న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ, శాస్త్రి మద్దతుతోనే: టెస్టుల్లో ఓపెనర్‌గా రోహిత్ శర్మ మనోగతం!

IND vs SA 3rd Test : Ravi Shastri And kohli's Support Helped Me Says Rohit Sharma || Oneindia Telugu
coach and captains support helped me, says Man of the Series Rohit Sharma

హైదరాబాద్: కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి తన సామర్ధ్యాలపై ఉంచిన నమ్మకమే టెస్టుల్లో ఓపెనింగ్ పొజిషన్‌ను సొంతం చేసుకోవడానికి దోహదపడిందని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 202 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

దక్షిణాఫ్రికాపై టెస్టుల్లో టీమిండియాకు ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. దీంతో టెస్టు క్రికెట్ చరిత్రలో దక్షిణాఫ్రికాపై 3-0తో సిరిస్‌ను గెలిచిన ఏకైక జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. ఈ సిరిస్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ విజయవంతమయ్యాడు. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 132.25 యావరేజితో 529 పరుగులు చేశాడు.

PHOTOS: 3-0తో సిరిస్ క్లీన్ స్వీప్: టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో ధోని సందడిPHOTOS: 3-0తో సిరిస్ క్లీన్ స్వీప్: టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో ధోని సందడి

రాంచీ టెస్టులో డబుల్ సెంచరీ సాధించిన రోహిత్ శర్మ అటు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌తో పాటు మ్యాన్ ఆఫ్ ద సిరిస్ అవార్డుని కూడా అందుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో రోహిత్ శర్మ ఒక డబుల్ సెంచరీ, రెండు సెంచరీలు సాధించాడు. అయితే, ఇదంతా కెప్టెన్ కోహ్లీ, కోచ్‌ రవిశాస్త్రి, జట్టు మేనేజ్‌మెంట్‌ మద్దతుతోనే సాధ్యమైందని అన్నాడు.

"కోచ్, కెప్టెన్ మద్దతు సహాయపడింది. ఓపెనింగ్ స్లాట్ అవకాశం ఇచ్చినందుకు జట్టు మేనేజ్‌మెంట్‌కు కృతజ్ఞతలు. ఈ సిరీస్‌లో కొత్తబంతిని సమర్థంగా ఎదుర్కొన్నాను. ప్రపంచంలో ఎక్కడైనా కొత్తబంతి బ్యాట్స్‌మెన్‌కు ఇబ్బందే. టెస్టుల్లో ఓపెనర్‌గా నాకు శుభారంభం దక్కింది. 2013లో వైట్‌బాల్‌ క్రికెట్‌లో ఓపెనర్‌గా దిగినప్పుడు క్రమశిక్షణతో బ్యాటింగ్‌ చేయాలని తెలుసుకున్నా" అని అన్నాడు.

3-0తో క్లీన్‌స్వీప్:కెప్టెన్‌గా అజహర్ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లీ, డుప్లెసిస్ చెత్త రికార్డు3-0తో క్లీన్‌స్వీప్:కెప్టెన్‌గా అజహర్ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లీ, డుప్లెసిస్ చెత్త రికార్డు

"క్రీజులో కుదురుకుంటే విజృభించవచ్చు. ఈ తరహాలోనే నేను బ్యాటింగ్‌ చేశాను. ఇదే నా బ్యాటింగ్‌లో కొంత విజయాన్ని సాధించింది. నేను జట్టు కోసం అలా చేయగలనని నేను నమ్ముతున్నాను. మీరు ఎప్పుడైనా ప్రవేశిస్తే, అది మిమ్మల్ని తప్పించగల తప్పులు మాత్రమే అని నేను ఎప్పుడూ నమ్ముతాను" అని రోహిత్ శర్మ అన్నాడు.

"కొత్త బంతిని ఎదుర్కోవడం ఎంత కష్టమో మేము చూశాం. అయితే, ఆస్టేజి దాటిన తర్వాత బంతిని ఎలా ఎదుర్కొనాలో అవగాహన వస్తుంది. ఈ క్రమంలో జట్టు యాజమాన్యం, కోచ్‌, కెప్టెన్‌ మద్దతు ఎంతో దోహదపడింది. భారీ ఇన్నింగ్స్‌లు ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషిస్తా" అని రోహిత్ శర్మ తెలిపాడు.

Story first published: Tuesday, October 22, 2019, 13:36 [IST]
Other articles published on Oct 22, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X