న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కివీస్‌పై ఘన విజయం.. రేసులోనే పాక్

ICC Cricket World Cup 2019 : Pak Defeated New Zealand By Six Wickets || Oneindia Telugu
CWC 19, New Zealand vs Pakistan: Pakistan beat New Zealand by six wickets, boosting their semi-final hopes

బుధవారం జరిగిన పోరులో పాకిస్థాన్‌ 6 వికెట్ల తేడాతో జోరుమీదున్న న్యూజిలాండ్‌కు షాకిచ్చింది. దీంతో ప్రపంచకప్‌లో కివీస్‌కు తొలి పరాజయాన్ని చవిచూసింది. ఇక భారత్‌ చేతిలో పరాజయం తర్వాత పాక్ వరుసగా రెండో విజయం సాధించింది. షహీన్‌ అఫ్రిది (3/28), బాబర్‌ అజామ్‌ (101 నాటౌట్‌), హారిస్‌ సోహైల్‌ (68)లు పాక్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. టోర్నీలో మూడో విజయంతో పాక్ సెమీఫైనల్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఇంగ్లండ్, న్యూజిలాండ్‌ ఓటమి పాలవడంతో ప్రపంచకప్‌ రేసు రసవత్తరమవుతోంది. మిగతా జట్లను సెమీస్‌ చాన్స్‌ ఊరిస్తోంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

సాఫీగా పాక్ ఇన్నింగ్స్:

సాఫీగా పాక్ ఇన్నింగ్స్:

సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. మూడో ఓవర్లోనే ఓపెనర్ ఫఖర్‌ జమాన్‌ (9) పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్‌ ఇమాముల్‌ హక్‌ (19).. ఫెర్గూసన్‌ బౌలింగ్‌లో గప్టిల్‌ అద్భుత క్యాచ్‌తో నిష్క్రమించాడు. బాబర్‌ ఆజమ్‌కు హఫీజ్‌ (50 బంతుల్లో 32; 5 ఫోర్లు) జత కలవడంతో స్కోరు బోర్డు సాఫీగా సాగింది. మరో వికెట్‌ పడకుండా 22.5 ఓవర్లలో పాకిస్తాన్‌ 100 పరుగులు చేసింది. ఈ జోడీ బలపడిన దశలో కెప్టెన్‌ విలియమ్సన్‌ బౌలింగ్‌కు దిగి హఫీజ్‌ వికెట్‌ను తీసాడు.

బాబర్‌ సెంచరీ:

బాబర్‌ సెంచరీ:

అనంతరం సొహైల్‌.. బాబర్‌కు జతయ్యాడు. సొహైల్‌ కూడా చక్కగా ఆడటంతో ఇన్నింగ్స్‌ సాగిపోయింది. అతని అండతో బాబర్‌ 65 బంతుల్లో తన అర్ధ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. మరోవైపు సొహైల్‌ కూడా వేగం పెంచాడు. 36వ ఓవర్లో జట్టు స్కోరు 150కి చేరింది. హరిస్‌ 61 బంతుల్లో అర్ధ సెంచరీ చేస్తే.. బాబర్‌ 124 బంతుల్లో సెంచరీ (101 నాటౌట్‌; 127 బంతుల్లో 11×4) సాధించాడు. లక్ష్యానికి 2 పరుగుల దూరంలో సొహైల్‌ (68; 76 బంతుల్లో 5×4, 2×6) రనౌటవ్వగా.. మిగతా లాంఛనాన్ని సర్ఫరాజ్‌ (5 నాటౌట్‌) పూర్తి చేశాడు. లక్ష్యాన్ని పాకిస్థాన్‌ 49.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది.

ఆదిలోనే షాక్:

ఆదిలోనే షాక్:

మొదటగా టాస్‌ నెగ్గిన న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. పిచ్‌పై తేమ, ఔట్‌ ఫీల్డ్‌ మందకొడిగా ఉండటం పాక్‌ బౌలర్లు చెలరేగారు. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ వేసిన ఆమిర్‌ గప్టిల్‌ (5)ను బౌల్డ్‌ చేయగా.. రెండు బౌండరీలతో ఊపుమీదున్న మున్రో (12)ను, రాస్‌ టేలర్‌ (3)ను షాహిన్‌ ఆఫ్రిది తన వరుస ఓవర్లలో పెవిలియన్‌ చేర్చాడు. 38 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కివీస్ కష్టాల్లో పడింది. కాసేపటికే లాథమ్‌ (1)ను కూడా షాహినే ఔట్‌ చేశాడు.

నీషమ్‌ సూపర్ ఇన్నింగ్స్:

నీషమ్‌ సూపర్ ఇన్నింగ్స్:

ఈ దశలో కెప్టెన్‌ విలియమ్సన్, నీషమ్‌ జోడీ వికెట్ల పతనాన్ని అడ్డుకుంది. ఈ జోడి కొద్దిసేపు ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపారు. జట్టు కుదురుకుంటున్న దశలో విలియమ్సన్‌ (69 బంతుల్లో 41; 4 ఫోర్లు) ఔట్‌ కావడంతో.. 83 పరుగులకే కివీస్‌ సగం వికెట్లను చేజార్చుకుంది. అనంతరం నీషమ్, గ్రాండ్‌హోమ్‌ కివీస్ ఇన్నింగ్స్ ను నిర్మించారు. ఆరో వికెట్‌కు 132 పరుగులు జోడించాక గ్రాండ్‌హోమ్‌ (64; 71 బంతుల్లో 6×4, 1×6) రనౌట్ అయ్యాడు. చివరి బంతికి నీషమ్‌ (97 నాటౌట్‌; 112 బంతుల్లో 5×4, 3×6) సిక్స్ కొట్టి సెంచరీకి 3 పరుగుల దూరంలో నిలిచాడు. కివీస్‌ 6 వికెట్లకు 237 పరుగులే చేయగలిగింది. షహీన్‌ అఫ్రిది మూడు వికెట్లు తీసాడు.

1
43676

{headtohead_cricket_4_5}

Story first published: Thursday, June 27, 2019, 7:39 [IST]
Other articles published on Jun 27, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X