న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విండిస్ లక్ష్యం 289: వరల్డ్‌కప్ చరిత్రలోనే కౌల్టర్-నైల్ రెండో అత్యధిక స్కోరు

CWC 2019: Australia vs West Indies Live Score: Smith, Coulter-Nile Lead Australia to 288

హైదరాబాద్: నాటింగ్‌హామ్ వేదికగా వెస్టిండిస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నాథన్ కౌల్టర్-నైల్ 60 బంతుల్లో 92(8 ఫోర్లు, 4 సిక్సులు), స్టీవ్ స్మిత్ 103 బంతుల్లో 73(7 ఫోర్లు) హాప్ సెంచరీలతో రాణించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 49 ఓవర్లకు గాను 288 పరుగులు చేసిన ఆలౌటైంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

దీంతో వెస్టిండిస్‌కు 289 పరుగుల విజయ లక్ష్యాన్నిన నిర్దేశించింది. వెస్టిండీస్ బౌలర్లలో కార్లోస్ బ్రాత్‌వైట్ మూడు వికెట్లు తీయగా, ఒషానే థామస్, షెల్డన్ కాట్రెల్, ఆండ్రూ రస్సెల్‌లు తలో రెండు వికెట్లు తీశారు. కెప్టెన్ జాసన్ హోల్డర్‌కు ఒక వికెట్ దక్కింది.


టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న విండిస్:

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్‌ ఆస్ట్రేలియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే విండిస్ బౌలర్లు షాకిచ్చారు. ఇన్నింగ్స్ మూడో ఓవర్ రెండో బంతికి ఆస్ట్రేలియా కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ (6) పరుగుల వద్ద ఒషానే థామస్ బౌలింగ్‌లో కీపర్‌కి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

ఆ తర్వాత మరో 11 పరుగులకే మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్(3)ను కాట్రెల్ పెవిలియన్‌కు చేర్చాడు. షెల్డన్‌ కాట్రెల్‌ వేసిన నాలుగో ఓవర్‌ ఆఖరి బంతిని షాట్‌ ఆడిన వార్నర్‌.. హెట్మేయర్‌ చేతికి చిక్కాడు. దీంతో షెల్డన్‌ కాట్రెల్‌ తనదైన శైలిలో సంబరాలు చేసుకున్నాడు. ఆ తర్వాత ఉస్మాన్‌ ఖవాజా (13) పరుగుల వద్ద రసెల్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ షై హోప్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరుకున్నాడు.

విధ్వంసకర బ్యాట్స్‌మన్ మ్యాక్స్‌వెల్‌ (0) డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో కీలక వికెట్లను కోల్పోయి ఆస్ట్రేలియా పీకల్లోతు కష్టాల్లో పడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన మార్కస్ స్టోయినిస్(19) కూడా జట్టు స్కోరు 79 పరుగుల వద్ద జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో నికోలస్ పూరన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన అలెక్స్ క్యారీతో కలిసి మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.

1
43653

అయితే, జట్టు స్కోరు 147 పరుగుల వద్ద అలెక్స్ క్యారీ(45) ఆండ్రీ రస్సెల్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ షైహోప్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కౌల్టర్‌ నైల్‌ 60 బంతుల్లో 92(8 పోర్లు, 4 సిక్సులు) స్మిత్‌తో కలిసి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. విండీస్‌ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టారు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 102 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.

ప్రపంచకప్‌ చరిత్రలో 8వ స్థానంలో బ్యాటింగ్‌ వచ్చి అత్యధిక స్కోర్ చేసిన రెండో బ్యాట్స్ మన్‌గా కౌల్టర్-నైల్ అరుదైన ఘనత సాధించాడు. ఒకవైపు విండీస్‌ బౌలర్లు విజృభించినప్పటికీ స్మిత్‌-కౌల్టర్‌-నైల్‌ జోడీ వారి బౌలింగ్‌ను ధీటుగా ఎదుర్కొని ఆస్ట్రేలియాను పోటీలోకి తీసుకొచ్చారు. ఒకానొక దశలో ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆస్ట్రేలియాను వీరిద్దరూ ఆదుకోవడంతో నిర్ణీత 49 ఓవర్లలో 288 పరుగులకు కుప్పకూలింది.

{headtohead_cricket_1_8}

Story first published: Thursday, June 6, 2019, 19:38 [IST]
Other articles published on Jun 6, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X