న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఒకే ఓవర్‌లో ఆరు సిక్సులు: బర్త్ డే బాయ్ యువరాజ్ మైలురాళ్లివే

Cricket Fans Celebrate Yuvraj Singhs Birthday With Nostalgia and Six Sixes

హైదరాబాద్: టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ బుధవారం 37వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. టీమిండియాకు రెండు ప్రపంచకప్‌లు(వరల్డ్ టీ20, వన్డే వరల్డ్ కప్) అందించడంలో కీలకపాత్ర పోషించిన యువరాజ్ సింగ్‌కు సోషల్ మీడియాలో పలువురు ప్రస్తుత, మాజీ క్రికెటర్లు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

18 ఏళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి అనతికాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని యువరాజ్ కల్పించుకున్న సంగతి తెలిసిందే. కెరీర్ తొలినాళ్లలో ఫినిషర్‌గా, ఆ తర్వాత మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గా... ఆల్‌రౌండర్‌గా భారత జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. యువీ బర్త్‌డే సందర్భంగా కొన్ని మైలురాళ్లు మీకోసం...

2011 వన్డే వరల్డ్‌కప్

సొంతగడ్డపై జరిగిన 2011 వన్డే వరల్డ్ కప్‌లో యువరాజ్ సింగ్ అద్భుతమైన ఫామ్‌ని ప్రదర్శించాడు. ఈ వరల్డ్‌కప్‌లో మొత్తం 362 పరుగులు(ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు) చేసి మ్యాన్ ఆఫ్ ద టోర్నీ అవార్డుని సైతం దక్కించుకున్నాడు. టోర్నీలో భాగంగా మొత్తం 9 మ్యాచ్‌లాడిన యువరాజ్ 90 యావరేజితో పరుగులు సాధించడం విశేషం. అంతేకాదు ఈ టోర్నీలో యువరాజ్ 15 వికెట్లు కూడా పడగొట్టాడు.

2007 టీ20 వరల్డ్‌కప్

యువీ పేరు చెప్పగానే చాలామందికి గుర్తొచ్చేది ఆరు సిక్సర్లు. ఈ ఆరు సిక్సర్లను ఈ టీ20 వరల్డ్ కప్‌లోనే యువీ సాధించాడు. 2007లో జరిగిన తొలి టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్‌పై యువరాజ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. డర్బన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో 6 బంతుల్లో 6 సిక్సర్లు బాది క్రికెట్ ప్రపంచాన్ని అవాక్కయేలా చేశాడు. కేవలం 12 బంతుల్లోనే అంతర్జాతీయ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేసి చరిత్ర సృష్టించాడు.

మూడు వరల్డ్‌కప్‌లు గెలిచిన జట్టులో సభ్యుడిగా

ఐసీసీ నిర్వహించే మూడు వరల్డ్ కప్‌ల్లో సభ్యుడిగా ఉన్న ఏకైక భారత ఆటగాడు యువరాజ్ సింగే కావడం విశేషం. 2000లో ఐసీసీ నిర్వహించిన అండర్-19 వరల్డ్ కప్‌ విజేతగా భారత్ నిలవడంలో యువరాజ్ కీలకాపత్ర పోషించాడు. ఆ తర్వాత జాతీయ జట్టుకు ఎంపికైన యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌లో అంచనాలకు మించి భారత అభిమానుల మనసు గెలుచుకున్న సంగతి తెలిసిందే.

ఎన్నో చిరస్మరణీయ మ్యాచ్‌లలో యువీ పాత్ర

భారత క్రికెట్ జట్టు సాధించిన ఎన్నో చిరస్మరణీయ మ్యాచ్‌లలో యువరాజ్ తన బ్యాట్ తో ముఖ్య పాత్ర పోషించాడు. 2011 ప్రపంచకప్ విజయంలో యువరాజ్ పాత్ర అపూర్వమైనది. 2000 ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై టీమిండియా సాధించిన విజయంతో యువరాజ్ మెరిశాడు. నాట్ వెస్ట్ ఫైనల్ లో యువరాజ్ ఆట భారత క్రికెట్‌ను కొత్త హైట్స్‌కు తీసుకెళ్లింది. 2003 ప్రపంచకప్‌లో పాక్‌పై విజయంలో యువరాజ్ ఫినిషింగ్ టచ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇలా చెబుతూ పోతే.. టీమిండియా విజయంలో యువరాజ్ కీలక పాత్ర పోషించిన మ్యాచ్ లు, ఒంటి చేత్తో గెలిపించిన మ్యాచ్‌లు ఎన్నో ఉన్నాయి.

క్యాన్సర్‌ను జయించిన తీరు

ఏప్రిల్ 2, 2011న యువీకి క్యాన్సర్ ఉందని గుర్తించారు. శస్త్రచికిత్స అవసరం లేదనడంతో ఊపిరి పీల్చుకున్న యువరాజ్ సింగ్‌కు మూడు దశలుగా కీమోథెరపీ చికిత్స అందించారు. ఈ విధంగా యువీ క్యాన్సర్‌ను జయించాడు. క్యాన్సర్‌ను జయించిన అనంతరం క్యాన్సర్ బాధితులకు అండగా నిలవాలని యువరాజ్ అనుకున్నాడు. ఇందులో భాగంగా ‘యువీకెన్' పేరుతో ఒక ఫౌండేషన్ స్థాపించి.. దాని ద్వారా అందరికీ అవగాహన కల్పిస్తున్నాడు. క్యాన్సర్ ను జయించిన తర్వాత అతను చేస్తున్న కార్యక్రమాలను అభినందిస్తూ లెటర్ రాశారు మోడీ.

ఐపీఎల్‌ 2019లో సత్తా చాటేందుకు సిద్ధమైన యువరాజ్

గతేడాది జూలైలో యువీ చివరిసారి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ప్రస్తుతం రంజీ క్రికెట్‌లో పంజాబ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ ఏడాది ముగిసిన విజయ్ హజారే ట్రోఫీలో 7 మ్యాచ్‌లు ఆడిన యువరాజ్ సింగ్ పేలవంగా 264 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. దీంతో.. దేవధర్ ట్రోఫీలో అతనికి సెలక్టర్లు చోటివ్వలేదు. దీనికి తోడు.. ఇప్పుడు ఐపీఎల్ జట్టు కూడా విడిచిపెట్టడంతో.. ఫామ్ నిరూపించుకుని డిసెంబరులో జరగనున్న ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలో ఫ్రాంఛైజీలు దృష్టిలో పడేందుకు ఈ వెటరన్ ఈ ఆల్‌రౌండర్‌ సిద్ధమైయ్యాడు.

Story first published: Wednesday, December 12, 2018, 14:17 [IST]
Other articles published on Dec 12, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X