న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ ఆర్జనలో ఎంఎస్ ధోనీనే టాప్.. 13 ఏళ్లలో ఎంత తీసుకున్నాడో తెలుసా?

CSK skipper MS Dhoni highest paid player in IPL history, earned over ₹137 crore

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అంటేనే అందరిపై కాసుల వర్షం కురుస్తుంటుంది. బీసీసీఐ, ప్రసారకర్తలకు భారీ ఆదాయం రానుండగా.. ఆటగాళ్లను కూడా రాత్రికిరాత్రే కోటేశ్వరులను చేస్తోంది. గత 3-4 ఏళ్లుగా యువ ఆటగాళ్లపై కూడా కాసుల వర్షం కురుస్తోంది. ఇక ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి స్టార్ క్రికెటర్ల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం బ్యాట్స్‌మన్‌ మాత్రమే కాకుండా.. సారథులుగా ఉండడంతో వారికి ఏడాదికి కోట్లు అందుతున్నాయి. ముఖ్యంగా టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీకి. ఈ 13 ఏళ్లలో మహీ ఎంత తీసుకున్నాడో చూద్దాం.

2008లో రూ.6 కోట్లు:

2008లో రూ.6 కోట్లు:

2008 నుంచి ఐపీఎల్ జరుగుతున్న విషయం తెలిసిందే. మొదటి ఏడాదికి రూ.6 కోట్లు తీసుకున్న ఎంఎస్ ధోనీ.. ఐపీఎల్ 2020 సీజన్ వరకల్లా రూ.15 కోట్లు తీసుకున్నాడు. ఐపీఎల్ 2008 సీజన్ వేలంలో రూ.6 కోట్లకి ధోనీని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది. మూడేళ్లు అదే ధరకి కొనసాగాడు. 2011 నుంచి 13 వరకు రూ.8. కోట్లు ఆర్జించాడు. 2014 నుంచి 2017 వరకూ రూ. 12.5 కోట్లు తీసుకున్నాడు. ఫిక్సింగ్ కారణంగా 2016, 2017 సీజన్‌లో చెన్నై జట్టుపై నిషేధం పడటంతో.. ఆ రెండేళ్లు రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్‌కి ధోనీ ఆడాడు.

రూ.137 కోట్లు:

రూ.137 కోట్లు:

2018లో మళ్లీ ఐపీఎల్‌లోకి చెన్నై సూపర్ కింగ్స్ రీఎంట్రీ ఇవ్వగా.. ఎంఎస్ ధోనీ ధర రూ.15 కోట్లకి పెరిగింది. అప్పటి నుంచి అదే ధరకి కొనసాగుతున్నాడు. మొత్తంగా ఇప్పటి వరకూ 13 ఐపీఎల్ సీజన్లు ముగియగా.. ఐపీఎల్ ఒప్పందాల ద్వారా మహీ రూ.137 కోట్లు ఆర్జించాడు. ఐపీఎల్‌లో గత మూడేళ్ల నుంచి ఏటా రూ.17 కోట్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ నుంచి తీసుకుంటున్న విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ రూ.126 కోట్లు ఆర్జించాడు. రూ.131కోట్లతో రోహిత్ శర్మ కోహ్లీ కంటే ఎక్కువ తీసుకుంటున్నాడు. రోహిత్ కూడా గత మూడేళ్ల నుంచి ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ నుంచి రూ.15 కోట్లు తీసుకుంటున్నాడు. గతేడాది వరకు ఎండార్స్ మెంట్స్, బీసీసీఐ నుంచి కూడా ధోనీకి భారీ మొత్తంలో అందేది.

7వ స్థానంలో చెన్నై:

7వ స్థానంలో చెన్నై:

ఏటా ఘనంగా నిర్వహించే టీ20 మెగా క్రికెట్‌ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఇలా ప్లేఆఫ్స్‌కు చేరకపోవడం ఇదే తొలిసారి. 2016, 2017 సీజన్లు మినహాయిస్తే.. మిగతా పది సీజన్లలోనూ చెన్నై అదరగొట్టింది. ప్రతిసారి ప్లేఆఫ్స్‌, సెమీస్‌ లేదా ఫైనల్స్‌ చేరిన ఏకైక జట్టుగా నిలిచింది. మరీ ముఖ్యంగా 2010, 2011, 2018 సీజన్లలో ఛాంపియన్‌గా అవతరించింది. గతేడాది సైతం ఫైనల్స్‌ చేరి చివరి బంతికి ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది. అయితే తొలిసారి ఇప్పుడిలా దారుణంగా విఫలమైంది. చెత్త ప్రదర్శనతో ఐపీఎల్ 2020ని 7వ స్థానంతో ముగించింది.

 ఐపీఎల్ 2020లో విఫలం:

ఐపీఎల్ 2020లో విఫలం:

ఐపీఎల్ 2020లో ఎంఎస్ ధోనీ పూర్తిగా నిరాశపరిచాడు. మహీ నాయక్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మొదటిసారి ప్లేఆఫ్స్‌కు చేరలేదు. కెప్టెన్ ధోనీ గతంలోలా కాకుండా నెమ్మదిగా ఆడి విమర్శలు ఎదుర్కొన్నాడు. సారథ్యంలో కూడా తేలిపోయాడు. దీంతో ఐపీఎల్ 2021కి ఆ జట్టు జయమాన్యం ప్రక్షాళన చేయనుంది. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో జరగనున్న మెగా వేలం కోసం చెన్నై ఆసక్తిగా ఎదురు చూస్తోందనడంలో సందేహం లేదు. వయసు మీద పడిన ఆటగాళ్లను వదిలేసుకొని యువ ఆటగాళ్లను జట్టులోకి తీసుకునేందుకు ప్లాన్ వేసింది. ఐపీఎల్ 2020 ఆడుతానని మహీ స్పష్టం చేశాడు. అయితే వచ్చే సీజన్ తర్వాత ధోనీ ఐపీఎల్‌లోనూ ఆడే అవకాశాలు లేవు.

వాణిజ్య ప్రకటనల ఒప్పందాలకు దూరం:

వాణిజ్య ప్రకటనల ఒప్పందాలకు దూరం:

అంతర్జాతీయ క్రికెట్‌కు గత ఆగస్టులో వీడ్కోలు పలికిన ఎంఎస్ ధోనీ.. సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. కరోనా సమయంలో 'మహర్షి'లా తన పొలం పనులు చేసుకున్న ధోనీ.. తాత్కాలికంగా వాణిజ్య ప్రకటనల ఒప్పందాలకు దూరంగా ఉంటున్నాడు. అయితే సేంద్రీయ వ్యవసాయానికి మాత్రం బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారనున్నాడు. అంతేకాదు తన సొంత సేంద్రీయ ఎరువు బ్రాండ్‌ను ధోనీ త్వరలో మార్కెట్లోకి విడుదల చేయనున్నాడు. ధోనీకి సుమారు 50-70 ఎకరాల పొలం ఉంది. రాంచీలోని తన వ్యవసాయక్షేత్రంలో పుచ్చ కాయలు, బొప్పాయి పంటని కూడా పండించాడు.

వైరల్‌ వీడియో.. సిక్స్‌తో బుమ్రా హాఫ్‌ సెంచరీ.. ఇదే తొలిసారి!!

Story first published: Friday, December 11, 2020, 16:11 [IST]
Other articles published on Dec 11, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X