తొలి ఫస్ట్‌క్లాస్ హాఫ్ సెంచరీ:
ఆస్ట్రేలియా-ఎతో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా అర్థ శతకం నమోదు చేశాడు. 57 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లలతో 55 రన్స్ చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్ విల్ సదర్‌లాండ్ బౌలింగ్ సిక్స్ కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది బుమ్రాకు తొలి ఫస్ట్‌క్లాస్ హాఫ్ సెంచరీ కావడం విశేషం. స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ తరహాలోనే బుమ్రా షాట్లు ఆడాడు. ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి అద్భుత షాట్లు ఆడాడు. ప్రస్తుతం బుమ్రా కొట్టిన సిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. బుమ్రాపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రాణించిన గిల్, షా:
ఆస్ట్రేలియా గడ్డపై తొలి పింక్ బాల్ పరీక్షలో టీమిండియా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. ఆస్ట్రేలియా ఎతో జరుగుతున్న 3 రోజుల డేనైట్ ప్రాక్టీస్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 194 పరుగులకే ఆలౌటైంది. తొలి రోజు ఆటలో భాగంగా భారత్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా బ్యాటింగ్‌ను పృథ్వీ షా, మయాంక్ అగర్వాలు ఆరంభించారు. మయాంక్ త్వరగానే పెవిలిన్ బాట పట్టగా.. పృథ్వీ షా (40) రాణించాడు. అనంతరం శుబ్‌మన్ గిల్(43) కూడా మెరిశాడు. ఓపెనింగ్ రేసులో ఉన్న గిల్, షా ఇద్దరూ రాణించారు. దీంతో పోటీ కాస్త పెరిగింది.
బుమ్రా హాఫ్ సెంచరీ:
మధ్యలో ఆసీస్ బౌలర్లు పుంజుకోవడంతో వరుసగా ఆరుగురు భారత ఆటగాళ్లు విఫలం అయ్యారు. హనుమ విహారి (15), అజింక్య రహానే (4), రిషబ్ పంత్ (5), వృద్ధిమాన్ సాహా (0) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఒక దశలో 123 పరుగులకే 9 వికెట్లు కోల్పోగా.. చివరి వికెట్‌కు బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ 71 పరుగులు జోడించడం విశేషం. బుమ్రా మాత్రం ఆత్మ విశ్వాసంతో ఆడాడు. సిరాజ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.దీంతో ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. ఈ క్రమంలోనే బుమ్రా హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. సదర్‌లాండ్ బౌలింగ్లో సిక్స్ కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బుమ్రా హాఫ్ సెంచరీ సాధించిన కాసేపటికి సిరాజ్(22) పదో వికెట్‌గా ఔట్ కావడంతో టీమిండియా ఇన్నింగ్స్ ముగిసింది. ఆస్ట్రేలియా ఎ బౌలర్లలో సీన్ అబాట్, జాక్ వైల్డర్‌మూత్ చెరో 3 వికెట్లు తీశారు.


Click it and Unblock the Notifications
