న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

62 బంతుల్లో 116 పరుగులు: క్రిస్‌గేల్ మెరుపు సెంచరీ.. అయినా ఓడిన జమైకా!! (వీడియో)

CPL 2019: Chris Gayles super century in Vain as Patriots Complete Highest Ever CPL Chase


సెయింట్ కిట్స్: సొంత గడ్డపై కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో విండీస్ డాషింగ్ ఓపెనర్ క్రిస్‌గేల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సీపీఎల్‌లో జమైకా తలావాస్ జట్టు తరపున ఆడుతున్న ఈ విధ్వంసకర ఓపెనర్ 62 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్సర్లతో 116 పరుగులు చేసాడు. గేల్ ఇంతలా విధ్వంసం సృష్టించినా తలావాస్ మాత్రం గట్టెక్కలేకపోయింది.

ఉమెన్స్‌ ఆసియా కప్.. భారత్-ఏ జట్టులో ముగ్గురు తెలుగమ్మాయిలు!!ఉమెన్స్‌ ఆసియా కప్.. భారత్-ఏ జట్టులో ముగ్గురు తెలుగమ్మాయిలు!!

 నాలుగవ సీపీఎల్ సెంచరీ:

నాలుగవ సీపీఎల్ సెంచరీ:

గేల్‌తో పాటు చడ్విక్ వాల్టన్ (73: 36 బంతుల్లో 3ఫోర్లు, 8సిక్సర్లు) కూడా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. వాల్టన్, గేల్ పరుగుల వరద పారించడంతో జమైకా సునాయాసంగా 200 పరుగుల మార్క్ అందుకుంది. ఈ జోడి కేవలం 79 బంతుల్లో 165 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 18వ ఓవర్ ప్రారంభంలో వాల్టన్ ఔట్ అయినా.. గేల్ తన నాలుగవ సీపీఎల్ సెంచరీని అందుకున్నాడు. జమైకా చివరి మూడు ఓవర్లలో 42 పరుగులు చేసింది. ఫాబియన్ అలెన్, అల్‌జారీ జోసెఫ్ చెరో రెండు వికెట్లు తీశారు.

17 బంతుల్లోనే అర్ధ శతకం;

242 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సెయింట్ కిట్స్ విజయం సాధించడం కష్టమేనని అందరూ భావించారు. కానీ.. సెయింట్ కిట్స్ జట్టు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మరో ఏడు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని అందుకుంది. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ దేవన్ థామస్ (71), ఎవిన్ లూయిస్ (53) విరుచుకుపడడంతో సెయింట్ కిట్స్ లక్ష్యం దిశగా సాగింది. లూయిస్ 17 బంతుల్లోనే అర్ధ శతకం అందుకున్నాడు. థామస్, లూయిస్ పవర్‌ప్లేలో చివరి నాలుగు ఓవర్లలో 15, 21, 23, 14 పరుగులు చేయడంతో మొత్తంగా (6 ఓవర్లలలో) సెయింట్ కిట్స్ 89 పరుగులు చేసింది.

గేల్ సెంచరీ వృథా:

గేల్ సెంచరీ వృథా:

మిగతా బ్యాట్స్‌మన్‌ చెలరేగడంతో సెయింట్ కిట్స్ మొదటి 10 ఓవర్లలో 133 పరుగులు చేసింది. అనంతరం లారీ ఎవాన్స్ (41), ఫాబియన్ అలెన్ (37నాటౌట్) సమష్టిగా రాణించడంతో 18.5 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి సెయింట్ కిట్స్ గెలుపొందింది. జమైకా బౌలర్లలో ఒషానే థామస్ నాలుగు, ఆండ్రీ రస్సెల్ రెండు వికెట్లు తీశారు. ఈ విజయంతో గేల్ భారీ సెంచరీ వృథా అయింది.

Story first published: Wednesday, September 11, 2019, 12:47 [IST]
Other articles published on Sep 11, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X