న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాక్‌లో ముగ్గురు హాఫ్ సెంచరీలు: ఇంగ్లాండ్‌కు భారీ టార్గెట్

CWC 2019: England vs Pakistan Live Cricket Score: Hafeez, Azam power Pakistan to 348

హైదరాబాద్: తన తొలి మ్యాచ్‌లో చెత్త ప్రదర్శన చేసిన పాకిస్థాన్ రెండో మ్యాచ్‌లో అదరగొట్టింది. నాటింగ్‌హామ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మహ్మద్ హఫీజ్ 62 బంతుల్లో 84(8 ఫోర్లు, 2 సిక్సులు), బాబర్ అజాం 66 బంతుల్లో 63(4 పోర్లు, 1సిక్స్), కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ 44 బంతుల్లో 55(5 ఫోర్లు) ముగ్గురు బ్యాట్స్‌మెన్లు హాఫ్ సెంచరీలతో చెలరేగారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

దీంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 348 పరుగులు చేసింది. వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌కు ఇది రెండో అత్యధిక స్కోరు కావడం విశేషం. దీంతో ఆతిథ్య జట్టుకు 349 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇంగ్లాండ్ బౌలర్లలో మొయిన్ అలీ, క్రిస్ వోక్స్ చెరో మూడు వికెట్లు తీయగా, మార్క్ వుడ్ రెండు వికెట్లు తీశాడు.

1
43649

పాక్ ఓపెనర్లు చక్కటి భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 82 పరుగులు జోడించిన తర్వాత ఫకర్ జమాన్ 40 బంతుల్లో 36(6 ఫోర్లు) మొయిన్ అలీ బౌలింగ్‌లో స్టంపౌట్ ఔట‌య్యాడు. కీప‌ర్ జోస్ బ‌ట్ల‌ర్ అద్భుతంగా స్టంపింగ్‌కు ఫాకర్ జమాన్ పెవిలియన్‌కు చేరాడు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బాబర్ ఆజాంతో కలిసి మరో ఓపెనర్ ఇమామ్ ఉల్ హాక్ స్కోరు బోర్డుని నడిపించాడు. అయితే, జట్టు స్కోరు 111 పరుగుల వద్ద మొయిన్ అలీ బౌలింగ్‌లో ఇమామ్ ఉల్ హాక్ 58 బంతుల్లో 44 (3 పోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ ముంగిట క్రిస్ వోక్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

ఆఫ్ స్టంప్‌కు దూరంగా మెయిన్ అలీ వేసిన బంతిని ఇమామ్ ఉల్ హాక్ అమాంతం గాల్లోకి లేపాడు. అదే సమయంలో బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తోన్న క్రిస్ వోక్స్ పరుగెత్తుకొచ్చి బంతిని అందుకోవడం స్టేడియంలో ప్రేక్షకుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. బంతి గమనాన్ని కచ్చితంగా అంచనా వేసిన వోక్స్‌ డైవ్‌కొట్టి మరీ ఒడిసి పట్టుకున్నాడు.

దీంతో పాకిస్థాన్ రెండో వికెట్ కోల్పోయింది. ఇమామ్ ఉల్ హక్ ఔటైన తర్వాత క్రీజులోకి మహ్మద్ హఫీజ్ వచ్చాడు. మరోవైపు హాఫ్ సెంచరీ అనంతరం జట్టు స్కోరు 198 పరుగుల వద్ద బాబర్ అజాం 66 బంతుల్లో 63(4 ఫోర్లు, 1 సిక్స్) భారీ షాట్‌కు యత్నించి పెవిలియన్‌ చేరాడు.

అనంతరం క్రీజులోకి హఫీజ్‌కు జత కలిసిన పాక్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ హాఫ్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో హఫీజ్‌ హాఫ్ సెంచరీని సాధించాడు. అనంతరం జట్టు స్కోరు 279 పరుగుల వద్ద మార్క్ ఉడ్ బౌలింగ్‌లో క్రిస్ వోక్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

{headtohead_cricket_5_2}

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అసిఫ్ అలీ(14), షోయబ్ మాలిక్(8) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరడంతో పాక్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 348 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో మొయిన్ అలీ, క్రిస్ వోక్స్ చెరో మూడు వికెట్లు తీయగా, మార్క్ వుడ్ రెండు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో క్రిస్ వోక్స్ నాలుగు క్యాచ్‌లు పట్టడం విశేషం.

Story first published: Monday, June 3, 2019, 19:09 [IST]
Other articles published on Jun 3, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X