న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రిజర్వ్‌ డే సాధ్యం కాదు: ప్రపంచకప్ ఫైనల్లో వర్షం పడితే!

ICC Cricket World Cup 2019 : ICC Says Factoring In Reserve Would Be Extremely Complex To Deliver
CWC19: World Cup reserve days for rain extremely complex to deliver says ICC chief

ప్రపంచకప్‌లో ఇప్పటికే మూడు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. పాకిస్థాన్, శ్రీలంక.. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌.. బంగ్లాదేశ్‌, శ్రీలంక మ్యాచ్‌లు వర్షార్పణమయ్యాయి. మరికొన్ని మ్యాచ్‌లకు కూడా వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. గురువారం ట్రెంట్‌బ్రిడ్జ్ మైదానం వేదికగా న్యూజిలాండ్‌తో భారత్ ఢీ కొననుంది. ఈ మ్యాచ్‌కు కూడా వర్షం పొంచి ఉంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ నేపథ్యంలో ఐసీసీ టోర్నీ నిర్వహణ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నాలుగేళ్లకోసారి వచ్చే ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో అన్ని మ్యాచ్‌లకు 'రిజర్వ్‌ డే' ఉంటే బాగుండేదని చాలా మంది అభిప్రాయపడ్డారు. అయితే అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) దీనిపై పూర్తి బిన్నంగా స్పందించింది.

45 లీగ్‌ మ్యాచ్‌లకు రిజర్వ్‌ డే ఉంచడం సాధ్యం కాదు. ఇప్పటికే నెలన్నర జరగనున్న టోర్నీ ఇంకా ఎక్కువ కాలం సాగాల్సి ఉంటుంది. రిజర్వ్‌ డే తీవ్ర శ్రమతో కూడుకున్న వ్యవహారమని ఐసీసీ స్పష్టం చేసింది. అయితే సెమీఫైనల్, ఫైనల్‌ మ్యాచ్‌లకు మాత్రం రిజర్వ్‌ డే ఉన్నట్లు ఐసీసీ వెల్లడించింది. 'ప్రపంచకప్‌లో ప్రతీ మ్యాచ్‌కు రిజర్వ్‌ డే పెట్టడం అసాధ్యం. రిజర్వ్‌ డే రోజున కూడా వర్షం పడదని ఎవరూ హామీ ఇవ్వలేరు' అని ఐసీసీ తెలిపింది.

Story first published: Thursday, June 13, 2019, 12:33 [IST]
Other articles published on Jun 13, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X