న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రెడిట్ మొత్తం భారత్‌కే చెందుతుంది: తొలి టీ20 ఓటమిపై విలియమ్సన్

Credit to India for the way they played: Kane Williamson after Auckland T20I defeat

హైదరాబాద్: రెండో టీ20లో తాము అన్ని రంగాల్లో మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉందని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అన్నాడు. తాము నిర్దేశించిన స్కోరు తక్కువేమీ కాదని, కానీ దానిని కాపాడుకోవడం సాధ్యం కాలేదని అన్నాడు. ఆక్లాండ్ వేదికగా శుక్రవారం టీమిండియాతో జరిగిన తొలి టీ20లో న్యూజిలాండ్ 6 వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే.

ఈ ఓటమితో ఐదు టీ20ల సిరిస్‌లో ఆతిథ్య జట్టు 0-1తో వెనుకబడింది. తొలి టీ20 ఓటమిపై మ్యాచ్ అనంతరం కేన్ విలియమ్సన్ మీడియాతో మాట్లాడుతూ "ఈ మ్యాచ్‌లో చాలా పాజిటివ్‌లు ఉన్నాయి. టార్గెట్‌ను డిఫెండ్ చేసుకోవడం చాలా కష్టం, ఎందుకంటే ఇక్కడ కొంచెం మంచు ఉంది. ఇక్కడ మేము 200 కంటే ఎక్కువ స్కోర్ చేయాల్సి ఉందని మాకు తెలుసు" అని తెలిపాడు.

ఎందుకంటే!: టీ20ల్లో టీమిండియాపై 200 స్కోరు సైతం సురక్షితం కాదు!ఎందుకంటే!: టీ20ల్లో టీమిండియాపై 200 స్కోరు సైతం సురక్షితం కాదు!

"క్రెడిట్ మొత్తం టీమిండియాకే దక్కుతుంది. మా పేస్ బౌలింగ్‌ విభాగం బాగానే ఉన్నప్పటికీ ప్రణాళికల్ని కచ్చితంగా అమలు చేయడంలో బౌలర్లు విఫలం చెందారు. భారత్‌ ఆటగాళ్లు మాకు ఏ సమయంలోనూ అవకాశం ఇవ్వలేదు. ఎదురుదాడికి దిగి తమను ఒత్తిడిలోకి నెట్టారు. కానీ, మేము వికెట్లు తీసే మార్గాలు వెతకాల్సింది" అని కేన్ విలియమ్సన్ అన్నాడు.

"భారత జట్టులో ప్రతీ బ్యాట్స్‌మన్‌ భాగస్వామ్యాలు నమోదు చేస్తూ ఎక్కడా రన్‌ రేట్‌ తగ్గకుండా చూసుకున్నారు. తదుపరి మ్యాచ్‌లో అన్ని రంగాల్లో మెరుగవాల్సి ఉంది" అని విలియమ్సన్ అన్నాడు. న్యూజిలాండ్‌ నిర్దేశించిన 204 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 6 బంతులు ఉండగానే కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

మా గెలుపుకు అదే కారణం.. మేం అందులో మెరుగవ్వాలి : కోహ్లీమా గెలుపుకు అదే కారణం.. మేం అందులో మెరుగవ్వాలి : కోహ్లీ

మొదటగా ఓపెనర్ లోకేశ్ రాహుల్ (56), కెప్టెన్ విరాట్ కోహ్లీ (45) చెలరేగగా.. ఇన్నింగ్స్ చివరలో యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ (58) ఆకాశమే హద్దుగా రెచ్చిపోవడంతో టీమిండియా భారీ లక్ష్యాన్నిఛేదించింది. కివీస్ బౌలర్లలలో ఇష్ సోధి రెండు వికెట్లు సాధించాడు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఆదివారం జరగనుంది.

Story first published: Friday, January 24, 2020, 18:49 [IST]
Other articles published on Jan 24, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X