శ్రీలంకపై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్

CWC 19, Sri Lanka vs West Indies: West Indies have won the toss and have opted to field

ప్రపంచకప్‌లో భాగంగా చెస్టర్ లీ స్ట్రీట్ వేదికగా మరికొద్ది సేపట్లో శ్రీలంక, వెస్టిండీస్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అనారోగ్యం కారణంగా స్టార్ పేసర్ కీమర్ రోచ్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో గాబ్రియేల్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు లంక మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

శ్రీలంక అనధికారికంగా ప్రపంచకప్‌ సెమీస్‌ రేస్‌ నుంచి నిష్క్రమించినా.. ఎదో మూల చిన్న ఆశ ఉంది. ఆ ఆశను అలాగే ఉంచుకోవాలంటే వెస్టిండీస్‌తో జరిగే పోరులో శ్రీలంక తప్పక గెలవాల్సిందే. శ్రీలంక ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, మూడు పరాజయాలు, రెండు మ్యాచ్‌లు రద్దవడంతో.. 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. జూన్ 6న టీమిండియాతో జరిగే మ్యాచ్‌ల్లోనూ తప్పకుండా గెలవాలి. అదే సమయంలో ఇంగ్లండ్‌, బంగ్లా, పాక్ తమ తదుపరి మ్యాచ్‌ల్లో ఓడాలి. అయినా సెమీస్ వెళ్లడం కష్టమే. మరోవైపు వెస్టిండీస్‌ అధికారికంగా సెమీస్‌ రేసు నిష్క్రమించింది.

ప్రపంచ కప్‌లో విండీస్, లంకలు మొత్తం 8 మ్యాచులు ఆడగా.. శ్రీలంక 3, వెస్టిండీస్ 4 గెలిచాయి. ఒక మ్యాచ్ రద్దయింది. ప్రస్తుతం చెస్టర్ లీ స్ట్రీట్లో మబ్బులు ఉన్నా వర్షం పడే అవకాశాలు తక్కువ. పిచ్ స్పిన్నర్లకు అనుకూలించనుంది.

Teams:

Sri Lanka (Playing XI): Dimuth Karunaratne(c), Kusal Perera(w), Avishka Fernando, Kusal Mendis, Angelo Mathews, Lahiru Thirimanne, Dhananjaya de Silva, Isuru Udana, Jeffrey Vandersay, Kasun Rajitha, Lasith Malinga.

West Indies (Playing XI): Chris Gayle, Sunil Ambris, Shai Hope(w), Nicholas Pooran, Shimron Hetmyer, Jason Holder(c), Carlos Brathwaite, Fabian Allen, Shannon Gabriel, Sheldon Cottrell, Oshane Thomas.

1
43682
1
8
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, July 1, 2019, 14:55 [IST]
Other articles published on Jul 1, 2019
POLLS

Get breaking news alerts from myKhel

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Mykhel sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Mykhel website. However, you can change your cookie settings at any time. Learn more