న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'భారత్‌తో మ్యాచ్‌లో అత్యుత్తమ ఆటను ప్రదర్శించాల్సిందే'

CWC19, India vs Pakistan Match: Pakistan must bring their best game against India says Waqar Younis

ప్రపంచకప్‌లో అసలు సిసలైన సమరంకు సమయం దగ్గరపడింది. ఆదివారం చిరకాల ప్రత్యర్థులు భారత్‌, పాకిస్థాన్‌లు మెగా టోర్నీలో తలపడనున్నాయి. పటిష్ట దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలను ఓడించిన భారత్‌ వరుస విజయాలతో దూసుకెళ్తుండగా.. ఇంగ్లాండ్‌పై విజయం మినహా మిగతా మ్యాచ్‌ల్లో పాక్‌ అంతగా ప్రభావం చూపలేకపోయింది. ఎప్పుడెలా ఆడుతుందో తెలియని స్థితిలో పాకిస్థాన్‌ ఉండగా.. భారత్‌ మాత్రం అన్ని విభాగాల్లో సమతూకంతో ఉంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

గత రికార్డులను ఆలోచించొద్దు:

గత రికార్డులను ఆలోచించొద్దు:

కీలక మ్యాచ్ నేపథ్యంలో గురువారం పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వకార్ యూనిస్ ఆ దేశ జట్టుకు కొన్ని సలహాలిచ్చాడు. 'భారత్‌తో పాకిస్థాన్ ఎప్పుడు ఆడినా పెద్ద మ్యాచే. ఇరు దేశ అభిమానులు ఆసక్తిగా ఉంటారు. ప్రపంచకప్ టోర్నీల్లో గత రికార్డుల గురించి ఆలోచించకుండా.. కేవలం 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్‌ను ఓడించిన విషయాన్ని మాత్రమే పాక్ గుర్తుంచుకోవాలి. ఫైనల్‌ గెలుపును స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళాలి' అని వకార్ యూనిస్ సూచించాడు.

అత్యుత్తమ ఆటను ప్రదర్శించాల్సిందే:

అత్యుత్తమ ఆటను ప్రదర్శించాల్సిందే:

'భీకర బ్యాటింగ్ లైనప్ ఉన్న భారత్‌ను ఆదిలోనే వికెట్లు తీసి ఒత్తిడిలోకి నెట్టాలి. తొలి పది ఓవర్లలో వికెట్లు తీయడం కీలకం. విజయం సాధించాలంటే భారత్‌తో మ్యాచ్‌లో అత్యుత్తమ ఆటను ప్రదర్శించాల్సిందే. ఆస్ట్రేలియాతో ఓడినప్పటికీ ఆ మ్యాచ్‌లో పాక్ ప్రదర్శన బాగానే ఉంది. పేస్ బౌలర్ మహ్మద్ ఆమిర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. భారత్‌తో మ్యాచ్‌లో కూడా అతను వికెట్లు తీయాలి' అని వకార్ యూనిస్ పేర్కొన్నాడు.

భారత్‌కే విజయావకాశాలు ఎక్కువ:

భారత్‌కే విజయావకాశాలు ఎక్కువ:

రెండు జట్ల మధ్య బలాబలాలు చూస్తే ఈసారీ భారత్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భారత జట్టులో బ్యాటింగ్‌, బౌలింగ్‌తో పాటు మిడిల్‌ ఆర్డర్‌ కూడా మంచి ఫామ్‌లో ఉంది. మరోవైపు పాక్‌ బ్యాట్స్‌మెన్‌ పెద్దగా ఆకట్టుకోకపోయినా.. బౌలర్లు మాత్రం ఫర్వాలేదనిపిస్తున్నారు. అయితే పాకిస్థాన్‌ ఏ రోజు ఎలా ఆడుతుందో తెలీదు. ఆదివారం వాళ్లు చెలరేగితే భారత్‌కు కష్టాలు తప్పకపోవచ్చు. ప్రపంచకప్‌ టోర్నీల్లో పాక్‌పై ఎదురు లేని ఆధిపత్యం భారత్‌కు ఉంటే.. ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ను 180 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసిన రికార్డు పాక్‌కు ఉంది. ఈ నేపథ్యంలో ఆదివారం జరగబోయే మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Story first published: Friday, June 14, 2019, 10:44 [IST]
Other articles published on Jun 14, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X