న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్‌కప్: ధోని ‘బలిదాన్‌ బ్యాడ్జ్‌’పై రచ్చ: పాక్ మంత్రి తీవ్ర ఆగ్రహం

ICC Cricket World Cup 2019 : ‘Dhoni In England Not For Mahabharat’,Pak Minister On Army Gloves Issue
CWC 2109: MS Dhoni is in England to play cricket not for MahaBharta: Pakistan Minister

హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని 'బలిదాన్‌ బ్యాడ్జ్‌' లోగోతో ఉన్న గ్లౌజ్‌ ధరించడంపై పాకిస్థాన్ ఫెడరల్ మినిస్టర్ ఫర్ సైన్స్ అండే టెక్నాలజీ ఫవాద్ చౌధరి ఆగ్రహం వ్యక్తం చేశారు. వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా టీమిండియా జూన్ 5న దక్షిణాఫ్రికాతో తలపడిన సంగతి తెలిసిందే.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ మ్యాచ్‌లో ధోని 'బలిదాన్‌ బ్యాడ్జ్‌' లోగోతో ఉన్న గ్లౌజ్‌ను ధరించాడు. ధోని ధరించిన గ్లౌజ్‌పై ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో పాక్ మంత్రి ఫవాద్ చౌధరి తన ట్విట్టర్‌లో "ధోనీ ఇంగ్లాండ్‌లో క్రికెట్‌ ఆడేందుకు ఉన్నాడు. మహాభారతం కోసం కాదు, ఈ వ్యవహారంపై భారత్‌లో ఓ వర్గం మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది. యుద్దం జరుగుతున్నట్లు చిత్రీకరిస్తున్నాయి. అలాంటివారిని సిరియా, అఫ్గానిస్థాన్‌ లేదా రవాండాకి తరలించాలి" అని అని ట్వీట్‌ చేశాడు.

40వ ఓవర్‌ వేసిన చాహల్‌ బౌలింగ్‌లో

40వ ఓవర్‌ వేసిన చాహల్‌ బౌలింగ్‌లో

సఫారీ ఇన్నింగ్స్‌లో 40వ ఓవర్‌ వేసిన చాహల్‌ బౌలింగ్‌లో ధోనీ దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ ఫెలుక్వాయోను స్టంపౌట్‌ చేశాడు. ఆ సమయంలో రీప్లేలో ధోనీ గ్లౌజ్‌లకు ‘బలిదాన్‌ బ్యాడ్జ్‌' గుర్తు కనిపించడంతో ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఈ లోగోతో ధోని తన దేశభక్తిని, ఆర్మీపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడని, భారత అభిమానులు కొనియాడుతూ పెద్ద ఎత్తున రీట్వీట్లు చేశారు.

‘బలిదాన్‌ బ్యాడ్జ్‌' పై పాక్ అభ్యంతరం

‘బలిదాన్‌ బ్యాడ్జ్‌' పై పాక్ అభ్యంతరం

మరోవైపు ఐసీసీ సైతం ‘బలిదాన్‌ బ్యాడ్జ్‌' పై అభ్యంతరం తెలిపింది. ధోనీ గ్లౌజులపై బలిదాన్‌ గుర్తు క్రికెట్ నిబంధనలకు విరుద్ధం. ఆ గుర్తు తొలగించాలని ఐసీసీ స్ట్రాటజిక్‌ కమ్యూనికేషన్స్‌ జీఎం క్లైర్‌ ఫోర్లాంగ్‌ బీసీసీఐని కోరారు. 'ఐసీసీ నిబంధనల ప్రకారం అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌ల్లో ఆటగాళ్ల దుస్తులు, కిట్‌ సామాగ్రిపై.. జాతి, మత, రాజకీయ సందేశాత్మక గుర్తులు ఉండరాదు. బీసీసీఐని ఆ గుర్తు తీయించాలని కోరాం' అని ఫర్లాంగ్‌ వెల్లడించారు.

ధోనీకి శిక్ష విధిస్తారా?

ధోనీకి శిక్ష విధిస్తారా?

కాగా ఐసీసీ నిబంధనలను ఉల్లంఘించినందుకు ధోనీకి శిక్ష విధిస్తారా అని ఫర్లాంగ్‌ను అడగ్గా.. 'మొదటి ఉల్లంఘన కాబట్టి కేవలం గుర్తు తొలగించాలని కోరాం. చర్యలు తీసుకోలేదు' అని ఫోర్లాంగ్‌ తెలిపారు. ఐసీసీ నిబంధనలతో ఇకపై.. వచ్చే మ్యాచ్‌లలో ధోనీ బలిదాన్‌ గుర్తు గ్లౌజ్‌లు వాడడు. టీమిండియా ఆదివారం ఆస్ట్రేలియాతో తలపడునుంది.

ప్రత్యేక దళాల విలక్షణ చిహ్నం

ప్రత్యేక దళాల విలక్షణ చిహ్నం

ప్రత్యేక దళాల విలక్షణ చిహ్నమైన ‘బలిదాన్‌ బ్యాడ్జ్‌'. పారాచూట్‌ రెజిమెంట్‌లో ఓ భాగం. రెండు కత్తులు కనిపించేలా ఉంటే ఈ చిహ్నంపై దేవనగరి లిపిలో బలిదాన్‌ అని రాసి ఉంటుంది. పారామిలిటరీ కమాండోలు మాత్రమే ఈ బ్యాడ్జ్‌ ధరించాడినికి అనుమతినిస్తారు. 2011లో ధోని పారాచూట్‌ రెజిమెంట్‌లో గౌరవ లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదా పొందిన సంగతి తెలిసిందే.

Story first published: Friday, June 7, 2019, 14:10 [IST]
Other articles published on Jun 7, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X