న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రపంచకప్‌.. కైఫ్‌ రికార్డును సమం చేసిన క్రిస్‌ వోక్స్‌

CWC19: England vs Pakistan: Chris Woakes set ODI records at Trent Bridge, Equals indian cricketer Mohammad Kaif

ప్రపంచకప్‌-2019లో ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ క్రిస్‌ వోక్స్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ప్రపంచకప్‌లోని ఒక మ్యాచ్‌లో అత్యధికంగా నాలుగు క్యాచ్‌లు అందుకుని సరికొత్త ఘనతను అందుకున్నాడు. సోమవారం ట్రెంట్‌ బ్రిడ్జ్ వేదికగా పాకిస్తాన్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో నాలుగు క్యాచ్‌లు అందుకుని టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్‌ కైఫ్‌ సరసన చేరాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఇన్నింగ్స్‌కే హైలెట్‌ క్యాచ్:

ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హాక్, బాబర్ ఆజాం, మొహమ్మద్ హఫీజ్, కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ల క్యాచ్‌లను క్రిస్‌ వోక్స్‌ అందుకున్నాడు. ఇందులో ఇమామ్ ఉల్ హాక్ క్యాచ్‌ ఇన్నింగ్స్‌కే హైలెట్‌గా నిలిచింది. ఆఫ్ స్టంప్‌కు దూరంగా మెయిన్ అలీ వేసిన బంతిని ఇమామ్ ఉల్ హాక్ అమాంతం గాల్లోకి లేపాడు. బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తోన్న వోక్స్ పరుగెత్తుకొచ్చి.. డైవ్‌కొట్టి మరీ ఒడిసి పట్టుకున్నాడు.

నాలుగో ఫీల్డర్:

నాలుగో ఫీల్డర్:

నాలుగు క్యాచ్‌లు అందుకుని.. ప్రపంచకప్‌లోని ఒక మ్యాచ్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న నాలుగో ఫీల్డర్ (వికెట్ కీపర్ కాకుండా)గా క్రిస్‌ వోక్స్‌ గుర్తింపు పొందాడు. మొదటగా మహ్మద్‌ కైఫ్‌ నాలుగు క్యాచ్‌లు పట్టాడు. 2003 ప్రపంచకప్‌లో శ్రీలంకపై కైఫ్ ఈ ఘనత అందుకున్నాడు. అనంతరం సౌమ్యా సర్కార్ (2015), ఉమర్ అక్మల్ (2015)లు ప్రపంచకప్‌లో నాలుగు క్యాచ్‌లు అందుకున్నారు.

పాక్‌ సరికొత్త రికార్డు

పాక్‌ సరికొత్త రికార్డు

పాక్‌ బ్యాట్స్‌మెన్‌ బాబర్‌ అజామ్‌ (63‌), హఫీజ్‌ ‌(84), సర్పరాజ్‌ అహ్మద్‌ (55)లు రాణించడంతో పాక్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 348 పరుగులు చేసింది. ఏ ఒక్క బ్యాట్స్‌మెన్‌ సెంచరీ చేయకపోయినా భారీ స్కోర్‌ సాధించడంతో ప్రపంచకప్‌లో పాక్‌ సరికొత్త రికార్డును సృష్టించింది. గత వరల్డ్‌కప్‌లో యూఏఈపై దక్షిణాఫ్రికా జట్టులో ఎవరూ సెంచరీ సాధించకుండానే 341 పరుగుల చేసింది. ఇప్పటివరకు అదే అత్యుత్తమం. కాగా పాక్ ఆ రికార్డును సవరించింది.

Story first published: Tuesday, June 4, 2019, 14:28 [IST]
Other articles published on Jun 4, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X