న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్‌కప్: షాయ్‌ హోప్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌ చూశారా? (వీడియో)

ICC World Cup 2019: Shai Hope Takes A Stunning Catch To Send Babar Azam Back
Cricket World Cup 2019: West Indies Vs Pakistan: Shai Hope takes a stunner to get rid Babar Azam - Watch

హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా గురువారం ప్రారంభమైన 12వ ఎడిషన్ వన్డే వరల్డ్‌కప్ అభిమానులకు అసలైన క్రికెట్ మజాను పంచుతుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో బెన్ స్టోక్స్ ఆల్ రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకోగా... శుక్రవారం విండిస్ బౌలర్లు సమిష్టిగా రాణించి పాకిస్థాన్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ముఖ్యంగా మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఆల్ రౌండర్లు అద్భుత ప్రదర్శన చేశారు. అటు బౌలింగ్‌లోనూ ఇటు బ్యాటింగ్‌లోనూ సత్తా చాటారు. ఆరంభ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ పట్టిన క్యాచ్‌ని మాజీ క్రికెటర్లు 'క్యాచ్‌ ఆఫ్‌ ది సెంచరీ'గా అభివర్ణిస్తుండగా... పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో విండిస్ ఆటగాళ్లు అద్భుత ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నారు.

షాయ్‌ హోప్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌

షాయ్‌ హోప్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌

ముఖ్యంగా వెస్టిండిస్ వికెట్ కీపర్ షాయ్‌ హోప్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌తో పాక్ ప్రధాన ఆటగాడు బాబర్‌ ఆజమ్‌ను ఔట్ చేసిన తీరు మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. ఇన్నింగ్స్ 14వ ఓవర్‌లో థామస్‌ వేసిన ఓట్‌ స్వింగర్‌ బాబర్‌ బ్యాట్‌ అంచుకు తాకి పైకి లేవడంతో కీపర్‌ హోప్‌ అమాంతం తన కుడివైపునకు సమాంతరంగా డైవింగ్‌ చేస్తూ మెరుపు వేగంతో పట్టేశాడు.

బాబర్ అజామ్ ఔట్ కావడంతో

బాబర్ అజామ్ ఔట్ కావడంతో

మ్యాచ్ ఆరంభంలోనే బాబర్ అజామ్ ఔట్ కావడంతో పాకిస్థాన్ స్కోరు బోర్డుపై తీవ్ర ప్రభావం చూపింది. ఇందుకు సంబంధించిన వీడియోని ఐసీసీ తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తోలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ 21.4 ఓవర్లకు 105 పరుగులకు కుప్పకూలింది. తద్వారా వరల్డ్‌కప్ చరిత్రలో రెండో అత్యల్ప స్కోరుని నమోదు చేసింది.

షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కొవడంలో

షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కొవడంలో

ఓపెనర్‌ ఇమాముల్‌ హక్‌(2) పరుగులకే పెవిలియన్‌ చేరాడు. దీంతో జట్టు స్కోరు 17 పరుగుల వద్ద పాక్ తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఫకార్‌ జమాన్‌(22), హరీస్‌ సోహైల్‌(8), బాబర్‌ అజమ్‌(22), సర్పరాజ్‌ అహ్మద్‌(8) వెనువెంటనే వికెట్లను కోల్పోయింది. విండీస్‌ బౌలర్లు వేసిన షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కొవడంలో విఫలమయ్యారు.

నాలుగు వికెట్లు తీసిన ఒషాన్‌ థామస్‌

నాలుగు వికెట్లు తీసిన ఒషాన్‌ థామస్‌

చివర్లో వాహబ్‌ రియాజ్‌ 11 బంతుల్లో 18 (1 ఫోర్‌, 2 సిక్సర్లు) ఫరవాలేదనిపించడంతో పాకిస్థాన్ కనీసం వంద పరుగుల మార్కుని సైతం అందుకోగలిగింది. వెస్టిండిస్ జట్టులో ఒషాన్‌ థామస్‌ నాలుగు వికెట్లు తీయగా జాసన్‌ హోల్డర్‌ మూడు వికెట్లతో చెలరేగాడు. ఆండ్రీ రసెల్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన విండిస్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

విండిస్‌కు విజయాన్ని కట్టబెట్టిన గేల్

విండిస్‌కు విజయాన్ని కట్టబెట్టిన గేల్

వెస్టిండిస్ 13.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసి అలవోక విజయాన్ని నమోదు చేసింది. వెస్టిండిస్ జట్టులో క్రిస్ గేల్ 34 బంతుల్లో 50(6 ఫోర్లు, 3 సిక్సులు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. విండీస్ 46 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన దశలో ఓపెనర్ క్రిస్ గేల్ నిలకడగా ఆడి విండిస్‌కు విజయాన్ని కట్టబెట్టాడు. నికోలస్ పూరన్ 19 బంతుల్లో 34 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

Story first published: Saturday, June 1, 2019, 12:32 [IST]
Other articles published on Jun 1, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X