న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాకిస్థాన్‌తో మ్యాచ్: వన్డేల్లో 15వ సెంచరీ నమోదు చేసిన వార్నర్

CWC 2019: Australia v Pakistan Live score: David Warner brings up his 15th ODI ton

హైదరాబాద్: టాంటన్ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఓపెనర్ డేవిడ్ వార్నర్ సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ఆస్ట్రేలియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓపెనర్లుగా డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్‌లు ఇన్నింగ్స్‌ను ఆరంభించారు.

1
43660

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ క్రమంలో తొలుత ఆరోన్ ఫించ్ హాఫ్ సెంచరీ నమోదు చేయగా... ఆ తర్వాత డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీని సాధించాడు. అయితే, జట్టు స్కోరు 146 పరుగుల వద్ద ఆరోన్ ఫించ్ (82)ను అమిర్‌ పెవిలియన్‌కు పంపించడంతో తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన స్టీవ్ స్మిత్‌తో కలిసి వార్నర్ స్కోరు బోర్డుని నడిపించాడు.

{headtohead_cricket_1_5}

ఈ క్రమంలో జట్టు స్కోరు 189 పరుగుల వద్ద స్టీవ్ స్మిత్(8) మహ్మద్ హఫీజ్ బౌలింగ్‌లో అసిఫ్ అలీ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మ్యాక్స్‌వెల్‌ నుంచి వార్నర్‌కు చక్కటి సహకారం లభించడంతో 102 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో సెంచరీని నమోదు చేశాడు. వన్డేల్లో వార్నర్‌కి ఇది 15వ సెంచరీ.

ఈ క్రమంలో అతి తక్కువ ఇన్నింగ్స్‌లో 15 సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో వార్నర్ చోటు దక్కించుకున్నాడు. 108 ఇన్నింగ్స్‌లో 15 సెంచరీలు సాధించి.. వార్నర్ రికార్డు సృష్టించాడు. సెంచరీ అనంతరం దూకుడుగా ఆడే క్రమంలో డేవిడ్ వార్నర్ 111 బంతుల్లో 107(11 ఫోర్లు, 1 సిక్స్) పరుగుల వద్ద షహీన్ అఫ్రిది బౌలింగ్‌లో ఇమామ్ ఉల్ హాక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 38 ఓవర్లకు గాను ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 243 పరుగులు చేసింది. క్రీజులో షాన్ మార్ష్(8), ఉస్మాన్ ఖవాజా పరుగులేమీ చేయుకండా ఉన్నాడు.

Story first published: Wednesday, June 12, 2019, 18:03 [IST]
Other articles published on Jun 12, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X