఆజామ్‌ బ్యాటింగ్ ఆర్డర్లో ఓపెనర్‌గా కాకుండా డౌన్ ఆర్డర్లోకి వెళితే బాగుంటుందని, పాకిస్థాన్‌ జట్టు తరఫున మరొకరు ఇన్నింగ్స్‌ తెరిచేలా ప్లాన్స్ వేయాలని కనేరియా పిలుపునిచ్చారు.

ఓపెనర్‌గా బాబర్‌తో కాకపోతే..

ఓపెనర్‌గా బాబర్‌తో కాకపోతే..

'అతను ఓపెనర్‌గా స్కోర్ చేయలేకపోతే.. అతని స్థానంలో మరొక ఆటగాడిని ఆడిస్తే బాగుంటుందని అతను అర్థం చేసుకోవాలి. అతను తనను తాను నం.3స్థానానికి పరిమితం చేసుకోగలడు. ఇంగ్లాండ్‌‌తో జరగబోయే సిరీస్లో ఇలాంటి ప్రయోగం చేయొచ్చు. ' అని కనేరియా తెలిపారు. టీ20 ప్రపంచకప్‌కు వెళ్లే క్రమంలో పాకిస్థాన్, ఇంగ్లాండ్ ఏడు టీ20ల్లో తలపడనున్నాయి. కరాచీలోని నేషనల్ స్టేడియం వేదికగా సెప్టెంబర్ 20న ఈ సిరీస్ ప్రారంభం కానుంది.

Story first published: Friday, September 16, 2022, 13:01 [IST]
Other articles published on Sep 16, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X