న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీలా రనౌట్ చేయబోయి ఫెయిలైన సర్ఫరాజ్

CWC 19, Pakistan vs Afghanistan: Pakistan Captain Sarfaraz Ahmed fails hilariously while trying to imitate MS Dhoni

ప్రస్తుత వికెట్ కీపర్‌లలో అత్యుత్తమ వికెట్ కీపర్‌ ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ. 2003 నుంచి భారత వికెట్ కీపర్‌గా ఎన్నో రికార్డులు సృష్టించాడు. యువ క్రికెటర్లు కూడా ధోనీని ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఎందుకంటే కీపింగ్‌లో ధోనీకి ప్రత్యేకమైన స్టైల్ ఉంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

వికెట్ల వెనుకాల ఎన్నో మాయలు చేసే ధోనీ.. వికెట్ వంక చూడకుండా కూడా బ్యాట్స్‌మన్‌ను రనౌట్ చేయగలడు. అంతేకాదు సెకండ్ల వ్యవధిలో స్టంప్ చేసేస్తాడు. మరోవైపు బ్యాట్స్‌మన్‌ను ఔట్ అయ్యాడా లేదా కూడా చెప్పేస్తాడు. ఇదే అతన్ని ప్రత్యేకంగా నిలిపింది. అయితే చాలా మంది ధోనీలా వికెట్ కీపింగ్ చేయబోయి విఫలమయ్యారు. తాజాగా ఈ జాబితాలో పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ కూడా చేరాడు.



ప్రపంచకప్‌లో భాగంగా శనివారం లీడ్స్ వేదికగా పాక్, అఫ్గానిస్థాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆఫ్గానిస్థాన్ ఇన్నింగ్స్ చివరి బంతికి సిపిన్నెర్ ముజీబ్ రెండు పరుగులు తీసేందుకు ప్రయత్నించాడు. అయితే ఫీల్డర్ బంతిని కీపర్ సర్ఫరాజ్‌కు అందించగా.. అతను వికెట్లను చూడకుండానే రనౌట్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ బంతికి వికెట్ల తాకకుండా వెళ్లడంతో బ్యాట్స్‌మెన్ రనౌట్ కాలేదు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. ధోనీలా రనౌట్ చేయబోయి ఫెయిలైన సర్ఫరాజ్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 'ధోనీలాట్రై చేయకు', 'అది నీవల్ల కాదు' అంటూ మండిపడుతున్నారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది. అనంతరం పాక్ 49.4 ఓవర్లలో 230 పరుగులు చేసి విజయం సాధించింది.

Story first published: Sunday, June 30, 2019, 18:28 [IST]
Other articles published on Jun 30, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X