అసలేం జరుగుతోంది?: మాంచెస్టర్ ఉగ్రదాడిపై క్రికెటర్లు
హైదరాబాద్: ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌లో మంగళవారం తెల్లవారుజూమున జరిగిన ఉగ్ర దాడిపై ప్రపంచ వ్యాప్తంగా క్రికెటర్లు ఖండించారు. ట్విట్టర్ వేదికగా పలువురు క్రికెటర్లు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. అమెరికా పాప్‌స్టార్ అరియానా గ్రాండే కన్సర్ట్ జరుగుతున్న వేదికకు అతి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ ఘటనలో ఇప్పటివరకు 22 మంది మృతిచెందగా 59 మంది వరకు గాయపడ్డారు. భారీ తీవ్రత కలిగిన పేలుడు పదార్థాలతో ఓ వ్యక్తి సంగీత కచేరి వెలుపల ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు లండన్ పోలీసులు తెలిపారు. దాడి చేసిన వ్యక్తి మృతదేహాన్ని ఘటనాస్థలంలో పోలీసులు గుర్తించారు.

సోమవారం రాత్రి 10.35 గంటలకు పేలుడు సంభవించినట్లు గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు వెల్లడించారు. ఈ దాడిలో పాప్ సింగర్ అరియానాకు ఎలాంటి ప్రమాదం జరగలేదని, ఆమె క్షేమంగా ఉన్నారని ఆమె ప్రతినిధి ప్రకటించారు.
అరియానా కన్సర్ట్‌ను వీక్షించేందుకు ఇరవై వేల మందికి పైగా అభిమానులు హాజరయ్యారు. వీరిలో చాలా మంది 6 నుంచి 20 సంవత్సరాల వయసు ఉన్నవారే. అయితే బాంబు వేదిక వెలుపల పేలడంతో పెను ప్రమాదం తప్పిందని పోలీసులు చెబుతున్నారు. ఘటనపై బ్రిటన్ ప్రధాని థెరిసా మే తీవ్రంగా ఖండించారు.
ఈ ఉగ్రఘటనపై క్రికెటర్ల స్పందన ఇలా:
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications