న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆస్ట్రేలియా, భారత్ మ్యాచ్.. జంపా జేబులో ఏముందంటే?

ICC Cricket World Cup 2019 : Aaron Finch Clarifies Amid Ball-Tampering Claims On Adam Zampa
CWC19, India vs Australia: Adam Zampa had hand warmers in his pocket says Aaron Finch

సంవత్సరం క్రితం బాల్‌ టాంపరింగ్‌ ఉదంతం ఆస్ట్రేలియా క్రికెట్‌ను ఎంతగా కుదిపేసిందో తెలిసిందే. స్టార్ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ వివాదంలో ఇరుక్కుని ఏడాది పాటు ఆటకు దూరమయ్యారు. ఇక ఈ ఘటనతో ఆసీస్ ఆటగాళ్లెవరైనా టాంపరింగ్‌ లాంటివి చేస్తారని అనుకోరు. అయితే ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం లండన్‌లోని ఓవల్‌ మైదానం వేదికగా భారత్‌, ఆస్ట్రేలియాల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌ స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా తన ప్రవర్తనతో టాంపరింగ్‌ సందేహాలు కలిగించాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఐసీసీ దృష్టిసారించాలి:

ఐసీసీ దృష్టిసారించాలి:

భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తుండగా.. ఆడమ్‌ జంపా తన తొలి స్పెల్‌ వేస్తున్నాడు. ఈ సమయంలో అతను పదే పదే ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టి తీయడం, తర్వాత బంతిని రుద్దడం వంటివి చేసాడు. నెటిజన్లు ఈ దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి జంపా తీరు అనుమానాస్పదంగా ఉందని, దీనిపై ఐసీసీ దృష్టిసారించాలని అభిప్రాయపడ్డారు. ఐతే జంపా కచ్చితంగా టాంపరింగ్‌కు పాల్పడ్డాడని ఆ దృశ్యాలలో స్పష్టంగా తెలియట్లేదు.

హ్యాండ్‌ వార్మర్‌:

ఈ సందేహాలపై ఆసీస్‌ మేనేజ్మెంట్ స్పష్టత ఇచ్చింది. జంపా హ్యాండ్‌ వార్మర్‌ సాధనాన్ని ఉపయోగిస్తాడని, అతని జేబులో ఉన్నది అదేనని తెలిపింది. హ్యాండ్‌ వార్మర్‌ను జంపా తరచుగా ఉపయోగిస్తాడు. చల్లని వాతావరణంలో బంతిపై పట్టుచిక్కడం కోసం దాన్ని పదేపదే వాడుతారు అని పేర్కొంది. బిగ్‌బాష్‌ లీగ్‌తో పాటు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో కూడా జంపా ఉపయోగిస్తాడని స్పష్టం చేసింది.

ఫొటోలను ఇంకా చూడలేదు:

ఫొటోలను ఇంకా చూడలేదు:

ఆస్ట్రేలియా కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ మ్యాచ్‌ అనంతరం ఈ ఘటనపై స్పందించాడు. 'ఈ ఘటనకు సంబందించిన ఫొటోలను ఇంకా చూడలేదు. జంపా జేబులో మాత్రం హ్యాండ్‌ వార్మర్‌ ఉంటుందని తెలుసు. ప్రతి మ్యాచ్‌లో దాన్ని ఉపయోగిస్తాడు. బహుశా అదే ఉండి ఉంటుంది. ఆ ఫొటోలను చూడలేదు కాబట్టి ఈ విషయంపై ఎక్కువగా మాట్లాడలేను' అని తెలిపాడు.

దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో కూడా:

దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో కూడా:

గతేడాది నవంబర్‌లో కూడా జంపాకు ఇలాంటి ఆరోపణలనే ఎదురయ్యాయి. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ సందర్భంగా ఈ తరహా ఫొటోలు, వీడియోలు టాంపరింగ్ సందేహాలను కలిగించాయి. అనంతరం అతడు హ్యాండ్‌ వార్మర్‌ ఉపయోగిస్తాడని తేలింది. బహుశా ఇప్పుడు కూడా జంపా అదే ఉపయోగించి ఉంటాడు. బాల్‌ టాంపరింగ్‌ ఉదంతంలో కూరుకున్న ఆసీస్‌ జట్టు.. మళ్లీ అలాంటి సాహసం చేయబోదు.

Story first published: Monday, June 10, 2019, 10:43 [IST]
Other articles published on Jun 10, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X