న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చహల్‌తో ఇన్‌స్టా పరిచయమే.. అంతకు మించి ఏం లేదు: ఇంగ్లండ్ మహిళా క్రికెటర్

Danielle Wyatt Says We have some good friendly Instagram banter but I’ve never met Yuzvendra Chahal

లండన్: టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్‌తో తనకు ఇన్‌స్టా పరిచయమే ఉందని, అంతకు మించి తమ మధ్య ఏం లేదని ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డానియల్‌ వ్యాట్ తెలిపింది. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే చహల్.. ప్రతీ ఒక్కరిని ట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంటాడు. వారితో ఇన్‌స్టా వేదికగా వాగ్వాదం చేస్తుంటాడు.

ఇక తన ఇన్‌స్టా ఫ్రెండ్ అయిన డానియల్ వ్యాట్‌ను కూడా చహల్ ఇలానే ఆటపట్టించాడు. ఈ ఏడాది ప్రపంచకప్ సందర్భంగా.. డానియల్ ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు కొడ్తుందని ఇన్‌స్టా వేదికగా జోస్యం చెప్పాడు. దీనికి వ్యాట్ కూడా అదే తరహాలో బదులిచ్చింది. ఆ ఫీట్ చహల్ బౌలింగ్‌లోనే సాధించగలనని వ్యాట్ స్పష్టం చేసింది. అప్పట్లో వీరి సంభాషణ హాట్ టాపిక్ అయింది.

తాజాగా ఓ వెబ్‌సైట్‌కు వ్యాట్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని ప్రస్తావించగా.. తాము కేవలం స్నేహితులమేనని బదులిచ్చింది. కనీసం ఇప్పటి వరకు చహల్‌ను కలవను కూడా కలవలేదని తెలిపింది. 'ఇప్పటి వరకు చహల్‌ను నేను కలిసింది లేదు. కేవలం ఇన్‌స్టా వేదికగానే ఒకరికొకరం తెలుసు. స్నేహపూర్వకంగా వాదించుకుంటున్నాం. అతనో అద్భుతమైన బౌలర్. అలాగే సోషల్ మీడియాలో చాలా ఫన్నీగా ఉంటాడు'అని వ్యాట్ చెప్పుకొచ్చింది.

ఇక ఇదే ఇంటర్వ్యూలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ తనయుడు అర్జున్‌ టెండూల్కర్‌ బౌలింగ్‌ను ఎదుర్కొవడం చాలా కష్టమని డానియల్ పేర్కొంది. 'అర్జున్‌, నేను మంచి స్నేహితులం. లార్డ్స్‌ మైదానానికి ప్రాక్టీస్‌ చేయడానికి అతడు వస్తుండేవాడు. అప్పుడు కొత్త బంతితో బౌలింగ్‌ చేయమంటే భయపెట్టేవాడు. నేను వేసే బౌన్సర్లు నీ తలకు తగులుతాయనేవాడు. నేను కూడా అతడి బౌలింగ్‌లో బ్యాటింగ్‌ చేయడానికి ఇష్టపడేదాన్ని కాదు. అంతేకాకుండా అతడి బౌలింగ్‌ను ఎదుర్కోవడం చాలా కష్టం' అని వ్యాట్ పేర్కొంది.

పాకిస్థాన్ తరఫున ఫీల్డింగ్ చేసిన సచిన్.. ఎప్పుడంటే?పాకిస్థాన్ తరఫున ఫీల్డింగ్ చేసిన సచిన్.. ఎప్పుడంటే?

Story first published: Wednesday, June 17, 2020, 16:13 [IST]
Other articles published on Jun 17, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X