న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Ravi Shastri: ఆ ఒక్కటి సాధిస్తే.. అంతకుమించిన ఆనందం మరొకటి ఉండదు: శాస్త్రి

Coach Ravi Shastri says If India win T20 World Cup that will be the great achievement for me
Ravi Shastri - If India Win T20 World Cup That Will Be The Great Achievement For Me| Oneindia Telugu

లండన్: టీమిండియా హెడ్‌ కోచ్‌గా తాను అనుకున్నదాని కన్నా ఎక్కువే సాధించానని రవిశాస్త్రి తెలిపాడు. తన నేతృత్వంలో భారత్ ఐదేళ్లు టెస్టు క్రికెట్‌లో నంబర్‌వన్‌గా కొనసాగిందన్నాడు. ఇంగ్లండ్ జట్టుతో నాలుగో టెస్టు సందర్భంగా రవిశాస్త్రి కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఇటీవలే మహమ్మారి నుంచి కోలుకొన్న శాస్త్రి.. భారత్‌కు తిరిగి వచ్చేందుకు ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలోనే అక్కడ ఓ అంతర్జాతీయ పత్రికతో మాట్లాడుతూ టీమిండియా కోచ్‌గా తన ప్రయాణం గురించి వివరించాడు. యూఏఈలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌ 2021 తర్వాత టీమిండియా ప్రధాన కోచ్‌ పదవి నుంచి రవిశాస్త్రి తప్పుకుంటున్న విషయం తెలిసిందే.

NZ Vs Pak: 'పాకిస్థాన్ క్రికెట్‌ను న్యూజిలాండ్ చంపేసింది.. అప్పుడు భద్రత గుర్తుకురాలేదా?!'NZ Vs Pak: 'పాకిస్థాన్ క్రికెట్‌ను న్యూజిలాండ్ చంపేసింది.. అప్పుడు భద్రత గుర్తుకురాలేదా?!'

ప్రపంచకప్‌ ఒక్కటి సాధిస్తే:

ప్రపంచకప్‌ ఒక్కటి సాధిస్తే:

'నేను అనుకున్నవన్నీ సాధించా. నా నేతృత్వంలో భారత జట్టు ఐదేళ్లు టెస్టు క్రికెట్‌లో నంబర్‌వన్‌గా కొనసాగింది. ఆస్ట్రేలియాలో రెండుసార్లు విజయాలు సాధించింది. ఇంగ్లండ్‌ను కూడా సొంతగడ్డపై ఓడించింది. ఈ విషయాలపై ఇంగ్లీష్ మాజీ ప్లేయర్‌ మైఖేల్‌ అథర్టన్‌తోనూ మాట్లాడాను. కరోనా కాలంలో భారత్‌.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లాంటి దేశాల్లో విజయాలు సాధించింది. తాజ పర్యటనలో 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఓవల్‌, లార్డ్స్‌ మైదానాల్లో భారత్‌ విజయాలు సాధించడం నాకెంతో ప్రత్యేకం. అలాగే ప్రతి జట్టునూ వారి సొంతగడ్డపైనే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఓడించింది. టీ20 ప్రపంచకప్‌ 2021 ఒక్కటి సాధిస్తే నాకు అంతకుమించిన ఆనందం మరొకటి ఉండదు' అని రవిశాస్త్రి అన్నాడు.

ఎక్కడైనా ఎక్కువకాలం ఉండకూడదు:

ఎక్కడైనా ఎక్కువకాలం ఉండకూడదు:

ఎక్కడైనా ఎక్కువకాలం ఉండకూడదనేది తన అభిమతమని, తన నేతృత్వంలో భారత్ గొప్ప విజయాలు సాధించిందని రవిశాస్త్రి గుర్తుచేశాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లో టెస్టు విజయాలు సాధించడం తన 40 ఏళ్ల క్రికెట్‌ జీవితంలో అత్యంత సంతృప్తికరమైన క్షణాలన్నాడు. రాబోయే టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ విజేతగా నిలవడానికి పూర్తిస్థాయిలో కృషిచేస్తామని చెప్పాడు. తమ శక్తి సామర్థ్యాల మేరకు పోరాడితే కప్పు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. ఇకపై టెస్టు క్రికెట్‌ గురించి మర్చిపోయి టీ20 మజాను ఆస్వాదించాలన్నాడు. సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ 2021 ఆరంభం అవుతుండగా.. అక్టోబర్ 17న టీ20 ప్రపంచకప్‌ మొదలవనుంది. దాదాపు రెండు నెలలు అభిమానులు టీ20లను ఎంజాయ్ చేయనున్నారు.

భారత జట్టును వీడడం బాధాకరం:

భారత జట్టును వీడడం బాధాకరం:

ఇక చివరగా భారత జట్టును వీడి బయటకు వెళ్లడం చాలా బాధాకరంగా ఉందని టీమిండియా హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి చెప్పాడు. అయితే ఎంతో మంది గొప్ప ఆటగాళ్లతో నాలుగేళ్లు కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. తనకాలంలో టీమిండియా డ్రెస్సింగ్‌ రూమ్‌లో మంచి వాతావరణం ఉండేదని, అన్నింటికీ మించి తాము సాధించిన విజయాలే తమను గర్వంగా ఉంచుతాయని రవిశాస్త్రి చెప్పాడు. 10 రోజుల ఐసోలేష‌న్‌లో ఒక్క పారాసిట‌మాల్ కూడా వేసుకోలేదని తెలిపాడు. తనకు ఎలాంటి లక్షణాలు లేవని, కేవలం గొంతు నొప్పి ఒక్క‌టే ఉందని చెప్పాడు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో తనకు వైరస్ సోకలేదని, అంతకుముందే సోకుంటుందని టీమిండియా హెడ్‌ కోచ్‌ స్పష్టం చేశాడు.

2017లో హెడ్‌ కోచ్‌గా:

2017లో హెడ్‌ కోచ్‌గా:

రవిశాస్త్రి 2017లో భారత జట్టు హెడ్‌ కోచ్‌గా ఎంపికయ్యాడు. అంతకుముందు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో విభేదాల కారణంగా కోచ్‌గా ఉన్న అనిల్‌ కుంబ్లే ఆ బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు. అప్పటి నుంచి 2019 వరకు శాస్త్రి తొలిసారి రెండేళ్ల కాలపరిమితికి ఎంపికయ్యాడు. రవిశాస్త్రి సక్సెస్ అవ్వడంతో అనంతరం మళ్లీ రెండేళ్లకు తన కాలపరిమితిని పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే రాబోయే ప్రపంచకప్‌ తర్వాత తన గడువు ముగియనుంది. దీంతో బీసీసీఐ ఇప్పుడు కొత్త కోచ్‌ ఎంపికకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మాజీ కోచ్‌ కుంబ్లేను తిరిగి తీసుకురావాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం.

Story first published: Saturday, September 18, 2021, 15:15 [IST]
Other articles published on Sep 18, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X