న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రపంచకప్‌లో తొలి బంగ్లా బౌలర్‌గా చరిత్ర సృష్టించిన ముస్తాఫిజుర్

 CWC 2019: Mustafizur Rahman becomes the fastest Bangladesh bowler to pick 100 ODI wickets

హైదరాబాద్: లార్డ్స్ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 10 ఓవర్లు వేసిన ముస్తాఫిజుర్ 5 వికెట్లు తీసి 75 పరుగులు ఇచ్చాడు. దీంతో ఈ ప్రపంచకప్‌లో ముస్తాఫిజుర్ రెండోసారి 5 వికెట్లు తీశాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

అంతకముందు టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో సైతం ముస్తాఫిజుర్ 5 వికెట్లతో చెలరేగిన సంగతి తెలిసిందే. అంతేకాదు వన్డేల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన తొలి బంగ్లా బౌలర్‌గా ముస్తాఫిజుర్ చరిత్ర సృష్టించాడు. మొత్తంగా వన్డేల్లో 100 వికెట్లను అత్యంత వేగంగా తీసిన నాలుగో బౌలర్‌గా అరుదైన ఘనత సాధించాడు.

వన్డేల్లో 100 వికెట్లు

వన్డేల్లో 100 వికెట్లు తీసేందుకు గాను ముస్తాఫిజుర్‌కు 54 మ్యాచ్‌లు అవసరమయ్యాయి. ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ 52 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించగా... బ్రెట్ లీ(55), ట్రెంట్ బౌల్ట్(56), మహ్మద్ షమీ(56) మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించారు. ఒక ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు(20) తీసిన బంగ్లా బౌలర్‌గా కూడా ముస్తాఫిజుర్ అరుదైన ఘనత సాధించాడు.

బంగ్లాదేశ్‌ను 7 పరుగులకే కట్టడి చేస్తేనే

ఈ మ్యాచ్‌లో ఇమామ్ ఉల్ హాక్ 100 బంతుల్లో 100(8 ఫోర్లు) సెంచరీతో చెలరేగగా... బాబర్ అజాం 98 బంతుల్లో 96(11 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 315 పరుగులు చేసింది. దీంతో బంగ్లాకు 315 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 7 పరుగులకే కట్టడి చేస్తే పాకిస్థాన్ తన సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంటుంది. అయితే, అది సాధ్యపడేలా కనిపించడం లేదు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. సైఫుద్దీన్ వేసిన 8వ ఓవర్లో ఓపెనర్ ఫకార్ జమాన్(13) పరుగుల వద్ద తొలి వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు.

సెంచరీ సాధించిన ఇమామ్ ఉల్ హక్

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బాబర్ ఆజాంతో కలిసి ఓపెనర్ ఇమామ్ ఉల్ హాక్ జట్టుకు బలమైన పునాది వేశారు. బంగ్లా బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని 150కి పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే, జట్టు స్కోరు 180 పరుగుల వద్ద బాబర్ ఆజాం 96 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సైపుద్దీన్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో తృటిలో సెంచరీని మిస్సయ్యాడు.

అయితే, ఈ ప్రపంచకప్‌లో బాబర్ అజాం ఓ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక ప్రపంచకప్‌లో పాకిస్థాన్ తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో పాక్ మాజీ క్రికెట్ దిగ్గజం జావేద్ మియాందాద్ 437 పరుగుల రికార్డుని అధిగమించాడు. 1992 ప్రపంచకప్‌లో జావేద్ మియాందాద్ ఈ పరుగులు సాధించాడు. మొత్తం 8 మ్యాచ్‌లు ఆడిన బాబర్ ఆజాం 474 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

మిడిలార్డర్ విఫలం కావడంతో

అయితే, మిడిలార్డర్ విఫలం కావడంతో ఆఖర్లో మెరుపులు మెరిపించి భారీ స్కోరు సాధించే గొప్పగా అవకాశాన్ని చేజార్చుకుంది. బాబర్ అజాం ఔటైన తర్వాత సెంచరీ అనంతరం ఇమామ్ ఉల్ హాక్ సెంచరీ సాధించాడు. 99 బంతుల్లో 7ఫోర్ల సాయంతో 100 మార్క్ అందుకున్నాడు. వరల్డ్‌కప్‌లో ఇమామ్‌కు ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. పాక్ తరఫున అతి తక్కువ వయసులో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ముస్తాఫిజుర్ వేసిన 42వ ఓవర్లో సెంచరీ పూర్తి చేసుకున్న ఇమామ్.. ఆ తర్వాత దూకుడుగా ఆడే క్రమంలో హిట్‌వికెట్‌గా వెనుదిరిగాడు.

ముస్తాఫిజుర్ అరుదైన ఘనత

అనంతరం దూకుడుగా ఆడుతున్న మహ్మద్ హఫీజ్(27) మెహదీ హాసన్ బౌలింగ్‌లో షకీబ్ ఉల్ హాసన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత ముస్తాఫిజుర్ వేసిన 44వ ఓవర్ ఐదో బంతికి హారీస్.. సౌమ్య సర్కార్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో పాక్ ఇన్నింగ్స్ నెమ్మదించింది. సొహైల్ వికెట్‌తో ముస్తాఫిజుర్ వన్డేల్లో 100 వికెట్ల మైలురాయి అందుకున్నాడు.

ఐదు వికెట్లు తీసిన ముస్తాఫిజుర్

ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో బంగ్లా బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ వరుసగా రెండు వికెట్లు తీశాడు. ఇక, బ్యాటింగ్ చేయడానికి వచ్చిన పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ గాయం కారణంగా రిటైర్డ్‌ హర్ట్‌గా మైదానాన్ని వీడాడు. చివరల్లో ఇమాద్ వసీం 26 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్‌తో 43 పరుగులతో మెరుపులు మెరిపించడంతో పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 315 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహ్మన్ 5 వికెట్లు తీయగా... మొహమ్మద్ సైఫుద్దీన్ 3, మెహదీ హాసన్ ఒక వికెట్ పడగొట్టాడు.

Story first published: Friday, July 5, 2019, 19:58 [IST]
Other articles published on Jul 5, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X