న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

‘బలిదాన్‌ బ్యాడ్జ్‌’పై రచ్చ: ధోనికి మద్దతుగా బీసీసీఐ, ఫ్యాన్స్

CWC 2019: Indians call for CWC 2019 boycott after ICC asks Dhoni to remove Army insignia gloves

హైదరాబాద్: దక్షిణాఫ్రికాతో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో టీమిండియా వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని 'బలిదాన్‌ బ్యాడ్జ్‌' లోగోతో ఉన్న గ్లౌజ్‌ను ధరించాడు. ధోని ధరించిన గ్లౌజ్‌పై ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. ధోని ధరించిన 'బలిదాన్‌ బ్యాడ్జ్‌'పై ఐసీసీ సైతం అభ్యంతరం వ్యక్తం చేసింది. ధోనీ గ్లౌజులపై బలిదాన్‌ గుర్తు క్రికెట్ నిబంధనలకు విరుద్ధం.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఆ గుర్తు తొలగించాలని ఐసీసీ స్ట్రాటజిక్‌ కమ్యూనికేషన్స్‌ జీఎం క్లైర్‌ ఫోర్లాంగ్‌ బీసీసీఐని కోరారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్‌లో #DhoniKeepTheGlove అనే హ్యాష్ ట్యాగ్‌ని ట్రెండ్ చేస్తూ భారత అభిమానులు ధోనీకి మద్దతు నిలుస్తున్నారు.

"ధోని ఆ లోగో అలానే ఉంచుకో.. దేశం మొత్తం నీకు మద్దతుగా ఉంది. అవసరమైతే ప్రపంచకప్‌నే బాయ్‌కాట్‌ చేద్దాం" అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు.

ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు టీషర్టులపై మూడు సింహాల లోగో

"ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు సైతం తమ టీషర్టులపై మూడు సింహాల లోగో వేసుకున్నారని, అది కూడా ఆ దేశ సైనికుల త్యాగానికి చిహ్నమేనని" మరోక నెటిజన్ కామెంట్ పెట్టాడు. మనకు ఆటకన్నా దేశ గౌరవం ముఖ్యమని అభిమానులు ట్విట్టర్‌లో ట్వీట్లు చేస్తున్నారు. ఐసీసీ సంపదలో 80 శాతం వాటా మనదేనని, టోర్నీ నుంచి నిష్క్రమిస్తానంటే ఐసీసీ దారిలోకి వస్తుందని ట్వీట్లు చేస్తున్నారు.

బీసీసీఐ పాలకుల కమిటీ చీఫ్ వినోద్ రాయ్ మాట్లాడుతూ

బీసీసీఐ పాలకుల కమిటీ చీఫ్ వినోద్ రాయ్ మాట్లాడుతూ

ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై బీసీసీఐ పాలకుల కమిటీ చీఫ్ వినోద్ రాయ్ స్పందించారు. ధోని ధరించిన గ్లౌజ్‌పై ఉన్న లోగోను తొలగించాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "ధోని ధరించిన గ్లౌజ్‌పై ఉన్న లోగో మిలటరీ సింబల్‌ కాదు. దీనిపై రాద్ధాంతం అనవసరం. ఐసీసీ నిబంధనల్ని ధోని అతిక్రమించలేదు. ఇందుకు ఐసీసీ అనుమతి కోరాం" అని తెలిపారు.

లెప్ట్‌నెంట్ జనరల్ (రిటైర్డ్) వినోద్ భాటియా మాట్లాడుతూ

మరోవైపు ఈ విషయంపై లెప్ట్‌నెంట్ జనరల్ (రిటైర్డ్) వినోద్ భాటియా మాట్లాడుతూ "గతంలో ఎన్నో సందర్భాల్లో క్రికెటర్లు ఇలా చేసిన సందర్భాలు ఉన్నాయి. 2016లో లార్డ్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాక్ విజయం సాధించిన తర్వాత దానిని పాక్ ఆర్మీకి అంకితం చేశారు. అదే ధోని ఓ బ్యాడ్జ్ ధరిస్తే వారికి ప్రాబ్లమ్‌ అయింది. భారత్‌లో కొంత మందికి కూడా. ఐసీసీకి కూడా" అని అన్నారు.

సోషల్ మీడియాలో వైరల్‌

సోషల్ మీడియాలో వైరల్‌

40వ ఓవర్‌ వేసిన చాహల్‌ బౌలింగ్‌లో ధోనీ దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ ఫెలుక్వాయోను స్టంపౌట్‌ చేశాడు. ఆ సమయంలో రీప్లేలో ధోనీ గ్లౌజ్‌లకు ‘బలిదాన్‌ బ్యాడ్జ్‌' గుర్తు కనిపించడంతో ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 'ఐసీసీ నిబంధనల ప్రకారం అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌ల్లో ఆటగాళ్ల దుస్తులు, కిట్‌ సామాగ్రిపై.. జాతి, మత, రాజకీయ సందేశాత్మక గుర్తులు ఉండరాదు. బీసీసీఐని ఆ గుర్తు తీయించాలని కోరాం' అని ఫర్లాంగ్‌ వెల్లడించారు.

Story first published: Friday, June 7, 2019, 17:38 [IST]
Other articles published on Jun 7, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X