న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీకి నచ్చిన ఫుట్‌బాల్‌ ఆటగాడు ఎవరో తెలుసా?!!

Cristiano Ronaldo vs Lionel Messi: Virat Kohli is himself a fan of Cristiano Ronaldo

హైదరాబాద్: ప్రస్తుత క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్న టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని ప్రపంచ వ్యాప్తంగా ఎందరో అభిమానులు ఆరాధిస్తారు. అతడి ఆటను ఎందరో మాజీలు ఎంజాయ్ చేస్తారు. ఈ విషయాన్ని వారు బహిరంగంగానే చెప్పారు. అంతటి ఫాలోయింగ్ ఉన్న విరాట్ కోహ్లీ కూడా ఇష్టపడే ఆటగాడు ఉన్నాడు. అయితే ఆ ఆటగాడు క్రికెట్‌కు సంబందించిన వ్యక్తి కాదు. ఫుట్‌బాల్‌ ఆటగాడు.

<strong>PAk vs SL: బాబర్‌ ఆజమ్‌ సూపర్ సెంచరీ.. కోహ్లీ రికార్డు బద్దలు!!</strong>PAk vs SL: బాబర్‌ ఆజమ్‌ సూపర్ సెంచరీ.. కోహ్లీ రికార్డు బద్దలు!!

 క్రికెట్‌తో పాటు ఫుట్‌బాల్‌ కూడా ఇష్టమే

క్రికెట్‌తో పాటు ఫుట్‌బాల్‌ కూడా ఇష్టమే

విరాట్‌ కోహ్లీకి క్రికెట్‌తో పాటు ఫుట్‌బాల్‌ కూడా చాలా ఇష్టం. స్టార్ ఆటగాళ్లు క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్‌ మెస్సీలు కోహ్లీ ఫేవరెట్‌ ఆటగాళ్లు. అయితే ఇద్దరిలో ఒకరిని ఎంచుకోమంటే మాత్రం క్రిస్టియానో రొనాల్డోకే ఓటేశాడు. రొనాల్డోలా నిబద్ధత కలిగిన ఆటగాడిని ఎప్పుడూ చూడలేదని కోహ్లీ పేర్కొన్నాడు. మరోవైపు మెస్సీ కూడా అద్భుత ఆటగాడు అని కితాబిచ్చాడు.

రొనాల్డో ప్రత్యేక ఆటగాడు

రొనాల్డో ప్రత్యేక ఆటగాడు

తాజాగా విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... 'రొనాల్డో కాళ్ల కదలిక అమోఘంగా ఉంటుంది. అతడికన్నా అత్యుత్తమంగా గోల్‌ సాధించే ఆటగాళ్లని చూడలేదు. ఫుట్‌బాల్‌ క్రీడను రొనాల్డో పూర్తిగా మార్చాడు. అందరూ అతడిని అనుసరిస్తున్నారు. అతడో ప్రత్యేక ఆటగాడు. రొనాల్డో, మెస్సీలో ఫేవరెట్‌ ఆటగాడిని ఎంచుకోవడం కష్టమే. కానీ.. రొనాల్డో ఓ అడుగు ముందంజలో ఉన్నాడు' అని తెలిపాడు.

'మెస్సీ కూడా అద్భుత ఆటగాడు

'మెస్సీ కూడా అద్భుత ఆటగాడు

'మెస్సీ కూడా అద్భుత ఆటగాడు. అతడిది సహజంగా వచ్చిన టాలెంట్‌. మెస్సీలా మరో ఆటగాడు ఎవరూ లేరు. వ్యక్తిగతంగా రొనాల్డో సామర్థ్యం, సంకల్పం నచ్చుతుంది. ఆటలోని ప్రతి నిమిషం పోరాడేందుకు అతడు సిద్ధపడతాడు. రొనాల్డో అత్యుత్తమ స్థాయిలో ఆడతాడు, మరే ఆటగాడికీ దృఢ సంకల్పం ఉండదు. ఫిట్‌నెస్‌ విషయంలో ఫుట్‌బాల్‌ ఆటగాళ్లే ప్రేరణ' అని కోహ్లీ పేర్కొన్నాడు.

ఫుట్‌బాలర్లను చూసి నేర్చుకుంటాం

ఫుట్‌బాలర్లను చూసి నేర్చుకుంటాం

'మేం ఎప్పుడూ ఫుట్‌బాలర్ల క్రమశిక్షణను గమనిస్తుంటాం. ఇది మాకు అవసరం. మైదానంలోకి వెళ్లి ఆడాలంటే ఫిట్‌నెస్‌ చాలా ముఖ్యం. ఫిట్‌నెస్‌, పోషకాహారం, విశ్రాంతి తదితర అంశాల్లో ఫుట్‌బాల్‌ ఆటగాళ్లు ఎంతో ప్రొఫెషనల్‌గా ఉంటారు. మేం వారిని చూసి నేర్చుకుంటాం. క్రికెట్‌, ఫుట్‌బాల్‌ను అస్సలు పోల్చలేం. అయితే ఫాస్ట్ బౌలర్ల శ్రమను మాత్రం పోల్చొచ్చు. క్రికెటర్ల కన్నా ఫుట్‌బాలర్లు ఎక్కువ ఫిట్‌నెస్‌తో ఉంటారు. పుట్‌బాలర్ల స్థాయిలో దృఢంగా ఉండేందుకు క్రికెటర్లు ప్రయత్నించాలి' అని కోహ్లీ ఇంతకుముందు తెలిపాడు.

Story first published: Tuesday, October 1, 2019, 10:24 [IST]
Other articles published on Oct 1, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X