న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తన ఫిట్‌నెస్‌కు అసలు కారణం చెప్పిన క్రిస్‌ గేల్‌

Chris Gayle Chooses Yoga Over Gym, Hopes To Carry Form Into Final World Cup || Oneindia Telugu
CWC 2019: Chris Gayle chooses yoga over gym, hopes to carry form into final World Cup

'యూనివర్సల్ బాస్' వెస్టిండీస్‌ స్టార్‌ క్రికెటర్‌ క్రిస్‌ గేల్‌ ఎంత ఫిట్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. మ్యాచ్ మొత్తం కూడా బ్యాటింగ్ చేయగల సమర్ధుడు. క్రీజులో ఉన్నాడంటే బౌండరీలు, భారీ సిక్సులతో తన బ్యాటింగ్ విశ్వరూపం చూసిస్తాడు. మరి భారీ సిక్సులు కొడుతూ పరుగులు చేయాలంటే ఫిట్‌నెస్‌ చాలా అవసరం. 39 ఏళ్ల వయసులో కూడా గేల్‌ ఫిట్‌గా ఉన్నాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

ఎక్కువగా విశ్రాంతి తీసుకుంటా:

ఎక్కువగా విశ్రాంతి తీసుకుంటా:

తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్రిస్‌ గేల్‌ తన ఫిట్‌నెస్‌కు అసలు కారణం చెప్పేసాడు. 'మ్యాచ్‌లకు మధ్య ఉండే సమయాల్లో ఎక్కువగా విశ్రాంతి తీసుకుంటా. రెండు నెలలుగా జిమ్‌లో అడుగు కూడా పెట్టలేదు. మానసికంగా దృఢంగా తయారవడంపై దృష్టి సారించా. యోగా చేస్తున్నా. మాసాజ్‌లు చేయించుకుంటున్నా. దీంతో మ్యాచ్‌ల ముందు తాజాగా ఉంటా' అని గేల్ తెలిపారు.

పరుగుల వరద ఖాయం:

పరుగుల వరద ఖాయం:

'త్వరలో ప్రపంచకప్‌ రాబోతుంది. పరుగుల వరద పారడం ఖాయం. ప్రస్తుత నా బ్యాటింగ్ ప్రదర్శనతో సంతోషంగా ఉన్నా. ఇదే జోరును ప్రపంచకప్‌లో కూడా కొనసాగించాలని అనుకుంటున్నా. ఆటకు, వయస్సుకు సంబంధం లేదు. నిజాయితీగా చెపుతున్నా.. రెండు సంవత్సరాల కింద నా ప్రదర్శన బాగా లేదు. అప్పుడు కూడా అభిమానులు అండగా నిలిచారు. ప్రపంచకప్‌లో వారిని సంతోష పెడుతా. కప్ గెలిచేందుకు ప్రయత్నిస్తా' అని గేల్ అన్నారు.

ఎప్పుడూ కలలు కనలేదు:

ఎప్పుడూ కలలు కనలేదు:

'చాలా ప్రపంచకప్‌లలో ఆడాలని నేను ఎప్పుడూ కూడా కలలు కనలేదు. కానీ అలా జరిగిపోతుంది. ఇదంతా నా కెరీర్ స్థిరత్వం వలనే సాధ్యం అవుతోంది. హార్డ్ వర్క్ ఎప్పటికీ ఉపయోగపడుతుంది. గత రెండు నెలలలో విండీస్ బోర్డులో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం మంచి జట్టు ఉంది. కరేబియన్ లో క్రికెట్ కు చాలా ఆదరణ ఉంది. వీరిని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తా. ఇంగ్లాండ్ జట్టుపై మంచి క్రికెట్ ఆడాం. ప్రపంచకప్‌లో కూడా మంచి ప్రదర్శన చేస్తాం' అని గేల్ ఆశాభావం వ్యక్తం చేశారు.

 వైస్‌ కెప్టెన్‌గా గేల్:

వైస్‌ కెప్టెన్‌గా గేల్:

తాజాగా వెస్టిండీస్‌ వైస్‌ కెప్టెన్‌గా గేల్ నియమించబడ్డారు. గేల్ చివరి సారిగా 2010 జూన్‌లో విండీస్‌ వన్డే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ప్రస్తుతం విండీస్ జట్టుకు వైస్‌ కెప్టెన్‌గా ఉన్న షై హోప్‌ను కాదని గేల్‌ను నియమించారు. క్రిస్‌ గేల్‌ వెస్టిండీస్‌ తరపున 289 వన్డేలలో 10,151 పరుగులు చేసాడు. వన్డేలలో గేల్‌ అత్యధిక స్కోర్ 215. ఈ సోరును గేల్‌ 2015 ప్రపంచకప్‌లో జింబాంబ్వేపై నమోదు చేసాడు. ప్రపంచకప్‌ విండీస్ ప్రస్తుత జట్టులో గేల్‌ అత్యంత అనుభవజ్ఞుడు. ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌ మే 31న పాకిస్థాన్‌తో తలపడనుంది.

Story first published: Thursday, May 16, 2019, 11:37 [IST]
Other articles published on May 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X