న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

లియోనల్ మెస్సీ మనవాడే.. కాంగ్రెస్ ఎంపీ ట్వీట్! ఆడుకుంటున్న నెటిజన్లు!

Congress MPs tweet Lionel Messi was born in Assam triggers hilarious meme fest

న్యూఢిల్లీ: ప్రపంచంలో ఎవరూ ఏది సాధించినా.. వారిని భారత్‌తో ముడిపెడుతుండటం తరుచూ చూస్తుంటాం. భారత సంతతి అనో.. భారత్‌తో సంబంధాలున్నాయనో చెబుతూ గర్వపడుతుండటం చదవుతూ ఉంటాం. తాజాగా ఫిఫా ప్రపంచకప్ విజేత అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీని కూడా ఈ తరహాలోనే మనవాడు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం చర్చనీయాంశమైంది.

ఓ పార్లమెంట్ సభ్యుడే మెస్సీ మనవాడంటూ ట్వీట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఆదివారం జరిగిన ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లో అర్జెంటీనా4-2(షూటౌట్) తేడాతో డిఫెండింగ్ చాంపియన్‌ ఫ్రాన్స్ ఓడించి విశ్వవిజేతగా నిలిచింది.

మెస్సీ మనవాడే అంటూ..

మెస్సీ మనవాడే అంటూ..

ఈ విజయంతో మెస్సీ పేరు మారుమోగింది. ఫైనల్ మ్యాచ్ సహా ఈ వరల్డ్ కప్‌లో అర్జెంటీనా విజయాల్లో కీలక పాత్ర పోషించిన మెస్సీ‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ క్రమంలోనే మెస్సీని కొనియాడుతూ ట్వీట్ చేసిన కాంగ్రెస్ ఎంపీ అబ్దుల్ ఖలీక్.. అతను మనవాడేనని పేర్కొన్నారు. అదెట్టా.. అని నెటిజన్లు ప్రశ్నించగా, అర్జెంటీనా ఫుట్‌బాలర్ మన అస్సాంలోనే పుట్టాడని వివరణ ఇచ్చారు. ఆ తర్వాత తన తప్పు తెలుసుకొని ట్వీట్లు డిలీట్ చేశారు. కానీ, నెటిజన్లు .. ఆ స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తూ.. మీమ్స్‌తో చెలరేగిపోతున్నారు.

అస్సాంలో పుట్టాడని..

అస్సాంలో పుట్టాడని..

'మెస్సీకి నా అభినందనలు. అస్సాంతో మీకున్న సంబంధంతో మీ పట్ల మేం గర్వపడుతున్నాం.' అని ఎంపీ అబ్దుల్ ఖలీక్ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్‌కు ఒక యూజర్ స్పందిస్తూ 'అస్సాం కనెక్షన్ ఎలా?' అని ప్రశ్నించాడు. అందుకు ఎంపీ బదులిస్తూ 'అవును, అతడు అస్సాంలో జన్మించాడు' అని పేర్కొన్నారు. ఎంపీ అబ్దుల్ ఖలీల్ తన ట్వీట్‌ను వెంటనే తొలగించారు. పుకార్లను వ్యాప్తి చేయుద్దంటూ ప్రజలను కోరాడు. కానీ, అప్పటికే ఆలస్యం జరిగిపోయింది.

ట్వీట్ డిలీట్ చేసినా..

ట్వీట్ డిలీట్ చేసినా..

ఆయన ట్వీట్లు స్క్రీన్‌షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో అవి వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు దీనిపై మీమ్స్ ఫెస్ట్‌ను మొదలుపెట్టారు. 'అవును సార్, అతడు నా క్లాస్‌మేట్' అంటూ ఓ యూజర్ మెస్సీ ఫొటోను పోస్ట్ చేసాడు. మెస్సీ, అతడి భార్య అస్సాం సంప్రదాయ దుస్తుల్లో ఉన్న ఫొటోను మరో యూజర్ పోస్ట్ చేశాడు. 'మెస్సీ అస్సాంలో పుట్టాడని నేను ఈరోజే తెలుసుకున్నాను' అంటూ సెటైర్ వేశాడు.

హోరాహోరీ పోరులో..

హోరాహోరీ పోరులో..

ఆదివారం జరిగిన ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లో అర్జెంటీనా 4-2తో డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్‌ను ఓడించింది. నిర్ణీత సమయం, అదనపు సమయం కలిపి ఇరు జట్లు 3-3తో సమంగా నిలవగా.. షూటౌట్‌తో ఫలితం తేల్చారు. అర్జెంటీనా తరఫున కెప్టెన్ లియోనల్ మెస్సీ(23వ నిమిషం, 108వ నిమిషం) రెండు గోల్స్ చేయగా.. మరియా(36వ నిమిషం) ఓ గోల్ కొట్టాడు. ఫ్రాన్స్ తరఫున ఎంబాపే ఒక్కడే(80వ నిమిషం, 81వ నిమిషం, 118వ నిమిషం) హ్యాట్రిక్ గోల్స్ సాధించాడు. కానీ షూటౌట్‌లో అర్జెంటీనా కీపర్ అడ్డుగోడలా నిలబడటంతో ఆ జట్టు విజయం లాంఛనమైంది.

Story first published: Monday, December 19, 2022, 21:45 [IST]
Other articles published on Dec 19, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X